.
పార్థసారథి పొట్లూరి.,.. మెసెంజర్ లో చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న: రాఫెల్ సోర్స్ కోడ్ అడిగితే ఫ్రాన్స్ కి చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ మనకి ఇవ్వలేదు ఎందుకు అని.
మన దేశం బ్రహ్మోస్ మిసైల్ ని రాఫెల్ తో అనుసంధానం చేయడానికి ఫ్రాన్స్ ని సోర్స్ కోడ్ అడిగిన మాట వాస్తవం! కానీ ఫ్రాన్స్ ఇంతవరకూ ఇస్తానని కానీ ఇవ్వను అని కానీ అనకుండా మౌనంగా ఉంది!
సోర్స్ కోడ్ – Source Code అంటే ఏమిటీ?
సోర్స్ కోడ్ అనేది జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదే! మొబైల్ ఫోన్ కి ఆండ్రాయిడ్, PC కి విండోస్ ఎలాగో జెట్ ఫైటర్స్ కి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది!
అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఏదో ఒక ప్రోగ్రామ్ లాంగ్వెజ్ లో కోడింగ్ చేసి దానిని ఇస్తారు మనకి, కానీ ఆ os తాలూకు సోర్స్ కోడ్ ని ఇవ్వరు.
Ads
ఆండ్రాయిడ్ అయితే ఓపెన్ సోర్స్ కోడ్ తోనే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎవరైనా వాడుకోవచ్చు. ఎందుకంటే అది రహస్యం కాదు. మైక్రోసాఫ్ట్ కేవలం డెవలపర్స్ కి మాత్రమే సోర్స్ కోడ్ ఇస్తుంది అది కూడా బేటా వర్షన్ కి మాత్రమే ఇస్తుంది!
జెట్ ఫైటర్స్ కి కూడా os ఉంటుంది. Mig -21 ఫైటర్ జెట్ 1960 లో డెవలప్ చేసినప్పుడు C లాంగ్వెజ్ లో OS ఉండేది. తరువాతి కాలంలో రహస్యంగా ఉంచుతూ వచ్చారు. అయితే LINUX తోనే కోడింగ్ చేస్తున్నారు కానీ రహస్యంగా ఉంచుతారు. ఎందుకంటే వెయ్యి కోట్ల జెట్ ఫైటర్ తాలూకు సమాచారం దాని OS లేదా సోర్స్ కోడ్ లోనే ఉంటుంది.
ప్రతీ జెట్ ఫైటర్స్ లో కంప్యూటర్స్ ఉంటాయి. కంప్యూటర్స్ జెట్ ఇంజిన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ ని కంట్రోల్ చేస్తాయి. సోర్స్ కోడ్ తెలిస్తే ఆ ఫైటర్ జెట్ జాతకం తెలిసిపోతుంది కాబట్టి సోర్స్ కోడ్ ఎవరికీ ఇవ్వరు!
1999 కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు మన మిరేజ్ 2000 ఫైటర్ జెట్ కి లేజర్ గైడెడ్ బాంబులు అవసరం ఏర్పడినప్పుడు ఇజ్రాయిల్ వాటిని ఇస్తానంది కానీ వాటిని మిరేజ్ 2000 తో అనుసంధానం చేయడానికి సోర్స్ కోడ్ అవసరం అయితే ఫ్రాన్స్ మనకి ఇచ్చింది. అప్పటికే రాఫెల్ ప్రొడక్షన్ లో ఉంది కాబట్టి, మిరేజ్ 2000 ల ప్రొడక్షన్ ఆపేసే దశకి వచ్చింది కాబట్టి సోర్స్ కోడ్ ఇచ్చింది ఫ్రాన్స్!
రాఫెల్ ఇప్పుడు డిమాండ్ ఉన్న జెట్! పైగా బ్రహ్మోస్ అనేది భారత్ కి 51% వాటా ఉంటే రష్యాకి 49% వాటా ఉంది అంటే జాయింట్ వెంచర్ కాబట్టి ఫ్రాన్స్ వెంటనే సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవచ్చు! పైగా రష్యా అంటేనే మండి పడిపోతున్నాడు మాక్రాన్!
సోర్స్ కోడ్ ఇస్తే సమాచారం రష్యాకి లీక్ అవుతుందనే భయం ఉండడం సహజమే! బ్రహ్మోస్ కాకుండా మన అస్త్రా మిసైల్ కోసం అయితే ఫ్రాన్స్ ఒప్పుకోవచ్చు! రాఫెల్ అనేది MBDA యూరోపియన్ కన్సార్టియంతో ముడిపడి ఉన్నది. సోర్స్ కోడ్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు!
Share this Article