Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆనందం అంటే… అధికారమా..? అంతులేని సంపదా..? వైభోగమా..?

June 10, 2022 by M S R

ఆనందం అంటే..? దాని అసలు నిర్వచనం ఏమిటి..? రకరకాల ఆనందాల్లో నిజమైన ఆనందం అనేది ఎలా వస్తుంది..? ఆనందం అధికారంలో ఉందా..? తద్వారా వచ్చే వైభోగాలు, విలాసాలు, ఐహిక సుఖాల్లో ఉందా..? ఆధ్యాత్మికమా..? అనిర్వచనీయమా..? అలౌలికమా..? ఇదెప్పుడూ చర్చే… తలలుపండిన పెద్ద పెద్ద ప్రపంచప్రఖ్యాత తత్వవేత్తలే తేల్చలేకపోయారు… బిల్ గేట్స్, ఎలన్ మస్క్, వారెన్ బఫెట్ కూడా చెప్పలేరు…

పలు భాషల్లో ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఓ చిన్న కథ ఉంది… టీవీలు, పత్రికలు, రేడియోలు, సైట్లు, ట్యూబ్ చానెళ్లు… వాట్ నాట్..? అన్నింట్లోనూ అనేకమంది విన్నదే, చదివిందే, చూసిందే… మనమూ చెప్పుకోవాలి ఓసారి… నైజీరియాలో ఫెమి ఒటెడోలా అని ఓ రిచ్చెస్ట్ వ్యాపారి ఉన్నాడు… ఒక దశలో తనకు ఏయేరంగాల్లో సొంత కంపెనీలు ఉన్నాయో తనకే లెక్క తెలియకపోయేది… ఒక్కముక్కలో చెప్పాలంటే ఆ దేశంలో తను ఒక అంబానీ, ఒక ఆదానీ…

ఓసారి ఒక రేడియో ప్రజెంటర్ టెలిఫోన్‌లో తనను ఇంటర్వ్యూ చేశాడు… ‘‘సర్, మీకు మీ జీవితంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చిన సందర్భం ఏదైనా గుర్తుందా..?’’ ఇదీ ప్రశ్న… ప్రశ్న సంక్షిప్తమే కానీ జవాబు అంత సులభం కాదు… తను వివరంగా చెబుతూ పోయాడు ఇలా… ‘‘నేను నాలుగు రకాల ఆనందాల దశల్ని చూశాను… చివరలో నిజమైన ఆనందం అంటే ఏమిటో అర్థమైంది…

Ads

1) రకరకాల వ్యాపారాల్లో అంతులేని సంపదను క్రియేట్ చేసుకోవడం… మన ఆస్తుల విలువ పెరుగుతూ పోవడం… కానీ ఒక దశ దాటాక అందులో పెద్ద ఆనందం లేదని అర్థమైంది… ఒక స్టేజీ వచ్చాక డబ్బే డబ్బును సంపాదించి పెడుతుంది… మనసును ఉల్లాసపరిచే దశ కాదు ఇది…

2) రకరకాల అపురూపమైన వస్తువులను సమీకరించడం… విలువైనవి… అరుదైనవి… కానీ కొంతకాలానికి వాటి పట్ల ఆకర్షణ లేకుండా పోయింది… నిజానికి వాటి విలువే కృత్రిమం… భద్రంగా దాచుకుని మురియడం తప్ప ఎవరికీ ఏ ఉపయోగమూ లేదు… అదీ నాకు ఆనందాన్ని ఇవ్వలేదు కొన్నాళ్లకు…

3) కీర్తి… పెద్ద పెద్ద ప్రాజెక్టులు మన సొంతం కావడం… ఒక దశలో నైజీరియా, ఆఫ్రికా డిజిల్ సప్లయ్ 95 శాతం నా చేతుల్లోనే ఉండేది… పెద్ద రవాణా నౌకలు నావే… ఏ రంగంలోనైనా నా పెట్టుబడులు, కంపెనీలు… దేశ ఆర్థికవ్యవస్థకే నేను వెన్నెముక… కానీ అది వ్యాపారం, అందులో ఆనందం ఏముంది..?

4) ఓసారి ఓ మిత్రుడు అడిగాడు… కొన్ని వీల్‌చైర్లు ఇప్పించు అని… ఎన్ని కావాలి అన్నాను… 200 మంది పిల్లలకు… వాళ్లు దివ్యాంగులు అని చెప్పాడు… నాకు ఇలాంటివి పెద్దగా ఇంట్రస్టు ఉండదు, కానీ అంగీకరించాను… నాకు అది చాలా చిన్న విషయం కూడా… సరే, తీసుకెళ్లు అన్నాను… కాదు, మనమే వెళ్లి వాళ్లకు ఇద్దాం అన్నాడు… నా టైమ్ విలువ తెలిసీ అలా అడిగాడు… అసలు నేను ఏ మూడ్‌లో ఉన్నానో అప్పుడు, సరేనన్నాను…

అక్కడున్న ప్రతి పిల్లాడికీ నా చేతులు మీదుగానే వీల్‌చైర్లు ఇప్పించాడు… ఆ పిల్లల మొహాల్లో వెలుగు, ఆనందం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది… అలా చూస్తూ ఉండిపోయాను… ఏదో పిక్నిక్‌కు వచ్చినట్టు, జాక్‌పాట్ కొట్టినట్టు పిల్లలు తెగ మురిసిపోతున్నారు… వాళ్లకు ఆ వీల్‌చైర్ ఓ సౌకర్యం… దాన్ని అపురూపంగా చూసుకుంటున్నారు పిల్లలు…

మది నిండా ఏదో తెలియని ఆనందం వ్యాపించినట్టు అనిపించింది… సరే, ఇక పోదాం పద అంటూ నా మిత్రుడికి చెప్పాను… ఈలోపు ఓ పిల్లాడు నా కాళ్లు పట్టుకున్నాడు… మెల్లిగా విడిపించుకోవడానికి ప్రయత్నించాను… మరింత గట్టిగా పట్టుకున్నాడు… ఏం..? ఇంకేమైనా కావాలా అనడిగాను అనునయంగా… నా కంఠంలో నాకే తెలియని ఏదో మృదుత్వం… తను చెప్పిన మాట విని ఒక్కక్షణం విస్తుపోయాను… ఏం మాట్లాడాలో అర్థం కాలేదు… ఇంతకన్నా విలువైన ఆనందం ఏముంటుంది అనిపించింది… నా జీవితానికి ఓ కొత్త దిశను చూపించాడు… తన మాటలు పదే పదే నా బుర్రలో గిర్రుమని తిరుగుతూనే ఉన్నాయి… సంపద, అధికారం, వైభోగాల్లో ఆనందం లేదని ఒక్కమాటలో చెప్పాడు… నాలో నాకే తెలియని ఓ పరోపకార కోణాన్ని బయటికి తీశాడు… ఇంతకీ తనేమన్నాడంటే..?

‘‘సార్… నాకు ఇంకేమీ వద్దు… మీ మొహాన్ని ఓసారి నిశితంగా చూడనివ్వండి నన్ను… అది నాకు బాగా గుర్తుండిపోవాలి… ఎందుకంటే… మీరు ఇప్పుడు వెళ్లిపోతారు… కానీ ఎప్పుడో మనం స్వర్గంలో కలుసుకుంటాం… అప్పుడు నేను మళ్లీ మిమ్మల్ని సరిగ్గా గుర్తించాలి… మళ్లీ థాంక్స్ చెప్పాలి… చెబుతాను…’’

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions