Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంతకీ గుళ్లను ఎవరికి అప్పగించడం బెటర్..? ఏ పద్ధతిలో..!?

January 6, 2025 by M S R

.

. (    Subramanyam Dogiparthi  ) ..          … అయిదు సంవత్సరాల కింద 14-12-2019 న గుంటూరులో నేను , మాజీ చీఫ్ సెక్రటరీ IYR కృష్ణారావు గారు హిందూ దేవాలయాల పరిరక్షణపై ఒక సదస్సును నిర్వహించాం . సదస్సు ఎక్కడ ఆగిందంటే : దేవాలయాల పరిరక్షణ ఎవరికి/ఏ సంస్థకు అప్పచెప్పాలి అనే అంశం వద్ద ఆగింది .

నిన్న విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం ఆ అంశానికి ఏదయినా పరిష్కారం చెపుతారేమో అని నేను ఆశించాను . ఎందుకు ఆశించానంటే : ఇంత పెద్ద ఎత్తున VHP నిర్వహిస్తుంది కాబట్టి . భాజపా రాష్ట్ర నాయకులు అందరూ ఏర్పాట్లను పర్యవేక్షించారు కాబట్టి . అయితే వారి డిక్లరేషన్లో ఈ పరిష్కారం రాలేదు . పదేళ్ళుగా కేంద్రంలో భాజపా ప్రభుత్వమే ఉంది . ఇప్పుడు రాష్ట్రంలో కూడా NDA ప్రభుత్వమే ఉంది .

Ads

వాళ్ళయినా వీళ్ళయినా ఒక్క ఆర్డినెన్సుతో దేవాలయాలను ఎండోమెంట్స్ డిపార్టుమెంటు నుండి తీసివేయవచ్చు . అలాంటిదానికి ఇంత పెద్ద సభ అవసరమా !? ఒకవేళ అవసరమే అనుకుంటే VHP కి అప్పచెప్పాలా లేక పీఠాధిపతులకు అప్పచెప్పాలా లేక మరేదయినా సంస్థను క్రియేట్ చేయాలా , అలా క్రియేట్ చేస్తే ఆ సంస్థలో సభ్యుల్ని ఎవరు నామినేట్ చేయాలి అనే అంశంపై ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడలేదు . ఈ విషయం నన్ను చాలా నిరుత్సాహపరిచింది , ఆశ్చర్యపరిచింది .

మేము చిన్న స్థాయిలో నిర్వహించాం ; వాళ్ళు మెగా స్థాయిలో నిర్వహించారు . Outcome is same . మా బండి ఎక్కడ ఆగిందో అక్కడకే వచ్చి వాళ్ళూ ఆగారు .

ఈ సభానిర్వహణపై ఇప్పుడిప్పుడే రంధ్రాన్వేషణలు ప్రారంభమయ్యాయి . దేశం మొత్తానికి సంబంధించిన ఈ అంశంపై ఇంత పెద్ద సభ ఏ UP లోనో , ఏ MP లోనో , ఏ గుజరాతులోనో పెట్టకండా దక్షిణ భారతంలోని AP లో ఎందుకు పెట్టారు అనే ఆంశంపై రంధ్రాలను వెతకటం ప్రారంభం అయింది . చూద్దాం . అన్వేషణలో ఏం బయటపడుద్దో !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం పాడి కౌశిక్..! చివరకు రెంటికి చెడ్డ రేవడి ఐపోబోతున్నాడా..?!
  • దొందూ దొందే…! గ్యాండ్ లీడర్ తరువాత ఎవరికి వారే… దూరం- వైరం..!!
  • ‘బడా సాహెబ్’కు తలొగ్గలేదు… సవాల్ చేసి వణికించాడు కూడా…
  • అమరావతి..! పాత చట్టానికి సవరణలు కూడా మీ ఇష్టమేనా బాబూ..!?
  • రేవంత్ బాటలో మోడీ..! సోషల్ మీడియా విషానికి విరుగుడు మంత్రం..!!
  • షారూక్ పాత వీడియోలు… నెట్‌లో దుమ్ముదుమారం… కూలుతున్న ఖాన్ కోటలు…
  • అప్పట్లో చిరంజీవి అంటే అంతే… ఒకేరోజు నాలుగుచోట్ల శతదినోత్సవాలు…
  • చందమామ రమ్మంది..! నలుగురు ఇప్పుడే బయల్దేరారు..!
  • MaViGun..! అర్థం కాలేదా..? ఏపీ రాజధాని అట… జగన్ కొత్త ప్లాన్..!!
  • పాపం, ఇటలీ గుండె పగిలింది… ఎందుకో తెలుసా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions