.
యాంటీ ఇండియా నీచ్ కేరక్టర్ల గురించి వదిలేయండి కాసేపు…. దురంధర్ మతం సినిమా కాదురా నాయనా… ఇది రెండు శతృదేశాల గూఢచర్య యుద్ధం… కానీ దీన్ని కూడా యాంటీ బీజేపీ కళ్లద్దాలతో చూస్తూ… యాంటీ బీజేపీ సెక్షన్ తమ అజ్ఙానాన్ని ప్రదర్శిస్తోంది…
డౌటేముంది..? కాంగ్రెస్, టీఎంసీ ఎట్సెట్రా… ఆ పార్టీల ఆలోచనధోరణే సంకుచితం… ఒరేయ్, ఇండియా అంటే బీజేపీ కాదురా… ఇండియా అంటే అబౌట్ ఆల్ ఇండియన్స్… వాళ్లేదో ఇతర దేశస్తులైనట్టు..,? పాకిస్థాన్‌కు నొప్పి అనిపిస్తే, ఈ సోకాల్డ్ సూడో సెక్యులరిస్టులకు నొప్పి… అసలు పాకిస్థాన్ ముస్లిం జనాభాకన్నా మన ముస్లిం జనాభా ఎక్కువ… ప్రపంచంలోకెల్లా వాళ్లకు సేఫ్‌గా ఉన్న దేశం ఇండియా… ఇది రియాలిటీ…
Ads
దురంధర్ సినిమా అనేది ఓ డాక్యుమెంటరీ కాదు… ఓ క్రియేటివ్ ప్రొడక్ట్… వినోద వ్యాపారం… ఓ కథ రాసుకుని, దానికి తగ్గట్టు ఓ స్క్రీన్ ప్లే రాసుకుని, పాత నిజసంఘటనల స్పూర్తిని తీసుకుని సినిమా పకడ్బందీగా తీశాడు దర్శకుడు… జాతీయ స్థాయిలో సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్యపోతూ అభినందిస్తున్నారు… అవి పెద్ద పెద్ద సర్టిఫికెట్లు…
ఎటొచ్చీ… ప్రతిదీ సూడో సెక్యులర్ కోణంలో చూసి, పెడబొబ్బలు పెట్టే ప్రకాష్ రాజ్‌లతోనే సమస్య… ఈ ‘వెధవల’కు మతం పేరిట సాగిన పహెల్‌గాం మారణకాండ గుర్తుకురాదు… సరే, ఇవన్నీ వదిలేద్దాం… ఇంకొన్ని చెప్పుకుందాం…
– వారం రోజుల్లోనే 950 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు, నభూతో… కానీ ఎవడో సన్నాయినొక్కులు..,. పుష్ప-2 ఎక్కువ కదాని… గల్ఫ్ కంట్రీస్‌లో మతం కోణంలో దురంధర్‌ను ఆడనివ్వలేదురా నాయనా… లేకపోతే పుష్ప కాదు, సోకాల్డ్, చరిత్ర వక్రీకరణ ఆర్ఆర్ఆర్, ఓ జానపద సినిమా బాహుబలి రికార్డులు కూడా కొట్టుకుపోయేవి… పోయాయి…
– ఒక సినిమా సక్సెస్‌కు ప్రామాణికాలు ఏమిటి..? ఒకప్పుడు లవకుశ సినిమాకు జనం ఎడ్లబళ్ల మీద తరలివచ్చి, ఓ జాతరకు వచ్చినట్టు తాదాత్మ్యం చెందారు, అదీ సక్సెస్… ఒక బలగం సినిమాను ఊళ్లల్లో ప్రత్యేక షోలు వేసుకుని, కన్నీళ్లు పెట్టుకున్నారు, అదీ సక్సెస్… ఆఫ్టరాల్ టికెట్ రేట్లను పెంచుకుని, ఆర్టిఫిషియల్ మార్కెటింగుతో వందల కోట్లు సంపాదించుకుంటే అది సక్సెసా..?
– ఒక పుష్ప సంగతి చూద్దాం… అసలు ఓ స్మగ్లర్ కథను గ్లోరిఫై చేయడమే దరిద్రం… పైగా పక్కా తెలుగు సినిమా మార్క్ కమర్షియల్ విలువలు… ఐటమ్ సాంగ్స్ ఎట్సెట్రా… అది మరో వేయి కోట్లు సంపాదించినా సరే, అది నాసిరకం, సమాజ నైతిక వ్యతిరేకమే గానీ… బాధ్యులందరికీ ఎప్పుడో ఓసారి లత్త కొట్టడం ఖాయం…
ఇక్కడ మరో విషయమూ చెప్పుకోవాలి… దురంధర్ కొత్త బాక్సాఫీసు రికార్డులు క్రియేట్ చేసినా చేయకపోయినా డోన్ట్ కేర్… దేశం మొత్తాన్ని కదిలించాడు దర్శకుడు… కాదు కాదు… శతృదేశంలో ప్రతి ఒక్కడూ తన నీడను తనే నమ్మలేని పరిస్థితిని క్రియేట్ చేశాడు… చివరకు పోలీసులు బిచ్చగాళ్లను కూడా తనిఖీ చేస్తున్నారు… ఇండియా సినిమా చరిత్రలో ఇంత సక్సెస్ మరొకటి లేదు… లేదు… అదిరా సక్సెస్ అంటే…
చివరగా… అది పాన్ ఇండియా సినిమా… కన్నడం, మలయాళం, తమిళం ప్రేక్షకుల గురించి చెప్పాలి ఓసారి… వాళ్ల సినిమాలు డబ్ చేస్తే ఇండియా మొత్తం ఉర్రూతలూగి చూడాలి, వందల కోట్లు ఇవ్వాలి… కానీ హిందీవాడు పాన్ ఇండియా సినిమా చేస్తే ఎవ్వడూ దేకడు.., ఇదీ అసలు దరిద్రం…
మలయాళంలో ఈ సినిమా రెండోరోజు వసూళ్లు జస్ట్, 2 లక్షలు… తమిళం కాస్త నయం రోజూ కోటి వస్తోంది… కన్నడం మరో దరిద్రం … మూడో రోజు, నాలుగో రోజు రోజుకు లక్ష రూపాయలు… మొత్తం సౌత్ ఇండియాలో క్వాలిటీని బట్టి ఆదరించేది కేవలం టాలీవుడ్, అనగా తెలుగు ప్రేక్షకులు…
తెలుగు పాన్ ఇండియా సినిమాలను కూడా తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులు ఎప్పుడూ దేకరు… నిజానికి తెలుగు, హిందీ ఇండస్ట్రీలు జస్ట్, ఈ రెండు భాషల మీదే కాన్సంట్రేట్ చేసి, ఆ మూడు భాషల సినిమాల్ని ఇగ్నోర్ చేయడం బెటర్, బెటర్… బెటర్..!!
Share this Article