Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకప్పుడు పొట్టతిప్పల చిరుద్యోగం… ఈ ‘‘యాక్టింగ్ సీఎం’’ ప్రస్థానం ఇంట్రస్టింగ్…

June 27, 2022 by M S R

మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య రష్మి ఠాక్రే తమపై తిరుగుబాటు  చేసిన రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్తున్నది, వాళ్ల భార్యలతో సంప్రదింపులు జరుపుతున్నది, తన భర్తకు మద్దతు కోరుతున్నది, మీమీ భర్తలకు నచ్చజెప్పాలంటూ విజ్ఞప్తి చేస్తున్నది…… ఇదీ వార్త..! తాడోపేడో తేల్చుకునే తరుణం వచ్చాక తరుణీమణుల దౌత్యాలు పనిచేస్తాయా అనుకుంటున్నారా..? అసలు పార్టీలో ఆమె నిర్ణాయక పాత్ర ఏమిటి..? ఆమె మాటకు విలువ ఎంత..? ఆమెకు రాజకీయాలు తెలుసా..? లేక కీలక సంక్షోభ సమయంలో భర్తకు ఏదో ఉడతాభక్తి సాయం చేయడం మాత్రమేనా..? అసలు ఏమిటీ ఆమె నేపథ్యం..?

ముంబైకి డొంబివిలి ఓ శివారు పట్టణం… ఓ దిగువ మధ్యతరగతి  కుటుంబంలోని ముగ్గురు పిల్లల్లో ఈ రష్మి పటాంకర్ రెండోది… బీకామ్ చదువుకుంది… రాజకీయాలతో ఏ సంబంధమూ లేకుండా, చాలీచాలని ఆదాయంతో సతమతమయ్యే కుటుంబం వాళ్లది.., తండ్రి చిన్న వ్యాపారి… ఆమె చదువు అయిపోగానే కుటుంబానికి కాస్త ఆర్థిక ఆసరా కోసం ఎల్ఐసీలో కంట్రాక్టు ఉద్యోగిగా చేరింది… ఏదో వేణ్నీళ్లకు చన్నీళ్లు తోడు… అక్కడ రష్మికి ఓ స్నేహితురాలు దొరికింది… పేరు  జైజైవంతి ఠాక్రే… ఆమె రాజ్‌ఠాక్రే సిస్టర్… తనను ఉద్దవ్ ఠాక్రేకు పరిచయం చేసింది…

ఉద్దవ్ ఠాక్రే శివసేన చీఫ్ బాల్ ఠాక్రే చిన్నకొడుకు… అప్పట్లో ఫోటోగ్రఫీ మీద బాగా ఆసక్తి… చిన్న అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ సొంతంగా నడిపించుకునేవాడు..,. రష్మి, ఉద్దవ్ నడుమ పరిచయం పెరిగింది, మనసులు కలిశాయి… స్నేహం ప్రేమలోకి మళ్లింది… బాల్ ఠాక్రే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు… 1989లో పెళ్లయిపోయింది… మాతోశ్రీలోకి ఠాక్రే మూడో కోడలిగా అడుగుపెట్టింది… చాన్నాళ్లపాటు తన భర్త ఉద్దవ్, తన పిల్లలు ఆదిత్య, తేజస్ ఆలనాపాలనా… అదే రష్మిలోకం… పబ్లిక్ లైఫ్‌లోకి గానీ, పార్టీ వ్యవహారాల్లోకి కానీ పెద్దగా వచ్చేది కాదు…

Ads

rashmi

ఠాక్రే పెద్ద కొడుకు బిందుమాధవ్ భార్య మాధవికి రాజకీయాల మీద ఆసక్తి లేదు, చూపు లేదు… కానీ రెండో కొడుకు జైదేవ్ భార్య స్మితకు రాజకీయాల్లో ఇంట్రస్ట్ ఉంది… కలగజేసుకునేది… అంతెందుకు..? 1995-99 శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ కాలంలో ఆమె మాటకు చెల్లుబాటు మరీ ఎక్కువ ఉండేది… కానీ 2003లో బాల్ ఠాక్రే చిన్న కొడుకు ఉద్ధవ్‌ను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటును చేశాడో పార్టీలో స్మిత ప్రాభవం హఠాత్తుగా పడిపోయింది… ఉద్దవ్‌తో పడలేదు… దారులు వేరయ్యాయి… ఇప్పుడు రాహుల్ ప్రొడక్షన్స్ పేరిట సినిమాలను నిర్మిస్తూ రాజకీయాలకు దూరమైపోయింది…

rashmi

రష్మి వెలుగులోకి వచ్చింది… ఉద్దవ్ ఆమె మాటకు విలువ ఇస్తాడు… పార్టీ వ్యవహారాల్లో యాక్టివ్ అయిపోయింది… ఉద్దవ్ అడుగుల వెనుక ఆమె ఆలోచనలే అధికం… ఎంతగా అంటే..? 2019 లోకసభ ఎన్నికల సందర్భంలో సీట్ల షేరింగ్, ఎంపికలపై బీజేపీ అప్పటి అధ్యక్షుడు అమిత్ షా ఉద్ధవ్‌తో ఆంతరంగికంగా చర్చిస్తున్నప్పుడు, ఆ గదిలో ఆ ఇద్దరితోపాటు ఉన్న మూడో వ్యక్తి కేవలం రష్మి మాత్రమే… రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అనిశ్చితంగా మారినప్పుడు బీజేపీ, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు… చాలాకొద్దిరోజులు… ఉద్దవ్ ఫ్రస్ట్రేషన్‌లో పడిపోయి, శివసేన ఆఫీసుకు వెళ్లి ఓ గదిలో తలుపులు బిడాయించుకుని కూర్చుండిపోయాడు చాలాసేపు… రష్మి వెళ్లింది…

రష్మి

మాట్లాడింది… సంజయ్ రౌత్ యాక్టివ్ అయిపోయాడు… భర్తకు, తమ పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చజెప్పింది… బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకుని, ఇక కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టింది శివసేన… ఆ ప్రతి అడుగులోనూ ఆమె ఉంది… తన భర్త, కాదంటే తన కొడుకు… సీఎం కావల్సిందే… అదే ఆమె కృతనిశ్చయం… సాధించింది… పార్టీ మౌత్‌పీస్ సామ్నాకు ఎడిటర్‌గా మారింది… అంతకు ముందు దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సీఎం భార్యగా లైమ్‌లైట్‌లో బాగా కనిపించేది… కానీ రష్మి సీఎం భార్య హోదాలో బయట కనిపించేది చాలా తక్కువ… కానీ కనిపించని సీఎం ఆమే… తన సోదరుడు సురేష్ పటాంకర్… ముంబై కార్పొరేషన్‌లో తను ఏది చెబితే అదే… మామా అని పిలుస్తారు తనను…

rashmi

కాకపోతే ఆమె, ఉద్దవ్ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్‌ను బాగా నమ్మి, ఇతర పార్టీ నేతలకు దూరం కావడంతో ఈ సంక్షోభం తలెత్తింది… సంజయ్ పక్కా కమర్షియల్, ఏకనాథ్ సూసైడ్ స్క్వాడ్… ఎవరిని ప్రొటెక్ట్ చేసుకోవాలో ఆ దంపతులకు తెలియలేదు… ‘మీ భర్తలకు టికెట్లు ఇప్పించింది నేను, గెలిపించింది నేను, కలిసి ఉందాం, విడిపోతే చెడిపోతాం, మీ భర్తలకు నచ్చజెప్పండి, అన్నీ మరిచిపోదాం’ అని రెబల్ ఎమ్మెల్యేల భార్యలకు చెబుతోంది రష్మి… ఓ విఫల ప్రయత్నం… చేతులు కాలిపోయాయ్… సర్దబాటు, దిద్దుబాటుకు చాన్నాళ్లు పట్టొచ్చు..!! దానికీ పూనుకోవాల్సింది కూడా ఆమే..!!

rashmi

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions