Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

June 1, 2025 by M S R

.

ఆమె… మమతా బెనర్జీ… అలా చేయకపోతేనే ఆశ్చర్యపడాలి… అనేకసార్లు జాతి మొత్తం ఒకవైపు… ఈ కేరక్టర్ మాత్రం మరోవైపు… పశ్చిమ బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్‌గా చేసిన ఆమె తాజా చర్యను దేశమే కాదు, అంతర్జాతీయ సమాజం కూడా థూత్కరిస్తోంది…

అఫ్‌కోర్స్, అది బెంగాల్… ఆమెకు, ఆమె సర్కారుకూ ఎవడెంత ఛీకొట్టినా పట్టదు… విషయం ఏమిటంటే..? శర్మిష్ట పనోలి… ఈమె 22 ఏళ్లు… ఆమెది బేసిక్‌గా హర్యానాలోని గుర్గావ్… చదివేది పూణెలో… ఆమెను బెంగాల్ పోలీసులు గుర్గావ్ దాకా వెళ్లి మరీ అరెస్టు చేశారు… ఎందుకు..?

Ads

ఆమె చేసిన తప్పేమిటో తెలుసా..? ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా, మన జాతికి సంఘీభావంగా బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు స్పందించడం లేదని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నించింది… అంతే, ఆ పోస్టు పెట్టడమే ఆమె నేరం అట…

ఆమెకు 2 లక్షల మంది ఫాలోవర్లు… కానీ తను వాడిన పదజాలం హార్ష్‌గా ఉందని ఫీలై వెంటనే ఆ పోస్టును ఆమే డిలిట్ కొట్టేసింది… ఎవరైనా ఫీలయితే సారీ అనేసింది… సీన్ ఇక్కడ అయిపోవాలి కదా… బెంగాల్ సీఎం తెర మీదకు వచ్చింది…

sarmishta

ఎవడో కో‌ల్‌కత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారట… అంతే, వాళ్లు వెళ్లి గుర్గావ్‌లో ఉన్న శర్మిష్టను అరెస్టు చేశారు… అసలు బెంగాల్ పోలీసులకు ఏం సంబంధం..? ఆమె చదివేదీ బెంగాల్ కాదు, ఆమె ఉండేది బెంగాల్ కాదు… పైగా ఆమె పోస్టులో నిందించిన వాళ్లకూ బెంగాల్‌తో సంబంధం లేదు… దేశభక్తిని చూపడం ఖచ్చితంగా మమత దృష్టిలో నేరం కదా… అరెస్టు చేసిపారేసింది…

దేశవ్యాప్తంగా మమతను థూత్కరిస్తున్నారు… కానీ ఆమె అంతే… చివరకు ఎక్కడో ఉండే డచ్ ఎంపీ కూడా మమత చర్యను తప్పుపట్టాడు… ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించి, మమత బెనర్జీ చర్యను ఆక్షేపించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది…

‘ఐ స్టాండ్ విత్ శర్మిష్ట’, ‘ఈక్వల్ జస్టిస్’ అంటూ రెండు హ్యాష్ ట్యాగ్‌లు జోడించి తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు పవన్ కల్యాణ్… ఎన్నికైన మీ నాయకులు, టిఎంసి ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన లోతైన, తీవ్రమైన బాధ గురించి స్పందించవు, మన విశ్వాసాన్ని ‘గాంధ ధర్మం’ అని పిలిచినప్పుడు ఆ ఆగ్రహం ఎక్కడ ఉంది? వారి క్షమాపణ ఎక్కడ? వారి త్వరిత అరెస్టు ఎక్కడ? అని పవన్ ప్రశ్నల వర్షం కురిపించాడు…

శర్మిష్ట అరెస్ట్‌పై బాలీవుడ్ కిక్కుమనడం లేదు… బహుశా ఆనందిస్తున్నారేమో ఆ ప్రముఖులంతా… ఒక్క నటి కంగనా రనౌత్ మాత్రమే స్పందించింది… ‘‘ఎవరైనా క్షమాపణ చెప్పి, పోస్ట్‌ను తొలగించినప్పుడు, ఆమెను జైలులో పెట్టడం, ఆమెను హింసించడం, ఆమె కెరీర్‌ను ముగించడం, ఆమె వ్యక్తిత్వంపై ప్రశ్నలు అడగడం చాలా తప్పు… రాష్ట్రాన్ని ఉత్తర కొరియాగా మార్చడానికి ప్రయత్నించవద్దని నేను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను..’’ అని కడిగి పారేసింది…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions