.
( పొట్లూరి పార్థసారథి ) …. “ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి కంటే అధికారంలో లేనప్పుడే చాలా ప్రమాదకారి” … మాజీ భారత ప్రధాని అటల్ బీహారీ వాజయి!
రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నాడు అంటే మన దేశంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది! సోమవారం రాత్రి నాగపూర్ లో హింసాకాండ జరిగింది! RSS హెడ్ క్వార్టర్స్ ఉన్న నాగపూర్ ని టార్గెట్ చేశారు అంటే ముందు ముందు దేశంలో ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు!
Ads
నాగపూర్ లో హింస చెలరేగిన క్రమం….
సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలు
1.విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఔరంగ జేబు సమాధిని తొలగించాలి అని డిమాండ్ చేసాయి.
2.VHP, భజరంగ్ దళ్ గడ్డితో చేసిన ఔరంగ్ జేబ్ సమాధిని తగులబెట్టాయి.
3.మధ్యాహ్నం ఓ గుంపు దాదాపుగా 250 మంది వీధులలోకి వచ్చి నినాదాలు చేస్తే పోలీసులు సర్ది చెప్పి పంపించేశారు! పోలీసులు సర్ది చెప్తున్న వీడియోని పోలీసులు ఆ గుంపు మీద దాడిచేస్తున్నట్లుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు!
4. రాత్రి 7.30 కి ఓ ఏరియాలో గుంపులు గా వచ్చినవాళ్లు చాలా సెలిక్టివ్ గా ఇళ్ళు, షాపుల మీద దాడిచేయడం మొదలుపెట్టారు. కార్లు, బైకుల పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. హింస క్రమంగా ఇతర ప్రాంతాలకి పాకింది.
5. నాగపూర్ పోలీసులు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా అల్లర్లు ఆగలేదు!
6.రాత్రి 12.30 లకి అదనపు బలగాలు వచ్చిన తరువాత కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు.
7. ఇందులో నాగపూర్ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతున్నది. మధ్యాహ్నం 3.30 కి 250 మంది గుమికూడినప్పుడే అదనపు బలగాలు కావాలని అడిగి ఉండాల్సింది కానీ ఆపని చేయలేదు DCP.
8. రాత్రి 7.30 కి హింస మొదలువ్వగానే అదనపు బలగాలని సిద్ధం చేసుకోవాల్సింది కానీ అప్పుడు కూడా అడగలేదు. ఉన్న స్టేషన్ స్టాఫ్ తో అదుపు చేయాలని చూసి భంగపడ్డారు.
9. చివరికి అర్ధరాత్రి 12.30 కి అదనపు బలగాలు వచ్చిన తరువాత అదుపులోకి వచ్చింది.
10.ఈ లోపు 4గురు DCP లు గాయపడ్డారు. ఒక DCP నీకేతన్ కదం మీద గొడ్డలితో దాడి చేయగా ICU లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
11. 30 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు.
12 మొత్తం నాగపూర్ లోని 11 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.
13. 70 మంది మీద కేసులు నమోదు చేశారు. నిన్న మధ్యాహ్నం నుండి కేసులు నమోదు అయిన వారి ఇళ్ళు ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకున్నారు కాబట్టి బుల్డోజర్లతో కూల్చేశారు కార్పొరేషన్ సిబ్బంది!
నిజంగానే ఔరంగజెబు సమాధిని కూల్చివేయాలని అనే డిమాండ్ మీద హింస చెలరేగిందా? జస్ట్, అదొక తక్షణ కారణం మాత్రమే! మనదేశంలో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపే కార్యక్రమం ఢిల్లీలో మొదలయ్యింది! నివాస ధ్రువీకరణ పత్రాలు సరిచూడడం మొదలవ్వడంతో ఓటు బ్యాంక్ తగ్గిపోతున్నది అనే భయంతోనే నాగపూర్ లో హింసని ప్రేరేపించారు!
Well..! ఆధార్ తో ఓటర్ ఐడిని లింక్ చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం కూడా అక్రమ వలసదార్లకి, వాళ్లకి అండగా ఉంటున్న రాజకీయ నాయకులకి ఇది మింగుడు పడని చర్య! ఎంత లేదన్నా 5 కోట్ల ఓటర్ కార్డులు చెల్లకుండా పోతాయి. అఫ్కోర్స్! ఒకే పేరుతో ఉన్న ఓటర్ ID లు రెండు ఉంటే ఆధార్ తో లింక్ అవకుండా సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయబోతున్నారు కాబట్టి తిరస్కరణకి గురయ్యే ఓటర్ ID ల సంఖ్య అనుకున్న దానికంటే ఎక్కువే ఉండవచ్చు!
నాగపూర్ హింస అనేది కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక! ఎందుకంటే RSS హెడ్ క్వార్టర్ ఉన్న నాగపూర్ లోనే మేము దాడి చేయగలిగాము అని ఒక మెసేజ్ ఇచ్చారు! ప్రీ ప్లాన్డ్ గా చేశారు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అసెంబ్లీలో అన్నాడు కానీ అది కేవలం మొదలు అని ఆయనకీ తెలుసు!
కేంద్ర నిఘా విభాగం అయిన IB కానీ, మహారాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం కానీ పసిగట్ట లేకపోయాయి అంటే అక్రమ వలసదార్లని బయటికి పంపే కార్యక్రమం అడ్డుకోవడానికి ఎప్పుడో ప్రిపేర్ అయిపోయారు! అమెరికాలో జరిగితున్నంత స్మూత్ గా మన దేశంలో జరుగుతుందా? జరగదు. దానికి ప్రీ టెక్స్ట్ గానే నాగపూర్ హింస!
వక్ఫ్ బిల్, ఆధార్ ఓటర్ ID లింక్, రోహింగ్యాలని, బాంగ్లాదేశ్ పౌరులని బయటికి పంపే కార్యక్రమాలని జార్జ్ సోరోస్, రాహుల్ అంత తేలికగా జరగనిస్తారా?
********
అమెరికాలో డెమోక్రాట్ల ప్రభుత్వం పడిపోగానే రాహుల్ ఇకముందు యూరోపు వెళతాడా అనే సందేహం వచ్చింది.
అఫ్కోర్స్! బ్రిటన్ లో కీర్ బామర్ అనే లెఫ్టిస్ట్ ప్రధాన మంత్రి ఉన్నా లండన్ వెళ్లకుండా వియత్నాం ఎందుకు వెళుతున్నాడు అనే ప్రశ్నకి సమాధానం దొరికింది.
ఒకసారి రాహుల్ వియత్నాం షెడ్యూల్ చూడండి
2024 జులై నెలలో ఢిల్లీలోని వియత్నాం రాయబారిని కలిసాడు రాహుల్.
2024 ఆగస్టు నెలలో సోనియా, మల్లిఖార్జున్ ఖర్గే మరియు గౌరవ్ గోగోయ్ కలిసి ఢిల్లీ లో వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ ( Pham Minh Chinh) ని కలిశారు. గౌరవ్ గోగోయ్ లోక్ సభలో డిప్యూటీ ప్రతిపక్ష నాయకుడు. గౌరవ్ గోగోయ్ బ్రిటన్ జాతీయరాలు అయిన ఎలిజబెత్ కౌలేబౌర్న్ ( Elizabeth Colebourne) ని వివాహం చేసుకున్నాడు!
డిసెంబర్ 2024 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందితే సంతాపం తెలిపే తీరిక లేనంత అర్జెంట్ పని మీద వియత్నాం వెళ్ళాడు రాహుల్! తమ పార్టీ వాడే అయిన మన్మోహన్ సింగ్ కి కనీసం నివాళి అర్పించే అవకాశం కూడా లేనంత అర్జెంట్ పని ఏముందో వియత్నాంలో రాహుల్ కి?
మార్చి 2025 లో కూడా రాహుల్ వియత్నాంలోనే ఉన్నాడు. రాహుల్ జిమ్ కెళ్ళి వ్యాయాయం చేశాడు అంటూ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో అప్డేట్ చేస్తూ ఉండే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ అంత్యక్రియలు మరియు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమంకి రాహుల్ ఎందుకు రాలేదో వియత్నాం ఎందుకు వెళ్ళాడో ట్విట్టర్ లో చెప్పలేదు దేనికి?
వియత్నాం కమ్యూనిస్ట్ దేశం కానీ సౌత్ ఈస్ట్ ఆసియాలో ఒక ప్రముఖ దేశమే… అయినా గ్లోబల్ పార్టనర్ అయితే కాదు G7 దేశాలలాగా! కానీ…
వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ జార్జ్ సోరోస్ కి అత్యంత సన్నిహిత మిత్రుడు. జార్జ్ సోరోస్ కి వియత్నాంలో మంచి నెట్వర్క్ ఉంది. జార్జ్ సోరోస్ కి చెందిన ఓపెన్ సొసైటీ యూనివర్సిటీ నుండి వియత్నాంలో ఉన్న ఫుల్ బ్రైట్ ( Fulbright University ) కి నిధులు అందుతున్నాయి.
జార్జ్ సోరోస్ కి చెందిన NGO లు వియత్నాం ఫుల్ బ్రైట్ యూనివర్సిటీలో కలర్ రేవల్యూషన్ పేరుతో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాయి గత సంవత్సరం! వియత్నాం ప్రధానికి క్లస్ చాబ్ ( Klaus Schwab) కూడా అత్యంత సన్నిహిత మిత్రుడు. క్లాస్ చాబ్ (World Economic Forum – WEF) వ్యవస్థాపకుడు.
వచ్చే వారంలో బోయింగ్, రాక్ ఫెల్లర్, జేపీ మోర్గాన్ తో పాటు డీప్ స్టేట్ లో భాగంగా ఉన్న పెద్ద సంస్థలు వియత్నాంలో సమావేశం కాబోతున్నాయి! సమ్ థింగ్ ఫిషి!
2023 మే నెలలో బోయింగ్ సంస్థ వియత్నాంలో శాశ్వత ప్రాతిపదికన తన ఆఫీస్ ఓపెన్ చేసింది. బోయింగ్ కి సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తో విడిభాగాల తయారీ ప్లాంట్ ని వియత్నాంలో పెట్టబోతున్నది బోయింగ్! అయితే ఇదే బోయింగ్ భారత్ లో (హైదరాబాద్) టాటాలతో కలిసి బోయింగ్ హెలికాప్టర్ కి సంబంధించి పనిచేస్తున్నది కానీ ప్రయాణీకుల విమానాలకి సంబంధించి విడిభాగాల తయారీతో పాటు భవిష్యత్ లో అమెరికా తరువాత అతిపెద్ద బోయింగ్ తయారీ కేంద్రంగా వియత్నాం ఎదగబోతున్నది!
అఫ్కోర్స్! జార్జ్ సోరోస్ మరియు డీప్ స్టేట్ లోభాగంగా ఉండే సంస్థలు కోవిడ్ తరువాత చైనా నుండి తమ పరిశ్రమలు భారత్ కి కాకుండా వియత్నాంకి తరలించాయి.
మరో కోణం కూడా ఉంది, అది AI, బ్లాక్ చైన్, మెషిన్ టూల్స్ లాంటి వాటిలో భారత్ కి కాకుండా వియత్నాంకే సింహ భాగం ఉద్యోగాలు దక్కేట్లు కుట్ర జరుగుతుండవచ్చు! ఇది తెలిసే ఇన్ఫోసిస్, L&T లాంటి సంస్థ అధినేతలు ఎక్కువ గంటలు పనిచేయాలి అని అంటున్నారు. వాళ్లు పారిశ్రామిక వేత్తలు కాబట్టి ఏం జరుగుతున్నదో, ఏం జరగబోతున్నదో తెలుసు కానీ వివరాలు బయటికి చెప్పరు!
********
మార్చి 14, కాక్స్ బజార్, బాంగ్లాదేశ్!
కాక్స్ బజార్ లోనే రోహింగ్యాల శిబిరాలు ఉన్నాయి. ప్రస్తుత బంగ్లా తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనస్ కాక్స్ బజార్ లోని రోహింగ్యా శిబిరాలని సందర్శించి 2026 కల్లా మిమ్మల్ని మియన్మార్ లోని రఖైన్ స్టేట్ లో ఉన్న మీ స్వస్థలాలకి పంపించే ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చాడు!
