కుమారి ఆంటీ ఎపిసోడ్ చూశాం కదా… దిక్కుమాలిన సైట్లు, ట్యూబ్ చానెళ్లు ఆమె ఫుడ్ స్టాల్ మీద పడి, ఏదేదో రాస్తే తరువాత మెస్ మొత్తానికే తీసేయాల్సిన దుస్థితి వచ్చింది… ఎవడి వ్యూస్ కౌంట్ వాడు చూసుకున్నాడు… ఆమె కూడా పాపం తనకు ప్రచారం వస్తుంది కదా అనుకుంది కానీ ఇలా ఎదురుతిరుగుతుంది అనుకోలేదు… సరే, రేవంత్ సమయానికి అండగా వచ్చాడు లేకపోతే ఆ ఫుడ్ స్టాల్‌కు, ఆమె కడుపుకు తీరని దెబ్బే కదా…
ఫేస్‌బుక్‌లో ఓ వీడియో కనిపిస్తోంది… కుమారి ఆంటీని వదిలేసి ఇక హైదరాబాదులో ఉన్న అలాంటి స్ట్రీట్ మెస్సుల మీద పడ్డాయి కెమెరాలు… ఇలాగే వెళ్లి మరో ఆంటీ మొహం మీద మైకులు పెట్టారు… కుమారి ఆంటీ కథ ఆమెకు తెలుసు కదా… ఇక ఫుల్లు ఫైరయిపోయింది… ఈ జర్నలిజాన్ని ఉడికించి, గోలించి, కాల్చి… కాదు, కాదు, ప్రజెంట్ ట్రెండ్స్ మీద కర్రు కాల్చి వాతలు పెట్టింది… సరాతంతో వాతలు అంటే తెలుసు కదా, అలా…
నిజంగా నిజం… ఆమె బాధలో అర్థముంది… ఎవరో ఓ నయా రిపోర్టరి.,. ఇవీ వార్తలే కదా అని ఏదో సమర్థించుకోచూసింది… కానీ ఫుడ్ ఆంటీ ఆగ్రహం ముందు నిలవలేకపోయింది… అసలే కొన్ని చానెళ్లు దిక్కుమాలిన మూఢనమ్మకాల్ని జనంలోకి తీసుకెళ్తూ సొసైటీకి తీరని నష్టం చేస్తుంటే, ఇదుగో ఇవి కూడా అదనపు సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట…
Ads
ఆ వీడియో ఈ ఫేస్ బుక్ లింకులో చూడండి…
‘చికెన్ బాగుంది, చింతకాయ పచ్చడి బాగుంది, గోంగూర తొక్కు బాగుంది’ ఇదా జర్నలిజం… పొండి, అక్రమాలు జరిగేచోటకు వెళ్లండి, అన్యాయాల దగ్గరకు వెళ్లండి, రేపులు జరుగుతున్నయ్, అవి పట్టించుకొండి… మమ్మల్ని ఇలా బతకనివ్వండి, మా కడుపు కొట్టకండి…’ వావ్, ఏం చెప్పావమ్మా… మండిపడుతూ చెప్పినా సరే, జర్నలిజం బేసిక్ పాఠం చెప్పావు ఆ సోకాల్డ్ జర్నలిస్టులకు… సూపర్ నువ్వు…
ఓ మోపెడ్… వెనుక అయిదారు డబ్బాలు… ఓ వాటర్ క్యాన్, ఓ సంచీలో పేపర్ ప్లేట్లు… ఆరు చిన్న మెత్తని ఇడ్లీలు 20 రూపాయలు.., సేమ్, ఆరు మైసూరు బజ్జీలకు, రెండు దోసెలకు, రెండు సెట్ దోశలకు కూడా అంతే… పుట్నాల చట్నీ, టమాట పచ్చడి… ఉప్మా, పోహా, ఉగ్గాణి… ఏదయినా సేమ్ ధర… ఇలా కొన్ని వేల మంది బతుకుతున్నారు… స్టార్ హోటళ్లతో పోలిస్తే రుచిలో కూడా సూపర్… వీళ్లే కాదు, కర్రీ పాయింట్లు, స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్స్, చైనీస్ ఫుడ్ సరేసరి… మెయిన్ రోడ్ల పక్కనే ఫుడ్ ఆన్ మీల్స్ పేరిట టెంపోలు, వ్యాన్లలో అమ్మే ఫుడ్ స్టాళ్లు కూడా వేలల్లో…
ప్రధాన రహదారుల పక్కన కూడా కనిపిస్తున్నాయి… ఇవే కాదు, క్లౌడ్ కిచెన్ల నుంచి ఆర్డర్లు… రెస్టారెంట్ల నుంచి స్విగ్గీలు, జొమాటోలు… కన్నడ చెయిన్ ఆఫ్ హోటల్స్ లైక్ రాఘవేంద్ర, ఉడిపి ఉపహార్ బ్రాంచులు కూడా… చిన్న చిన్న తోపుడు బండ్ల మీద టిఫినీలు అమ్ముకునే వాళ్లు… వాళ్ల ఫుడ్ బిజినెస్ (బిజినెస్ అని కూడా అనలేం, ఓ ఉపాధి పని) నడిస్తేనే కదా లక్షల కడుపులు నిండేది… అమ్మేవాడిది, తినేవాడిది…
మరి వీటి కవరేజీలో ఎంత బాధ్యత అవసరం, ఎంత జాగ్రత్త అవసరం… ఎస్, మీ పొట్టల కోసం వాళ్ల పొట్టలు కొట్టకండి… ఎగబడకండి… మన జనం కూడా ఇలాగే తయారయ్యారు… ఎవడైనా ఏదైనా చూపిస్తే చాలు, మీద పడిపోతున్నారు… నాలుగు రోజులు ఆగితే చచ్చిపోతారారా..? వెళ్లడం, వీడియోలు తీసి షార్ట్స్, రీల్స్… ఏదో ఘనకార్యం చేసినట్టు…!!
Share this Article