Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అతని పేరే మాయారామ్…! చిదంబరంతో కలిసి ‘సెక్యూరిటీ థ్రెడ్’ చించేశాడు..!!

January 21, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి …….. చిదంబరం మరియు అతని అనుచర అధికారులు భారతీయ నోట్ల విషయం లో చేసిన స్కామ్ ! UPA ప్రభుత్వం తాను అధికారంలో ఉన్నంత కాలం ప్రతి లావాదేవీలో తనకి ఎంత లాభం ఉంటుంది అనే దాని మీదనే బాగా శ్రద్ద పెట్టింది ! విషయం : భారత దేశపు కరెన్సీ నోట్ల తయారీలో వాడే ‘సెక్యూరిటీ త్రెడ్ ‘ విషయంలో UPA ప్రభుత్వం ఎలాంటి మోసానికి పాల్పడ్డదో తెలియచేసే అంశం ఇది. భారత దేశపు నోట్ల ముద్రణలో భాగంగా వాడే ‘సెక్యూరిటీ ప్రింటింగ్ పేపర్ [Security Printing paper-SPP] విషయంలో అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం అతని కింద పని చేసిన అధికారులు ఎలాంటి మోసాలకి పాల్పడ్డారో తెలిపే వివరాలు తెలుసుకుందాము !

************************************************************************

2005 కి వెళితే కానీ ఈ స్కామ్ ఏమిటో అర్ధం కాదు ! 2005 లో అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్నరోజుల్లో ఏదన్నా పెద్ద మొత్తంలో డబ్బు కూడపెట్టాలి అనే ఆలోచనతో సరి కొత్త కుంభకోణానికి తెర తీశాడు. అది భారతీయ కరెన్సీ నోట్ల కి సంబంధించినది . చిదంబరం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి కాబట్టి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలి అని ఒక కొత్త సంస్థని సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ [Security Printing & Minting Corporation of India Ltd.,- SPMCIL] ని ఏర్పాటు చేశాడు ఆర్ధిక మంత్రిగా ! అప్పట్లో ఆర్ధిక శాఖకి జాయింట్ సెక్రటరీ గా ఉన్న అరవింద్ మాయరామ్ [Aravind Mayaram] మరియు అశోక్ చావ్లా [Ashok Chawla ] అడిషనల్ సెక్రటరీగా ఉండేవారు.

2006 లో SPMCIL కి ఫౌండింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గా అరవింద్ మాయరామ్ ని మరియు ఫౌండింగ్ ఛైర్మన్ గా అశోక్ చావ్లా లని నియమించాడు చిదంబరం!

ఇక్కడే అసలు స్కామ్ దాక్కొని ఉంది ! Security Printing & Minting Corporation of India Ltd.,- SPMCIL ని ఏర్పాటు చేయాలంటే దానికి అపాయింట్ మెంట్స్ కమిటీ ఆన్ కాబినెట్ [Appointments Committee of the Cabinet (ACC)] ముందు ప్రతిపాదన చేయాలి. కాబినెట్ కమిటీ చర్చించిన తరువాత ఆమోదం తెలుపుతుంది అప్పుడు SPMCIL కి చట్ట బద్ధత కలుగుతుంది . కానీ చిదంబరం ACC ముందు ఈ విషయము పెట్టలేదు సరికదా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అంటే దీనర్ధం SPMCIL అనే సంస్థకి చట్ట బద్ధత లేదు అన్నమాట ! ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే SPMCIL అనేది తన కార్యకలాపాలని మొదలుపెట్టేసింది.

*************************************************************************

ది భారతీయ రిజర్వ్ బాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ [The Bharatiya Reserve Bank Note Mudran Pvt. Ltd.,-TBRBNML] మీద మాయరామ్ మరియు అశోక్ చావ్లా లు అధికారం చెలాయించడం మొదలు పెట్టేశారు. UPA ప్రభుత్వ అక్రమ తెలివితేటలు : మాయారామ్ మరియు అశోక్ చావ్లా లు రిజర్వ్ బాంక్ ముద్రించే 500,1000 నోట్ల కోసం సెక్యూరిటీ పేపర్ కోసం SPMCIL ద్వారా వెతకడం మొదలుపెట్టారు. దీనర్ధం రిజర్వ్ బాంక్ ముద్రణాలయం కోసం కావాల్సిన సెక్యూరిటీ పేపర్ ఎంపిక చేసే అధికారం మాయారామ్ మరియు అశోక్ చావ్లా చేతుల్లో ఉంది అన్నమాట ! వీళ్ళిద్దరూ కలిసి రిజర్వ్ బాంక్ నోట్ల ముద్రణ కోసం సెక్యూరిటీ పేపర్ ఎవరి దగ్గర కొనాలో సూచిస్తారు అలా అని కొటేషన్ మరియు ధర నిర్ణయించేది కూడా వీళ్ళిద్దరూ మాత్రమే ! మాయారామ్ మరియు అశోక్ చావ్లా ఎవరి దగ్గర సెక్యూరిటీ పేపర్ కొనమంటే రిజర్వ్ బాంక్ వాళ్ళ దగ్గర కొనాలి !

************************************************************************

De La Rue – డే లా రు స్కామ్ ! De La Rue అనేది బ్రిటన్ కి చెందిన ప్రైవేట్ సంస్థ. కరెన్సీ పేపర్ ని సెక్యూరిటీ త్రెడ్[Color Shift Security Thread ] తో అమ్ముతుంది. భారత్ తో పాటు,పాకిస్థాన్ మరియు ఇతర దేశాలకి కరెన్సీ పేపర్ తో పాటు దానిలో ఉండే సెక్యూరిటీ త్రెడ్ ని సప్లై చేస్తుంది. De La Rue సంస్థ మన దేశానికి కరెన్సీ నోటు సప్లై చేస్తున్నది ఎప్పటి నుండో తెలుసా ? 1876 నుండి మన దేశానికి కరెన్సీ పేపర్ ని సప్లై చేస్తూ వస్తున్నది !

********************************************************************

సాధారణంగా ప్రపంచంలోని ఏ దేశం అయినా తమ తమ కరెన్సీ నోట్ల ముద్రణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. నిర్ణీత కాల పరిమితి తో కరెన్సీ నోట్ల డిజైన్,కలర్,సెక్యూరిటీ త్రెడ్, వాటర్ మార్క్ ,ముద్రణ కి ఉపయోగించే ఇంకు లని మారుస్తూ ఉంటాయి నకిలీ నోట్లని అరికట్టడానికి !. ఒక్కో దేశం ఒక్కో కాలపరిమితిని పెట్టుకొని వెంట వెంటనే ఆయా సంవత్సరాల కాలపరిమితిని బట్టి మారుస్తూ ఉంటాయి. కానీ మన దేశం విషయానికి వస్తే నిర్దుష్ట కాల పరిమితి అంటూ లేకుండా ఉంది. 2009 లో శైలభద్ర బెనర్జీ ఛైర్మన్ గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు భారతీయ కరెన్సీ నోట్ల ని ఎన్ని ఏళ్లకి ఒక సారి డిజైన్ మార్చాలో తెలపాల్సిందిగా !

***************************************************************************

2010 లో రిజర్వ్ బాంక్ అప్పటికే తనకి సెక్యూరిటీ ప్రింటింగ్ పేపర్ ని సప్లై చేస్తున్న డే ల రు [De La Rue ] కంపనీ నాసిరకం కరెన్సీ పేపర్ అని తేల్చింది. De La Rue లో పనిచేస్తున్న ఉద్యోగుల చేతి వాటం వలన మనకి నాసిరకం కరెన్సీ పేపర్[SPP] మరియు సెక్యూరిటీ త్రెడ్ సప్లై అవుతూ వచ్చింది. భారత దేశ ప్రభుత్వం తో De La Rue చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించింది! ఇది నమ్మక ద్రోహం ! దాంతో అప్పటి ప్రభుత్వం De La Rue ని SPP సరఫరా చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ! ఈ పని చేసింది అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరం అదీ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖని సంప్రదించి మరీ చేశాడు ! వెంటనే చిదంబరం ని ఆర్ధిక మంత్రిత్వ శాఖ నుండి తొలగించి ప్రణబ్ ముఖర్జీ కి ఆర్ధిక శాఖ ఇచ్చారు. అయితే De La Rue నుండి SPP సప్లై అవుతూనే ఉంది తాత్కాలిక ప్రాతిపదికన !

**************************************************************************

2011-12 ఆర్ధిక సంవత్సరానికి గాను De La Rue ని పక్కనపెట్టి మరో కొత్త సంస్థకి సెక్యూరిటీ ప్రింటింగ్ పేపర్ [SPP ] సప్లై చేయడానికి గాను e-టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం అయ్యింది. ఆగస్ట్ నెల 1,2012 లో అరవింద్ మాయరామ్ కి పదోన్నతి ఇచ్చి ఆర్ధిక శాఖ సెక్రటరీ గా చేశారు. ప్రణబ్ ముఖర్జీ ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడంతో అప్పటి వరకు తాత్కాలిక హోమ్ మంత్రిగా ఉన్న చిదంబరం ని మళ్ళీ ఆర్ధిక శాఖ మంత్రిగా చేశారు. అరవంద్ మయారామ్ కి జాయింట్ సెక్రటరీ నుండి ఆర్ధిక శాఖ సెక్రటరీ గా ప్రోమోషన్ ఇవ్వడంలో చిదంబర వెనక ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు.

*****************************************************************

అసలు కధ మొదలయ్యింది ఇప్పుడే ! అరవింద్ మాయారామ్ ని ఆర్ధిక శాఖ సెక్రటరీగా ప్రోమోషన్ ఇవ్వగానే తన పని మొదలుపెట్టాడు తన బాస్ చిదంబరం కి అనుకూలంగా ! మాయారామ్ కి తెలుసు De La Rue ని బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు. కానీ మళ్ళీ తాత్కాలికంగా SPP ని De La Rue నుండి దిగుమతి చేసుకోవడానికి తాత్కాలికంగా అనుమతి ఇవ్వండి అంటూ హోమ్ మంత్రిత్వ శాఖకి లెటర్ వ్రాశాడు… కానీ ఈ లెటర్ ఆర్ధిక మంత్రి చిదంబరం సంతకంతో వెళ్ళాలి కానీ మాయారామ్ అలా చేయలేదు. తానే స్వయంగా హోమ్ శాఖకి లెటర్ వ్రాశాడు ! ఒకవేళ ఏదన్నా జరిగితే నా సంతకం లేదు కాబట్టి నాకు తెలియదు అని చిదంబరం తప్పించుకోవచ్చు అన్నమాట కానీ చిదంబరం కి తెలుసు మాయారామ్ హోమ్ శాఖకి లెటర్ వ్రాశాడు అని. అరవింద్ మాయారామ్ హోమ్ శాఖకి వ్రాసిన లెటర్ లో De La Rue నుండి SPP ని మూడేళ్ళ పాటు దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరాడు !

*********************************************************************

2014 లో బిజేపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు ఆర్ధిక శాఖ అధికారులు.. బ్లాక్ లిస్ట్ లో ఉన్న De La Rue నుండి ఇంకా SPP కొంటూనే ఉన్నాము అన్న సంగతిని. 2015 నుండి De La Rue ని పక్కనపెట్టి ఇతర సంస్థల నుండి SPP కొనడం ప్రారంభించింది బిజేపి ప్రభుత్వం ! 2015 బిజేపి ప్రభుత్వం కొన్న SPP ధర చాలా తక్కువ ! ఎంత తక్కువ ? 2005 నుండి De La Rue దగ్గర కొంటున్న SPP ధరలో సగం ! ఈ స్కామ్ లో మొత్తం ముగ్గురు వ్యక్తులు లబ్దిదారులుగా ఉన్నట్లు గుర్తించారు. చిదంబరం తో పాటు అతని కొడుకు కార్తీ చిదంబరం మరియు అరవింద్ మాయారామ్ లు.

*********************************************************************

ఆర్ధిక శాఖ కార్యదర్శిగా అరవింద్ మాయారామ్ ప్రవర్తన ప్రధానమంత్రి ఆఫీసు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దాంతో చీఫ్ విజిలెన్స్ కమిషనర్ [CVC] ని విచారణ చేయమని ఆదేశించారు ప్రధాని. 2015 లో అప్పటి చీఫ్ విజేలెన్స్ కమీషనర్ అయిన రాజీవ్ SPP కి సంబంధించిన ఫైల్స్ ని తమకి పంపమని ఆదేశాలు ఇచ్చారు కానీ CVC అడిగిన ఫైల్స్ ని అప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కార్యాలయం ఇవ్వలేదు సరికదా CVC ఆదేశాలని పట్టించుకోలేదు. మళ్ళీ ఈ విషయం ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు వెళ్ళగానే ఆర్ధిక శాఖ నుండి ఫైళ్ళు CVC కి చేరాయి కానీ CVC గా రాజీవ్ పదవీ కాలం ముగియడంతో కొత్త CVC గా KV చౌదరి గారు బాధ్యతలు తీసుకున్నారు. KV చౌదరి అటు చిదంబరంతో పాటు ఇటు అరుణ్ జైట్లీ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది గమనార్హం !

*************************************************************************

ఇటీవలే మాయారామ్ మీద సిబిఐ విచారణ మొదలుపెట్టింది. మాయారామ్ చర్యవలన పాకిస్థాన్ చాలా సులభంగా నకిలీ 500,1000 రూపాయల నోట్లని ముద్రించగలిగింది! అయితే మాయారామ్ తనకోసం ఈ పని చేసి ఉండడు అన్న సంగతి అందరికీ తెలుసు. చిదంబరానికి తెలియకుండా ఒక కార్యదర్శి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేడు. ఇందులో మరో కోణం ఏమిటంటే De La Rue సంస్థ తాను ఉత్పత్తి చేసే SPP తో పాటు సెక్యూరిటీ త్రెడ్ కి పేటెంట్ హక్కులు కలిగి ఉన్నట్లు గా అగ్రిమెంట్ లో పేర్కొంది. కానీ నిజానికి De La Rue పేటెంట్ కోసం అప్లై చేసినా అది తిరస్కరణకి గురయ్యింది అన్న సంగతిని దాచిపెట్టింది ! అంటే పేటెంట్ లేని డిజైన్, పేపర్, సెక్యూరిటీ త్రెడ్ మరియు ముద్రణకి వాడే ఇంకు ని వేరొకరు వాడినా వాళ్ళ మీద ఎవరూ కేసు పెట్టలేరు ! ఇది పరోక్షంగా పాకిస్థాన్ కి కలిసి వచ్చింది. ఇలా పాకిస్థాన్ కి సహాయ సహకారాలు అందించింది చిదంబరం అతని అనుచర అధికారుల పేర్లు బయటికి వచ్చినా తెర వెనుక ఉన్నది కాంగ్రెస్ పెద్ద తలకాయలు అన్నది నిజం !

*******************************************************************************

2016 లో ప్రధాని నరేంద్ర మోడీ హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దుని ప్రకటించడం వెనకాల అసలు కారణాలు ఇవే ! కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్ వల్ల దేశంలో సమాంతరంగా నకిలీ నోట్ల ఆర్ధికవ్యవస్థ నడిచింది. దీనివల్ల లబ్ధి పొందింది కాంగ్రెస్ మరియు పాకిస్థాన్ లు మాత్రమే ! లైన్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటూ రాహుల్ చిల్లు జేబులో చేయపెట్టి అది బయటికి కనపడేలా వేషాలు వేశాడు గుర్తుందా ? 2016 లో పెద్ద నోట్లు రద్దు అవగానే ముందు కరాచీ లో ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసే దళారులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు ? ఈ రోజున పాకిస్థాన్ ఇలాంటి స్థితిలో ఉండడానికి కారణం ఏమిటీ ? బయటపడ్డ నిజాలు చాలా కొద్ది మాత్రమే !

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
  • నువ్వు చాలా దిల్‌దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?
  • ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…
  • ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!
  • ‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’
  • సహస్ర శిరచ్ఛేద ‘అహిలావతి’ కథ… రాక్షసరాజును పెళ్లాడిన ప్రజ్ఞా యోధ…
  • స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…
  • అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…
  • ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions