.
చేసే అక్రమాలు చేసేయడం… అదేమంటే రాజకీయ ప్రతీకారం కోసం కేసులు పెడుతున్నారని దబాయించడం… ఆందోళనలకు పిలుపునివ్వడం…
సమాజాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే పొలిటికల్ పార్టీలు, నాయకులే కోర్టుల మీద నమ్మకాలు కోల్పోతే ఇక జనానికి ఏం చెబుతారు..? అఫ్‌కోర్స్, మోడీ దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పడం నిజమే… తన పంచన చేరినవారిని ప్రొటెక్ట్ చేయడమూ నిజమే… వాళ్ల అక్రమాలన్నీ బారాఖూన్ మాఫ్ అంటున్నదీ నిజమే…
Ads
కానీ ప్రతి కేసూ రాజకీయ కక్షసాధింపు ఎలా అవుతుంది..? ముడా స్కాంలో సిద్దరామయ్యకు ముడి బిగుసుకుంటోంది… విచారణ కొనసాగాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది… ఇంకోవైపు రాబర్ట్ వాద్రాకూ ఈడీ ఉచ్చు విసిరింది…
మద్యం స్కాంలో ఆప్, బీఆర్ఎస్ నేతలపై ఈడీ కేసులు తెలుసు కదా… ఇదేదో తెలంగాణ వ్యతిరేక చర్య అన్నట్టుగా కవిత ‘తెలంగాణ తలవంచదు’ అంటూ గంభీరమైన వ్యాఖ్యలు… జనం గమనించడం లేదు అనుకుంటే, అర్థం చేసుకోవడం లేదనుకుంటే అదామె ఇష్టం ఇక…
ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? నెహ్రూ కుటుంబం (నాట్, గాంధీ కుటుంబం)లో పెద్దగా ఎవరి మీదా నేరుగా స్కాంల ఆరోపణలు లేవు… తొలిసారి సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్ట్ స్కాంలో ఇంకా కూరుకుపోతున్నారు… ఈడీ దాఖలు చేసిన చార్జి షీటులో ఎ1, ఎ2 వాళ్లే… 661 కోట్ల స్థిరాస్తులను కూడా సీజ్ చేసింది… అసలు ఏమిటా కేసు..?
జస్ట్, 50 లక్షలకు వేల కోట్ల విలువైన ఆస్తులను తమ స్వాధీనం చేసుకున్న తీరే విస్మయకరం… 2014లో సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదుతో ఈ డొంక కదిలింది…
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) అంటే ‘నేషనల్ హెరాల్డ్’ పేపర్ పెట్టిన కంపెనీ… 1935 లో నెహ్రూ మరో 5000 మంది వాటాదారులతో కలసి స్వాతంత్ర పోరాటంలో ఉపయోగపడుతుందనే భావనతో ‘నేషనల్ హెరాల్డ్’ పేపర్ పెట్టాడు… ఈ కంపెనీ పేపర్స్ మాత్రమే పబ్లిష్ చేయాలి, వ్యాపారం చెయ్యకూడదు…
ఈ పేపరాఫీసులు పెట్టడానికి ప్రభుత్వం చాలా పెద్ద నగరాలలో విలువైన స్థలాలు ఈ కంపెనీకి కారుచౌకగా ఇచ్చింది. ఈ కంపెనీకి 90 లక్షల దాకా 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది…
ఐతే అది నెహ్రు కుటుంబం సొంత ఆస్తి కాదు… 5000 మంది వాటాదారుల ఉమ్మడి ఆస్తి. పేపర్ సర్క్యులేషన్ లేక మూతపడింది… అప్పటికి, అంటే 2008 నాటికి దీనికి ₹90 కోట్ల దాకా అప్పులున్నాయి… ఈ అప్పులు తీర్చడానికి అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి వడ్డీ లేకుండా 90 కోట్లు అప్పు ఇచ్చింది…
అంత విలువైన ఆస్తుల్లో ఏ చిన్న భవనమో అమ్మేసినా ఆ 90 కోట్లు తీర్చేయవచ్చు… కానీ ఏం చేశారు..? 2010 లో ‘యంగ్ ఇండియన్ కంపెనీ’ అని ఒక కొత్త కంపెనీని ₹5 లక్షల మూలధనంతో తెరిచారు… అందులో 38% సోనియా 38% రాహుల్ మిగతా 22% ఆస్కార్ ఫెర్నాండేజ్, మోతీలాల్ వోరా వాటాదారులు….
నేషనల్ హెరాల్డ్ అంటే AJL కంపనీ తన షేర్ హోల్డర్లు అందరికీ చెప్పకుండా తనకు ఉన్న 90 లక్షల షేర్స్ ని (అంటే ₹9 కోట్ల మూలధానాన్ని) మరియు ₹90 కోట్ల అప్పుని ఒక బోర్డ్ మీటింగ్ పెట్టి, ఈ కొత్త కంపెనీ ‘యంగ్ ఇండియన్ కంపెనీ’నీకి ట్రాన్స్ఫర్ చేసేసింది..
అంటే నేషనల్ హెరాల్డ్ కి చెందిన ₹2000 కోట్ల ఆస్తి, 9 కోట్ల మూలధనం, కాంగ్రెస్ పార్టీ నుండి వడ్డీ లేకుండా తీసుకున్న ₹90 కోట్ల అప్పు యంగ్ ఇండియాకు ట్రాన్సఫర్ అయిపోయి, యంగ్ ఇండియా కంపెనీ వీటన్నిటికీ యజమాని అయిపోయింది… అంటే అర్ధం అయింది కదా?
ఇంకా ఉంది… యంగ్ ఇండియా కాంగ్రెసు పార్టీకి ₹90 కోట్లు బాకీ ఉంది. కానీ, యంగ్ ఇండియాకి ఉన్న కాపిటల్ 5 లక్షలు మాత్రమే… మరి 90 కోట్ల అప్పు ఎలా తీరుస్తుంది…? అందుకని కాంగ్రెస్ పార్టీ పోనీలే పాపం అని జస్ట్ ₹50 లక్షలు అప్పు తీర్చండి, మిగతాది మేం రైట్ఆఫ్ చేసుకుంటాం అని చెప్పింది…
పోనీ ఆ 50 లక్షలు యంగ్ ఇండియా కంపెనీ దగ్గర ఉన్నాయా అంటే అవీ లేవు… అందుకని కలకత్తాలో ఒక డమ్మీ కంపెనీ (హవాలా కంపెనీ) ఒక కోటి రూపాయలు యంగ్ ఇండియాకి అప్పుగా ఇచ్చింది. ఈ కలకత్తా కంపెనీలు చాలామందికి ఇలాగే క్యాష్ తీసుకొని మళ్లీ వాళ్లకే అప్పు ఇచ్చినట్లుగా చెక్కులు ఇస్తూ ఉంటాయి. 1% నుండి 2% కమిషన్ తీసుకుంటాయి… డమ్మీ, ఫేక్ లావాదేవీలు…
సో… ఎక్కడివో, ఎవరివో తెలియని 50 లక్షల రూపాయలతో ఏకంగా 5 వేల కోట్ల ఆస్తులు రాహుల్, సోనియా అండ్ కో చేతుల్లోకి వెళ్లిపోయాయి అన్నమాట… మరీ సూటిగా చెప్పాలంటే 5 లక్షలతో 5 వేల కోట్లు…
ఇంకా ఉంది… అసలు కాంగ్రెస్ పార్టీ లెడ్జర్లలో నేషనల్ హెరాల్డ్ కి ₹90 కోట్లు అప్పు ఇచ్చినట్లు ఎక్కడా రాయలేదు లేదా చూపించలేదు… అసలు రాజకీయ పార్టీలు వేరే వాళ్లకు అప్పులు ఇవ్వడమే నిషిద్ధం కదా… సో, తవ్వేకొద్దీ డొంక కదిలింది… ఇదంతా బయటపడింది… దర్యాప్తు అనేసరికి రాజకీయ ప్రతీకారం, కక్షసాధింపుల ఉల్టా ఆరోపణలు…!!
Share this Article