Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పోలవరంలో ఏమిటీ గైడ్ బండ్..? ఎందుకు ఇది..? ఆ రెండు వార్తల విశ్లేషణ…

June 6, 2023 by M S R

Siva Racharla………     పోలవరం – గైడ్ బండ్…… ఈ రోజు పోలవరం మీద రెండు వార్తలు ,

1. 12,911 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తామని కేంద్ర ఆర్ధిక ప్రకటించింది.

2. గైడ్ బండ్ కుంగింది

Ads

పోలవరం అంటే ఒక బ్రహ్మ పదార్ధం ప్రచారానికి విరుగుడుగా సోషల్ మీడియా ద్వారా బాగానే సబ్జెక్టు మీద ఆర్టికల్స్ పడ్డాయి. ఈ రోజు వరకు ఏ డిబేట్ లో చర్చకు రాని “గైడ్ బండ్” మీద వార్త రావటం జరిగింది.

పోలవరానికి కేంద్రం అదనంగా ఒక్క రూపాయ ఇవ్వదన్న ప్రచారం జరుగుతుండగా ఇలా దాదాపు 13 వేల కోట్లు ఇస్తామనటం ఆహ్వానించ వలసిన పరిణామం. ఈ డబ్బుతో ఇంకా భవిషత్తులో నిధులు రావు అనేదే కేవలం రాజకీయ వాదన.

రెండో వార్త ,

గైడ్ బండ్ కుంగటం మీద. నేను 2022 సెప్టెంబర్ లో పోలవరం సందర్శించినప్పుడు ఈ గైడ్ బండ్ నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. EE గారిని గైడ్ బండ్ వివరాలు అడిగి తెలుసుకున్నాను.

నేను అనేక డిబేట్లలో చెప్పినట్లు పోలవరం అనేది ఒక వైవిధ్యమైన ప్రాజెక్ట్. నదిని అప్రోచ్ ఛానల్ ద్వారా కుడి వైపుకు మళ్లించి అక్కడ స్పిల్ వే కట్టి 48 గేట్ల ద్వారా ప్రవాహాన్ని నియంత్రించి కుడి ఎడమ కాలువలకు నీరు వదులుతారు, మిగిలిన నీటిని గేట్ల ద్వారా వదిలి పైలెట్ ఛానల్ ద్వారా మళ్ళీ నదిలో కలుపుతారు.

నది ప్రవాహ భాగంలో ECRF (Earth Cum Rock Fill Dam) ను కట్టి నీటిని నిలువ చేస్తారు. ఈ నీరు స్పిల్ వే వైపు ప్రవహిస్తుంది. ECRF వెనుక నుంచి నీరు నేరుగా స్పిల్ వే వైపు అంటే ఒకటి ,రెండు మరియు మూడో గేట్లను నేరుగా తాకకుండా నీటి వేగాన్ని నియంత్రిస్తూ ప్రవహింప చేయటానికి స్పిల్ వే ఎడమ వైపు గైడ్ బండ్ ను కట్టారు.

polavaram

గైడ్ బండ్ కు IRICEN (Indian Railways Institute of Civil Engineering) వాళ్ళు ఇచ్చిన నిర్వచనం,

These are provided for guiding the flow of water in a given cross section and in particular alignment i.e., straight and non-twisted approach to bridge structure. Guide bunds also prevent the river cutting into the bridge approaches, causing breaches and forming deep scour at abutments. These objectives are achieved by giving Guide Bunds of suitable shape, providing adequate length by adding curved heads and by giving suitable protection to exposed faces against river attack.

గైడ్ బండ్ లేకుంటే ఎడమ వైపు ఉన్న గేట్ల మీద ఒత్తిడి పడటం, సిల్ట్ లెవెల్ లో వేగంగా సిల్ట్ పెరగటం జరుగుతుంది. అదనంగా ఆప్రాంతంలో సుడి గుండాలు ఏర్పడటానికి అవకాశం ఉంది.

నీటి ప్రవాహ వేగం ఎడమ గేట్ల వైపు నీటి ప్రవాహ వేగం 14 మీటర్లు/సెకన్ , మధ్యలో 8 మీటర్లు/సెకన్ , కుడి వైపు 3 మీటర్లు/సెకన్ ఉంటుందని అంచనా. గైడ్ బండ్ నిర్మించి నీటి వ్రవాహాన్ని నియంత్రించటం వలన ఎడమ, మధ్య, కుడి మూడు భాగాలలో నీటి ప్రవాహాన్ని 4 నుంచి 5 మీటర్ల /సెకన్ మధ్య ఉండేలా నియంత్రించవచ్చు , దీనితో స్పిల్ వే మరియు గేట్ లు సురక్షితంగా ఉంటాయి. గేట్లను ఆపరేట్ చేయటంలో ఇబ్బందులు ఉండవు.

ఈ గైడ్ బండ్ ఎక్కువ భాగం రాక్ ఫిల్ కట్టడం, ఇది కుంగటం అనేది ఉండకపోవచ్చు కానీ మధ్యలో చీలిక వచ్చింది. ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం లేదు కానీ చీలికకు కారణాన్ని యుద్దప్రాతిపదిక కనుక్కోవాలి. పోలవరం నిర్మాణం మొత్తం సింగిల్ డిజైన్ కాదు. స్పిల్ వే , గేట్లు, డైయఫ్రేమ్ వాల్,అప్పర్ కాఫర్ డ్యామ్ మాత్రమే ఇప్పటి వరకు పూర్తి స్థాయి పరీక్షను ఎదుర్కొన్నాయి. మిగిలిన కాంపోనెంట్ల డిజైన్లలో లేదా నిర్మాణాలలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో ఆడిటింగ్ జరగాలి. చీలిన గైడ్ బండ్ ఆగస్టు లోపల రిపేర్ చెయ్యాలి.

guide bund

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions