Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ అధికారి పొర్లుదండాలు సరే… కానీ ఏది క్షుద్రపూజ, ఏది ‘‘శాస్త్రపూజ’’…

April 7, 2022 by M S R

అవును… ఆయన ఒక రాష్ట్ర వైద్య విభాగానికి డైరెక్టర్… అదీ ప్రజారోగ్యానికి సంబంధించిన విభాగం… శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలి గానీ మూఢనమ్మకాలు, పూజలు ఏమిటనేది రచ్చ నిన్న సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్‌లో జోరుగా సాగింది… తనకు మానవాతీత శక్తులున్నట్టుగా వ్యవహరించే ఓ ఎంపీపీ దగ్గరకు వెళ్లిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఆమె చుట్టూ తిరుగుతూ, చెప్పిన మిరపకాయల పూజేదో చేశాడని ఆరోపణ… అవి క్షుద్ర పూజలు అంటూ ఓ టీవీ చానెల్ చిత్రీకరణ…

 

పదిమందికీ ఆదర్శంగా ఉండాల్సిన తను ఇలా ఓ క్షుద్ర భక్తుడిగా, మూఢనమ్మకాలతో ఆమె దగ్గర పొర్లుదండాలు పెట్టడం ఏమిటనేది నిన్న కొందరి అభ్యంతరం… అది తప్పా ఒప్పా అనేది వదిలేద్దాం… తమకు ఏవో దైవశక్తులున్నాయంటూ ఆశ్రమాలు కట్టి, కోట్లకుకోట్లు కొల్లగొట్టే, ఇతరత్రా వికారాలు కూడా ఉన్న బాబాలను చూస్తూనే ఉన్నాం… సరే, ఆమె కూడా జనాన్ని అలాగే మోసగిస్తోంది అనుకుందాం… ఈయనకు పొలిటికల్ యాస్పిరేషన్లు కూడా ఉన్నట్టున్నయ్…

Ads

 

సదరు ఉన్నతాధికారి చర్య వేర్వేరు జ్ఞానాలు కలిగినవారికి వేర్వేరుగా గోచరిస్తుంది… తనొక్కడేనా ఇలా పొర్లుదండాలు పెడుతున్నది..? నమ్మకం తప్పెలా అవుతుంది..? ఇలాంటి ప్రశ్నలెన్నో…. మిత్రుడు Shiva Prasad ఏమంటాడంటే..?



తెలంగాణ హెల్త్ డైరెక్టర్ క్షుద్రపూజల్లాంటివేవో చేసాడట.

స్వయంగా డాక్టర్, పైగా హెల్త్ డైరెక్టర్..

ఆయన పోయి ఈ క్షుద్రపూజలు చేయడం ఏంటి?

ఈ విమర్శకి ఆయన సమాధానం చెప్పుకోవాలట.

చాలా కాలం క్రితం ఒక ఛానెల్ ఛీఫ్ ఎడిటర్ గా ఇలాంటిదే ఒక పెద్ద గొడవ.

అప్పటి పోలీసు ఉన్నతాధికారి కూడా ఇలాంటి పూజలే చేసాడట.

ఆ చానెల్ మేనేజమెంట్ కి,ఆ డిజిపి కి అప్పటికే ఏవో గొడవలున్నాయి.

ఇదే ఛాన్సని చానెల్ వార్తని పదే పదే వేసింది.

ఇదే ఛాన్సని ఆ అధికారి కూడా వరసగా ఛానెల్ సిబ్బందిని అరెస్టులు చేస్తూ పోయాడు.ఛానెల్ కూడా ఆ దెబ్బకి మూత పడింది.

ఇప్పుడు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కి అంత శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు.

కాకపోతే, ఎప్పుడైనా ఇదే సీన్..

క్షుద్ర పూజలనగానే మీడియా చెలరేగిపోతుంది.

హేతువాదులు, నాస్తికులే కాదు..

భక్తులు, ఆస్తికులు కూడా “తప్పు కదా” అని ముక్కున వేలేసుకుంటారు.

కానీ, మౌలిక ప్రశ్న ఒకటుంది

ఏది నమ్మకం, ఏది మూఢనమ్మకం.

ఏది పూజ, ఏది క్షుద్ర పూజ

ఏది మంత్రం , ఏది తంత్రం

ఏది దైవం.. ఏది భూతం

ఏ దేవుడు నమ్మకం?

ఏ భక్తి మూఢనమ్మకం?

దేవుడెక్కడున్నాడు?

గుండెలోనా గుడిలోనా?

గోడ మీద బొమ్మలోనా?

నేల మీద రాయిలోనా?

రాయికి మొక్కి ప్రసాదం పెట్టడం నమ్మకమా? మూఢనమ్మకమా?

ఏ పూజ దైవత్వం, ఏ పూజ అమాయకత్వం?

ఏది మొక్కుబడి, ఏది చేతబడి?

దైవాంశసంభూతులెవరు? దొంగబాబాలెవరు?

మహిమలెవరివి? మాయలెవరివి?

ఈ తేడాలు సృష్టించిందెవరు?

ఈ గీతలు గీసిందెవరు?

ఈ గోడలు నిర్మించిందెవరు?….

లౌకిక రాజ్యాంగంలో ప్రభుత్వాధినేతలే గుళ్లు కట్టి యజ్ఞయాగాదులు చేయడం మంచి నమ్మకమా?

అంతరిక్షానికి రాకెట్లు పంపే శాస్త్రవేత్తలు అంతకు ముందురోజు గుళ్ళో పూజలు చేయడం నమ్మకమా? మూఢనమ్మకమా?

యూనివర్శిటీల్లో జ్యోతిష్యాలమీద అధ్యయనాలు చేయడం ఏం విశ్వాసం…

కొండ మీద గుండు కొట్టించుకోవడం మంచి నమ్మకమా?

కొండ కింద జుట్టు విరబోసుకోవడం మూఢనమ్మకమా?

జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులకి శాస్త్రం అని తగిలించినంత మాత్రాన శాస్త్రాలవుతాయా?

హేతువు కానిదే నమ్మకం

అర్థం కానిదే భయం.

అది దేవుడైనా, దెయ్యమైనా ఒకటే.

మరి ఈ భక్తి, మూఢ భక్తి తేడాలెలా వచ్చాయి.

ఇదొక ఆధిపత్య కుట్ర.

దేవుడు, పూజలు, భక్తి..

వీటన్నిటి మీదా కొన్ని కులాలకే ఆధిపత్యాన్ని రాసిచ్చేసిన కుట్ర.

వాళ్ళు కాక ఎవరు చేసినా దాన్ని క్షుద్రపూజే..

వీరి దగ్గరిక ఎవరు వెళ్ళినా అది మూఢభక్తే.

ఇదే హెల్త్ డైరెక్టర్ ఏ పీఠాధిపతి దగ్గరకో, ఏ సోకాల్డ్ పుణ్యక్షేత్రానికో వెళ్తే ఇంతలా విరుచుకుపడేవాళ్లా?

ఏదో పల్లెలో, ఓ గిరిజన మహిళ తనకి తోచిన రీతిలో చేసే పూజలు మాత్రం అవి క్షుద్రపూజలా?.

దానికి అతను బోనులో నిలబడాలా?…

dh

dh



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions