Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పంజాబ్ మళ్లీ కాంగ్రెస్ చేతుల్లో పడితే..? ఖలిస్థానీ శక్తులకు ఊతమే..!!

January 25, 2022 by M S R

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ ఓ ముచ్చట చెప్పాడు… అసాధారణం ఏమీ కాదు, కానీ పంజాబ్‌లో వరుసగా కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు, పంజాబ్ వేగంగా మళ్లీ ఆందోళనకర పరిస్థితుల్లోకి వెళ్తున్న సంకేతాల్లో దీన్ని కూడా చూడొచ్చు… ప్రత్యేకించి కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయం, కేంద్ర ప్రభుత్వ వ్యూహరాహిత్యం, చేతకానితనం కూడా కనిపిస్తాయి… అమరీందర్ గతంలో కూడా పలుసార్లు పాకిస్థాన్ నుంచి వచ్చిపడుతున్న బెడదల గురించి బహిరంగంగానే మాట్లాడాడు… ఇప్పుడేమంటాడంటే..?

‘‘నవజోత్ సింగ్ సిద్ధూను తిరిగి కేబినెట్‌లోకి తీసుకోవాలంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నుంచి అప్పట్లో నాకు ఓ సందేశం అందింది… ఒకవేళ సరిగ్గా పనిచేయకపోతే తీసేయండి అని ఇమ్రాన్ పంపించిన సందేశ సారాంశం…’’

protest

స్థూలంగా చూస్తే పెద్ద తప్పుగా ఏమీ కనిపించదు… ఇమ్రాన్‌తో సిద్ధూకు క్రికెట్ ఆడే రోజుల నుంచీ మంచి పరిచయం… కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభానికి వెళ్లిన సిద్ధూ ఇమ్రాన్‌ఖాన్‌ను పెద్దన్నగా సంబోధిస్తాడు… పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ బజ్వాను కౌగిలించుకుంటాడు… ఇమ్రాన్ ప్రమాణానికి వెళ్లి లయన్ అని కీర్తిస్తాడు… సిద్ధూకు రాచమర్యాలు లభిస్తాయి… అంతేకాదు, అమరీందర్ కేబినెట్‌లో చేరి సిద్ధూ తన కుర్చీకే ఎసరు పెడతాడు… ఫాఫం, కాంగ్రెస్ హైకమాండ్… ఓ నాయకత్వం లేదు, ఓ దశ లేదు, ఓ దిశ లేదు… గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా నడుస్తోంది పార్టీ వ్యవహారం… అమరీందర్‌కు పొగ పెట్టింది… సిద్ధూను ఏకంగా పంజాబీ పీసీసీ చీఫ్‌ను చేస్తుంది… సిద్ధూను ప్రతి దశలో ఎంకరేజ్ చేస్తూ వస్తోంది హైకమాండ్…

Ads

Imran sidhu

సో, వాట్..? ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఏమీ లేనట్టు అనిపిస్తోందా..? ఒక్కసారి వెనక్కి వెనక్కి వెళ్లి, వరుస పరిణామాలన్నీ క్రోడీకరిద్దాం… అఫ్ కోర్స్, మోడీ ప్రభుత్వానికి, బీజేపికి కూడా దిక్కుతోచడం లేదు, ఓ వ్యూహం లేదు, పంజాబ్‌ను ఖలిస్థానీ కోరల్లోకి తోసేస్తోంది… కెనడా, బ్రిటన్ దేశాల్లో సిక్కు ప్రత్యేక దేశ భావనలకు అన్నిరకాల ఊతం దొరుకుతోంది… సిక్ ఫర్ జస్టిస్ వంటి సంస్థలు ఖలిస్థానీ వాదనలకు పదును పెట్టసాగాయి… గతంలో చెలరేగిపోయి, తరువాత సైలెంటైన శక్తులు మళ్లీ తెరమీదకు రాసాగాయి… అది మన ఇంటలిజెన్స్‌కూ తెలుసు… అజిత్ ధోవల్ తెలివితేటలు ఏమీ పారడం లేదు… ఒకప్పుడు స్వర్ణదేవాలయాన్ని ఖలిస్థానీవాదుల నుంచి విడిపించిన దళంలో తనూ ఉన్నాడు… కానీ ఇప్పుడు..?

sikh flag

కేంద్రం తెచ్చిన రైతు చట్టాల్ని సాకుగా చూపి ఖలిస్థానీవాదులు ఒత్తిళ్లు పెంచారు… ఆ బిల్లులకు బలంగా సపోర్ట్ చేసిన అకాలీదళ్ ఈ అంతర్గత ఒత్తిళ్లతో యూటర్న్ తీసుకుంది, ఏకంగా ప్రభుత్వం నుంచి బయటికి వచ్చింది… బీజేపీతో కూడా తెగదెంపులు చేసుకుంది… దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ సెక్షనూ పెద్దగా పట్టించుకోని రైతుచట్టాల్ని ‘‘రైతువ్యతిరేక దుర్మార్గ చట్టాలు’’ పేరిట ఢిల్లీ ముట్టడి జరిగింది… సిక్కులే ప్రధానంగా ఆందోళనల్లో పాల్గొన్నది… ఒక్క సిక్కు సామాజికవర్గానికే ఆ రైతుచట్టాలు వ్యతిరేకమా..? నష్టదాయకమా..? కాదు… ఆందోళనల వెనుక ఆర్థికసాయం, నైతిక మద్దతులు, ఎగదోయడాలు బోలెడు… ఏకంగా ఎర్రకోటపై పతాకాన్ని ఎగరేశారు… వీథుల్లో విధ్వంసం… కేంద్రం కళ్లప్పగించింది… ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వమే ఉన్నా, శాంతిభద్రతలు కేంద్రం చేతుల్లో ఉన్నవే…

sidhu bajwa

నెలల తరబడీ ముట్టడి… చివరకు మోడీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పి మరీ రైతు చట్టాల్ని వాపస్ తీసుకుంది… నైతికంగా మెట్టు దిగింది… రైతు ఆందోళనల పేరిట ప్లాన్లు అమలు చేస్తున్న శక్తులు నవ్వుకున్నయ్… తరువాత పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అమరీందర్‌ను తొలగించింది… పాకిస్థానీ మద్దతుదారు సిద్ధూకు పార్టీ పగ్గాలు ఇచ్చింది… ఖలిస్థానీ శక్తులు బలం పుంజుకుంటున్నాయి… చివరకు ఎక్కడిదాకా వెళ్లిందీ అంటే… ప్రధాని మోడీ పర్యటన వివరాలు లీకై, అంతటి ఎస్పీజీ భద్రత కలిగిన భారతీయ ప్రధానిని ఎటూ కదల్లేని స్థితిలో ఓ ఫ్లై ఓవర్ మీద దిగ్బంధించారు… మన సెక్యూరిటీ సిస్టమ్స్ సిగ్గుతో తలదించుకున్నయ్… మొదట అది రైతులు నిరసనగా చిత్రించే ప్రయత్నం చేశారు… కానీ ఖలిస్థానీ గ్రూపులు మా పనే అని ఓన్ చేసుకున్నయ్… ప్రధాని పర్యటనకు వస్తే సీఎం పట్టించుకోలేదు, సీఎస్-డీజీపీ వెళ్లలేదు… నో ప్రోటోకాల్… ఉద్దేశపూర్వకమా..? ఇంకేమైనా తెరవెనుక వ్యవహారం ఉందా..?

pm

కాంగ్రెస్ ప్రభుత్వం ఏవేవో సాకులు చెప్పింది… ఏదో సీఎస్‌ను, డీజీపీలకు తాఖీదులు గట్రా తూతూమంత్రం చర్యలు తప్ప మోడీ ప్రభుత్వం ఈ విషయంలోనూ కఠినంగా వ్యవహరించలేదు అని అప్పట్లోనే ‘ముచ్చట’ చెప్పింది… అదే జరిగింది… నాలుగు రోజులు హడావుడి… తరువాత అంతా నిశ్శబ్దం… సిద్ధూ బలమైన ఫాలోయర్, మాజీ డీజీపీ ముస్తఫా విద్వేష ప్రసంగాలకు దిగాడు… ఆ వీడియో వైరల్ అయ్యేసరికి ఇక తప్పలేదు… తాజాగా కేసు నమోదైంది…

pm

పంజాబ్‌ కేబినెట్‌లోకి సిద్ధూను తీసుకోవడానికి ఇమ్రాన్ పైరవీలు, కాంగ్రెస్ హైకమాండ్ దానికి తలొగ్గడం ఇప్పుడు బయటికి వచ్చింది… అన్నీ ఒకసారి క్రోడీకరించుకుని ఓ చిత్రాన్ని ఊహించండి… పంజాబ్‌లో ఏం జరుగుతోంది..? కాంగ్రెస్ పాపం ఎంత..? మోడీ వైఫల్యం ఎంత..?! అలాగని బీజేపీ పంజాబ్‌ ఎన్నికల్లో ఏదో సాధిస్తుందని భ్రమపడకండి… బహుశా రెండుమూడు సీట్లు వస్తే గొప్ప… అమరీందర్‌తో పొత్తు కూడినా సరే, పెద్దగా సత్ఫలితాలు రావు… మళ్లీ కాంగ్రెస్ చేతుల్లోనే పంజాబ్ పడితే… రాహుల్ బలంగా వెనకేసుకొచ్చే ఆ ఇమ్రాన్ ఖాన్ జాన్ జిగ్రీ దోస్త్ సిద్ధూకు గనుక నాలుగు కొమ్ములు మొలిస్తే… అప్పుడేంటి..?!

(దేశ సమగ్రత, అంతర్గత భద్రత కోణంలో ఈ కథనం చదవండి… ఒకప్పుడు రోజువారీ మారణకాండ స్కోర్ చదివాం పత్రికల్లో… అనేకమంది సైనికులు, పోలీసులు ప్రాణాలు కోల్పోయారు… అంతెందుకు..? ఇదే కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం అపరదుర్గ వంటి ఓ ప్రధానినే కోల్పోయింది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions