……… Jagannadh Goud…………. ఏది శాస్త్రీయత..? ఏది అశాస్త్రీయం..?
మీరు గార్డెన్ లో పనిచేసేటప్పుడు కానీ మట్టిలో నడిచేటప్పుడు కానీ ఒకరకమైన మట్టి వాసన వచ్చిందా..? పోనీ వర్షం వచ్చేటప్పుడయినా ఆ మట్టి వాసన గమనించారా..? దానికి కారణం ఒక బ్యాక్టీరియా. దాని పేరు స్ట్రెప్టోమైసిస్ (ఆక్టినోమైసిటిస్ బ్యాక్టీరియా కుటుంబం) దానికి నాకు ఐదు సంవత్సరాల బంధం ఉంది. అయితే ఆ మట్టివాసన కి కారణం స్ట్రెప్టోమైసిస్ బ్యాక్టీరియా లోని జియోస్మిన్ కారణం. దాన్ని కనిపెట్టింది నేను అమెరికాలో Ph.D చేస్తున్నప్పటి మా గురువు గారి గురువు గారు డా. బెంట్లీ… హార్వర్డ్ విశ్వ విద్యాలయం… అమెరికాలోని 50 రాష్ట్రాల్లో తిరిగి బాగా మట్టి వాసన వస్తున్న మట్టిని సేకరించి దాని నుంచి కొత్త యాంటీ బయోటిక్స్ కనిపెట్టటం నా Ph.D లో ఒక భాగం… ప్రపంచంలో ఉన్న 100 యాంటీ బయోటిక్స్ లో 50 మా స్ట్రెప్టోమైసిస్ బ్యాక్టీరియా లేదా యాక్టినోమైసిటిస్ బ్యాక్టీరియా నుంచే కనిపెట్టటం జరిగింది… నేనూ రాత్రనక పగలనక కష్ట పడి కొత్త యాంటీ బయాటీక్స్ కనిపెట్టాను… నా దురధ్రుష్టం కొద్దీ నేను చేస్తున్న ఇంకో ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయ్యింది కానీ తెల్లారితే Ph.D డిగ్రీ వస్తుంది అనుకున్న నన్ను వైవా లో ఫెయిల్ చేశారు, లేదా ఫెయిల్ అయ్యాను…
Ads
అది పక్కన పెడితే ఒక గ్రాము మట్టిలో కొన్ని లక్షల మైక్రో ఆర్గానిజంస్ ఉంటై ( మైక్రో ఆర్గానిజంస్ అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మొదలగునవి). బ్యాక్టీరియాలో కూడా కొన్ని మంచి బ్యాక్టీరియాలు ఉంటై, కొన్ని హానికర బ్యాక్టీరియాలు ఉంటై. నాకు కావాల్సిన స్ట్రెప్టోమైసిస్ బ్యాక్టీరియాని వేరు చేయటానికి నెల రోజులు పట్టేది. ఆ తర్వాత మళ్ళీ దానిలో యాంటీ బయాటిక్ ప్రోపర్టీస్ ఉన్నాయా లేదా తెలుసుకోటానికి మరో నెల రోజులు… దాన్ని కలెక్ట్ చేసి అమెరికాలో మరియూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకి పంపించి ఇలాంటిది ఇంతకి క్రితం ఎవరైనా కనిపెట్టారా లేదా అని తెలుసుకోటానికి మరో మూడు నెలలు… ఇలా కొన్ని వందల వేల గంటలు రీసర్చ్ చేసేవాడిని ఒక గ్రాము మట్టి మీద…. ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా యాంటీ బయాటిక్స్ మీద రీసర్చ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ నాకు తెలుసు, నేనూ అందరికీ తెలుసు. అదీ కూడా పక్కన పెడితే ఒక గ్రాము మట్టిలోని కొన్ని లక్షల మైక్రో ఆర్గానిజంస్ నుంచి ఒక బ్యాక్టీరియాని సెపరేట్ చేసి దాని మీద రీసర్చ్ చేయటానికే నాకు ఐదు సంవత్సరాలు పట్టింది. ప్రపంచం అంతా తల క్రిందకి, కాళ్ళు పైకి లేపి కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా ఒక గ్రాము మట్టి గురించి కూడా మనిషికి పూర్తిగా తెలియడం లేదు… అలాంటిది, ఇది మాత్రమే శాస్త్రీయం, ఇది మాత్రమే ఆశాస్త్రీయం అని ఎవడ్రా మీకు చెప్పింది..? అయితే జనాభాలో 90% మంచివాళ్ళు, 10% చెడ్డవాళ్ళు ఉన్నట్లే… డాక్టర్లలో, రాజకీయ నాయకుల్లో, అధికారుల్లో… ప్రతి రంగంలో 10% చెత్తా సరుకు ఉంటుంది అని మనందరికీ తెలిసిందే… సో, ఆధునికం అయినా, సనాతనం అయినా మంచి ఉంటే స్వీకరించాలి, చెడు ఉంటే సరిదిద్దుకోవాలి; అదే శాస్త్రీయత… — జగన్
Share this Article