యూనస్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధాని కాదు! డీప్ స్టేట్ చేత కూర్చోపెట్టబడ్డ తాత్కాలిక ఇంచార్జ్ మాత్రమే! మియన్మార్ లో ఎవరిని ఒప్పించి రోహింగ్యాలని వెనక్కి పంపిస్తాడు? అక్కడ ప్రభుత్వం అనేదే లేదు. మిలిటరీ ఝంటా కి దేశం మొత్తం మీద పట్టు లేదు. ఎక్కడికక్కడ తిరుగుబాటు నాయకుల అధీనంలో ఉన్నాయి చాలా రాష్ట్రాలు.
రోహింగ్యాలు రఖైన్ స్టేట్ నుండి తరిమివేయబడ్డారు. అదే రఖైన్ స్టేట్ గత 7 నెలలనుండి రఖైన్ ఆర్మీ చేతిలో ఉంది. యూనస్ అరఖాన్ ఆర్మీ ( AA) తో మాట్లాడి ఒప్పించి రోహింగ్యాలని వెనక్కి పంపుతాడా? ఒకవేళ రఖైన్ స్టేట్ ఆర్మీ కంట్రోల్ లో ఉన్నా మియన్మార్ ఆర్మీ ఒప్పుకోదు. ఇప్పుడు AA చేతిలో ఉంది కానీ వాళ్లు కూడా ఒప్పుకోరు!
యూనస్ తో పాటు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జెనరల్ గుటేరస్ ( Guterres ) కూడా రోహింగ్యాలు ఉన్న కాక్స్ బజార్ సందర్శించాడు.
విచిత్రం ఏమిటంటే శరణార్థులుగా ఉన్న రోహింగ్యాలు భారీ సంఖ్యలో హాజరై చేతిలో ప్ల కార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ప్ల కార్డుల మీద ఇలా వ్రాసి ఉన్నాయి.. UN TAKE US TO OUR HOME.. UN ENSURE OUR SAFE & DIGNIFIED RETURN….WE ARE ROHINGYAS NOT STATELESS… NO MORE REFUGE LIFE.
రోహింగ్యాలు మేము శరణార్థులుగా బాంగ్లాదేశ్ లో ఉండలేము అనడానికి కారణం ఐక్యరాజ్య సమితి రూపాయి పంపిస్తే అందులో 10 పైసలు మాత్రమే రోహింగ్యాలకి చేరుతున్నాయి. భారత్ ఎలాగైతే నాణ్యమైన గోధుమలు ఆఫ్ఘనిస్తాన్ కి పంపిస్తే, తనిఖీ పేరుతో ఆ గోధుమలని పాకిస్తాన్ తీసుకొని, పురుగులు పట్టిన గోధుమలని తిరిగి లోడ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కి పంపించినట్లు! దేశం పేరు మారింది మిగతా అంతా షేమ్ షేమ్!
So! భారత్ అక్రమ బంగ్లాదేశీయులని వెనక్కి పంపిస్తే ఎక్కువ అయిపోతుందని రోహింగ్యాలని ఎలాగైనా వెనక్కి పంపించాలని చూస్తున్నారా? లేక రోహింగ్యాల పేరుతో ఏదో రకంగా భారత్ లో హింస ప్రజ్వరిల్లచేసే ప్లాన్ వియత్నాంలో జరుగుతున్నదా?
నాగపూర్ హింస అనేది ముందు ముందు జరగబోయే దానికి ప్రీ టెక్స్ట్ అనే అనుకోవాలి! ఎవరో స్థానిక వ్యక్తిని పట్టుకొని మాస్టర్ మైండ్ అనడం పిచ్చి మాట!
రాహుల్ వియత్నాం పర్యటనకి వెళ్ళినప్పుడల్లా లోక సభ సెక్రటరీకి తన పర్యటన వివరాలు ఇవ్వాలి. అది రూల్! కానీ రాహుల్ తన పర్యటన వివరాలు లోక్ సభ సెక్రటరీకి ఇవ్వకుండానే వెళుతున్నాడు! కానీ రాహుల్ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు?
రాహుల్ LoP అంటే లీడర్ అఫ్ అపోజిషన్. అలాగే ప్రతిపక్ష నాయకుడికి కేంద్ర కాబినెట్ మంత్రి హోదా ఉంటుంది కాబట్టి విదేశీ పర్యటన వివరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది! (ఈ విశ్లేషణ, ఈ అంచనాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు…)
Share this Article