.
నిజానికి రెండేళ్ల క్రితమే చూశాను ఇలాంటి ఫోటో… కేఎఫ్సీ… KFC… కంగారూ ఫాదర్ కేర్… అప్పుడప్పుడూ వార్తల్లో చదువుతూనే ఉన్నాను… తాజాగా Prabhakar Jaini వాల్ మీద ఓ ఫోటో, ఓ వ్యాఖ్యానం చదివాను…
ఎందుకు నచ్చిందీ అంటే… ఓ బిడ్డ కోసం తండ్రి అన్నీ చేస్తాడు, నిశ్శబ్దంగా… కానీ తనకు క్రెడిట్ దక్కదు… తల్లికే బోలెడు ప్రశంసలు… తప్పులేదు, కానీ పాపం తండ్రి ఏం తక్కువ..?
Ads
ప్రియుల కోసం బిడ్డల్ని కూడా రప్పా రప్పా అంటున్న తల్లుల్ని చూస్తున్నాం… సో, తల్లి అనే పదానికి కొత్త నిర్వచనం అర్జెంటుగా అక్కర్లేదు గానీ… ఈ ఫోటో చూడండి ఓసారి… తండ్రి ప్రేమ కూడా ఎంత బలమైందో అర్థం చేసుకుందాం….
ఈ తండ్రి ఎవరు..? ఎక్కడ..? తల్లి ఎట్సెట్రా వివరాలు పెద్దగా తెలియరాలేదు గానీ… ఇదొక్కసారి చదవండి…
ఏ తండ్రీ చేయన గొప్ప కార్యం….
కొడుకు పుట్టాడన్న
ఆనందం ఎంతో సేపు నిలవలేదు
పుట్టిన మరుక్షణం నుండే
ప్రాణం నిలుపుకోవడానికి
పోరాడుతున్న కొడుకుని చూసి,
తండ్రి గుండె కింది కండ కదిలింది.
కొడుకుకు అరుదైన వ్యాధి.
అనుక్షణమూ, శరీరాన్ని వేడిగా
ఉంచే యంత్రం కావాలన్నారు.
ప్రపంచమంతా వెతికినా
అటువంటి యంత్రం దొరకలేదు.
కొడుకు కోసం
తండ్రే యంత్రంగా మారాడు.
క్షణాలు, గడియలు, గంటలు
కొడుకుకు వేడిని పంచే
ఉష్ణ యంత్రంగా మారాడు.
నిదుర లేదు,
మెలుకువ లేదు,
బాధ లేదు,
పగలు లేదూ,
రాత్రీ లేదు,
నొప్పి లేదు,
అలసటా లేదు.
గంటలూ,
రోజులూ,
వారాలు,
నెలా కాదు.
తల్లి కొడుకుని గర్భంలో
పది నెలలు మోస్తే,
తండ్రిగా
తనూ
పది నెలలు తన గుండెల
మీద మోస్తూ,
కొడుకుని కాపాడుకున్న తండ్రికి
ఏం కావాలి?
కొడుకు గుండె బలంగా
కొట్టుకుని, తన ఊపిరిని
తాను పీల్చడం చేస్తున్న
చిన్నారి కొడుకు
ముఖంలోని చిరునవ్వు తప్ప!
Son’s breaths keep going, so father became life giver
This is the story of a father who did what hardly anyone could do to save his sick son. This innocent, who has been battling a serious illness since birth, needed a unique support for life — body warming. Doctors said that the child should get body warmth every moment, otherwise his life is in danger. Then that father held his son to his chest for 10 months.
Neither the consciousness of the day nor the sleep of the night, but the father’s lap became the life of a son. Forgetting all his tiredness, pain, needs, only one thing was in his mind – may the son’s breath continue.
This story is not just about a father’s sacrifice, but of an unparalleled love which is not written in any book, but touches the heart of every man. Such dads neither come in headlines nor dependent on praises—yet the world is incomplete without them.
This story is dedicated to every person who becomes an example of love and dedication without any noise.
స్కిన్ టు స్కిన్ కంటాక్ట్… ప్రిమెచ్యూర్ బేబీలకు కొన్నిచోట్ల సిఫారసు చేస్తున్న పద్ధతి… ఇంక్యుబేటర్లు పనిచేయవు కొన్నిసార్లు… తల్లి కడుపులో మోస్తే, తండ్రి అన్నీ తానై బయట మోస్తాడు, అదే ఇది…
ఇది దేని కోసం… ఉష్ణోగ్రత నియంత్రణ కోసం… బేబీ సరైన నిద్ర కోసం… ఎమోషనల్ బాండింగ్ కోసం… బిడ్డ బతుకుతుందన్న భరోసా కోసం.., స్ట్రెస్ రిలాక్స్ కోసం… సరైన పెరుగుదల కోసం… బిడ్డ బతకడం కోసం… ఇంకా వివరాల్లోకి వెళ్తే థియరీ లెసన్ అవుతుంది… బట్, తండ్రి తండ్రే… అఫ్ కోర్స్, తల్లి కూడా..!!
Share this Article