పార్ధసారధి పోట్లూరి ……… 8 మంది భారత మాజీ నావికదళ సిబ్బందికి మరణ శిక్ష విధించిన ఖతార్ కోర్టు! ఇది గత సంవత్సరం నుండి అనుకుంటున్నదే! నేపధ్యం ఏమిటి?
ఖతార్ కి చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ మరియు కన్సల్టెంట్ సర్వీసెన్ (Al Dahra Global Technologies and Consultancy Services ) అనే సంస్థ భారత నావికా దళంలో పని చేసి పదవీ విరమణ చేసిన అధికారులని తమ సంస్థలో నియమించుకుంది. సదరు సంస్థని ఒమన్ దేశపు ఎయిర్ ఫోర్స్ అధికారి ఖతార్ లో స్థాపించాడు. అల్ దహ్రా సంస్థ ఖతార్ లోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీలకి శిక్షణ ఇస్తుంది. ఖతార్ లోని సెక్యూరిటీ సంస్థలకి కూడా శిక్షణ ఇస్తున్నది!
**********************
Ads
2022 లో ఖతార్ పోలీసులు భారత నౌకదళ మాజీ అధికారులని అరెస్ట్ చేసింది. అయితే ఖతార్ లోని భారత కాన్సులేట్ జనరల్ ఖతార్ విదేశాంగ శాఖ అధికారులని కలిసి విచారించగా ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని అన్నారు. 2022 ఆగస్టు నెలలో గూఢచర్యం ఆరోపణల మీద అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నది ఖతార్. అంటే అరెస్ట్ చేసిన ఆరు నెలల తర్వాత అరెస్ట్ కి కారణం చెప్పారు.
భారత్ తరపున దౌత్యపరమయిన అభ్యర్ధనలు, ఖతార్ కోర్టులో బెయిల్ పిటిషన్లు విఫలమయ్యాయి. ఒక్కసారి మాత్రం భారత నౌకాదళ మాజీ అధికారులతో కాన్సులర్ జనరల్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు ఖతార్ అధికారులు. ఒకే గది ఉన్న జైలు సెల్ నుండి రెండు బెడ్లు ఉన్న సెల్ కి మార్చారు భారత్ అభ్యర్ధన మీద.
********************
ఖతార్ లో మరణ శిక్ష పడ్డ భారత మాజీ నావీ అధికారుల పేర్లు:
1.కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్
2.కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ
3.కెప్టెన్ సౌరభ్ వశిష్ట్
4.కమాండర్ అమిత్ నగపాల్
5.కమాండర్ పూర్నేందు తివారీ
6.కమాండర్ సుగుణాకర్ పాకల
7.కమాండర్ సంజీవ్ గుప్త
8. సైలర్ రాగేష్
********************
ఇది ప్రీ ప్లాన్డ్ కుట్ర అనడానికి అనుమానాలు కాదు, చాలా ఆధారాలు ఉన్నాయి!
1.అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనేది ఖతార్ దేశపు సంస్థ.
2.దానికి ఒమన్ దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ని డైరెక్టర్ గా నియమించింది.
3.అల్ దహ్రాకి ఖతార్ దేశపు నావీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.
4.అల్ దహ్రాని విస్తరించే నెపంతో 8 మంది భారతీయ నౌకాదళం మాజీ అధికారులని నియమించింది.
5.భారత నౌకాదళం అధికారులే ఎందుకు? ఖతార్ కి అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికన్ అధికారులను నియమించుకోవచ్చు కదా? ఖతార్ డాలర్ల రూపంలో జీతాలు ఇవ్వగలదు.
6.ముందస్తు ప్రణాళికతోనే భారత అధికారులని నియమించింది ఖతార్.
గూఢచర్యం చేయడానికి ఏముంది ఖతార్ లో? ఖతార్ మీద గూఢచర్యం చేస్తే భారత్ కి ప్రయోజనం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే వేస్తారు ఎవరయినా! చెప్పాను కదా, ముందస్తు ప్రణాళికతోనే ఖతార్, పాకిస్థాన్ ISI లు కలిసి కుట్ర చేశాయి.
*****************
ఖాతార్ అల్ దహ్రా టెక్నాలజీస్ పేరుతో సంస్థని పెట్టకముందు నుండి ఇటలీ నుండీ సబ్మెరైన్లు కొనడానికి చర్చలు జరుపుతోంది. ఇటలీకి చెందిన Fincantieri SpA అనే సబ్మెరైన్ తయారుచేసే సంస్థతో ఒప్పందం చేసుకుంది ఖతార్ 2020 లో. ఇటాలియన్ సంస్థ Fincantieri SpA సబ్మెరైన్ల నిర్మాణంతో పాటు ఖతార్ సముద్ర తీరంలో ఒక కొత్త నావల్ బేస్ కూడా నిర్మించి ఇస్తుంది. అయితే ఇదంతా అల్ దహ్రా టెక్నాలజీస్ సలహా సంప్రదింపుల మేరకే జరిగింది!
**************
7.ఇటాలియన్ సంస్థతో ఒప్పందం అంశంని 8 మంది భారత్ నౌకాదళం ఆఫీసర్లు ఇజ్రాయెల్ కి సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ అరెస్ట్ చేసింది.
8.అరెస్ట్ చేసిన ఆరు నెలలు దాటినా కారణం చెప్పలేదు ఖాతార్. గూఢచర్యం అని మాత్రమే చెప్పింది.
9.ఇజ్రాయెల్ తో భారత్ కి ఉన్న స్నేహాన్ని సాకుగా చూపి నేరారోపణ చేసింది ఖతార్.
10. 20 లక్షల జనాభా ఉన్న ఖతార్ కి సబ్మెరైన్లు అవసరమా? కేవలం ఇజ్రాయెల్ ని దృష్టిలో పెట్టుకొని కొంటున్నది. అయినా అవి డెలివరీ కావడానికి 2026 దాకా సమయం ఉంది. ఈలోపు మొస్సాద్ వివరాలు సేకరిస్తుంది. దానికి భారత నావీ అధికారులు కావాలా?
*****************
ఖతార్ ఉగ్రవాదులకు ఆర్ధిక, ఆయుధ సహాయం చేస్తున్నది. ఈ విషయం FATF కి తెలుసు కానీ ఖతార్ తో అమెరికాకి ఉన్న అవసరం వలన FATF బ్లాక్ లిస్టులో పెట్టకుండా కాపాడుతూ వస్తున్నది. 1990 లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కువైట్ ని ఆక్రమించుకున్నప్పుడు నాటో సైన్యానికి వాడుకోవడానికి ఖతార్ తన సైనిక బేస్ లని ఇచ్చింది. గ్రౌండ్ సపోర్ట్ ఇవ్వడమే కాక ఇంధనం కూడా సప్లయ్ చేసింది.
అమెరికాతో ఖతార్ కి మిలటరీ, వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి గత 30 ఏళ్లుగా. ఖతార్ ఫండింగ్ చేస్తున్న ఉగ్రవాదుల లిస్ట్…. ISIS-K, అల్ ఖైదా, హమాస్, తాలిబాన్…. హమాస్ లీడర్లు తరుచూ ఖతార్ వచ్చి వెళుతుంటారు. హమాస్ లీడర్లకి ఖతార్ లో విలాసవంతమైన భవనాలు, వ్యాపారాలు ఉన్నాయి . ఖతార్ మీద OIC (Organisation of Islamic Countries) 4 ఏళ్ల నిషేధం విధించింది. ప్రస్తుతం సౌదీ ప్రిన్స్అ మెరికాకి దూరంగా ఉంటున్నాడు కాబట్టి ఖతార్ అవసరం ఉంది అమెరికాకి.
So! విదేశాలలో ఉద్యోగం కోసం వెళ్లేటప్పుడు ఆ దేశంతో మన దేశానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అని తెలుసుకొని వెళ్ళాలి. ఖతార్ ఎప్పుడూ మన మిత్ర దేశం కాదు. పాకిస్థాన్ కంటే ఎక్కువసార్లు కశ్మీర్ విషయం లేవనెత్తుతూ ఉంటుంది ఐక్యరాజ్య సమితిలో. ఎక్కువ జీతానికి ఆశపడి వెళితే ఇలానే జరుగుతుంది. చివరగా… RAW పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలని తీసుకోదు!
Share this Article