మనుషుల్ని ఎలాగూ నమ్మే రోజులు కావివి… నీడకు కూడా ద్రోహచింతనే… సొంత రక్తబంధుత్వం సహా స్నేహితుల్ని కూడా నమ్మే కాలం కాదిది… మరెవర్ని నమ్మాలి..? అసలు నమ్ముకుంటే మంచి జరుగుతుందా..? అన్ని మతాల్లోని కోటానుకోట్ల దేవుళ్లను వదిలేసి, ఓ విశ్వశక్తీ, నాకు మంచి చేయి అని ఎంత కోరుకున్నా మంచి జరుగుతుందా..?
‘‘James Stockdale అని ఓ అమెరికన్ సైనికుడు – వియత్నాం యుద్ధంలో యుద్ధఖైదీగా మరి కొందరు తోటి అమెరికన్ సైనికులతోపాటు దొరికిపోయాడు… వీరిని జైలులో పెట్టారు… తనతోపాటు ఆ జైలులో ఉన్న సైనికులు, తాము వచ్చే క్రిస్టమస్ పండుగకు బయటకొచ్చేస్తామని ఆశించారు. నమ్మారు. దేవుడిని కోరుకున్నారు, ప్రార్థించారు… కానీ కుదరలేదు… మళ్ళీ న్యూఇయర్ కు వదిలేస్తారనుకున్నారు… వదల్లేదు… ఈస్టర్ కు వదులుతారనుకుంటే, అప్పుడూ వదల్లేదు… ఇలా ప్రతీ సంవత్సరం వదిలేస్తారనుకుంటే వదలడం లేదు… రోజులు గడుస్తున్నాయి…
ఇలా ప్రతీ సంవత్సరం పెట్టుకున్న ఆశ, నమ్మకం నెరవేరకపోవడంతో రెండు మూడేళ్ళల్లో ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు… వాళ్లలో విశ్వాసం సడలిపోతోంది… ధీమా పోతోంది… అది వాళ్లను డౌన్ చేస్తోంది… మానసికంగా డస్సిపోతున్నారు… కానీ… తోటివారందరూ చనిపోతున్నా, Stockdale మాత్రం బతికే వున్నాడు….! కారణం….?
Ads
ఎక్స్‌ట్రీమ్ లేదా అతి విశ్వాసం అత్యంత ప్రమాదకరం… మనం అనుకున్నట్టు ఆశ నెరవేకపోతే డిప్రెస్ అవుతాం… అది మనల్ని డౌన్ చేస్తుంది… మానసికంగా, శారీరికంగా… కానీ Stockdale పద్ధతి వేరు… అంతిమంగా నాకు శుభం జరుగుతుందని మాత్రమే నమ్మాడు… తన కోరిక నెరవేరడానికి కాలపరిమితి, డెడ్‌లైన్ పెట్టుకోలేదు… అదే నిజానికి మంచి చేస్తుంది… ఎప్పటికైనా తాను విడుదల అవుతానని మాత్రం అనుకున్నాడు. ఖచ్చితంగా తాను బయటకు వెళ్ళి మళ్లీ తనవాళ్ళను తప్పకుండా కలవగలననే నమ్మకం పెట్టుకున్నాడు… తన కథకు Happy Ending ఉంటుందని మాత్రం నమ్మకం పెట్టుకున్నాడు…
ఆఖరికి ఏడున్నర సంవత్సరాల తరువాత అతను జైలు నుండి రిలీజయ్యాడు… కాని తన తోటివారు మాత్రం అప్పటికే చనిపోయారు… ఇలా ఇతను బతకడానికి తోడ్పడిన ఈ ఆలోచనా విధానాన్నే Stockdale Paradox అంటారు… వరుసగా దెబ్బతీసే గ్రహచార దోషాలు కావచ్చు, అవి నమ్మకపోయినా వరుస మనస్తాపాలు కావచ్చు, అనుకోని ఉపద్రవాలు కావచ్చు, నష్టాలు కావచ్చు… అరె, నాకే ఎందుకు ఇవన్నీ అనే డిప్రెషన్… నాకు తెలివి ఉంది, సాధనసంపత్తి ఉంది, సర్కిల్ ఉంది, ఐనా నాకే ఎందుకీ ఎదురుదెబ్బలు అనే ఫ్రస్ట్రేషన్ చాలామందిలో చూస్తుంటాం…
అదుగో అలాంటి వాళ్ల కోసం ఉద్దేశించిందే ఈ స్టాక్ డేల్ పారడాక్స్… నిజం… మంచి జరగటానికి కాలపరిమితి, డెడ్‌లైన్ ఏమీ ఉండదు… అది జరగాలని ఉంటే జరుగుతుంది… నిరీక్షించడమే మనిషి పని… ఆశ కోల్పోకుండా, తను డౌన్ గాకుండా బతకడమే చేయాల్సిన పని… మంచికి టైమ్ వచ్చినప్పుడు వచ్చి తీరుతుంది… రోజులన్నీ చీకటేనా..? కాదు కదా..! ఈ ఆశావాదాన్నే ఈ కథ చెబుతుంది…
రిలీజయ్యాక Stockdale అమెరికన్ సైన్యంలో admiral గా పనిచేసాడు. ఆ తరువాత ఆయన రాసిన పుస్తకం A Vietnam Experience…. ఆ తరువాత Jim Collins అనే ఆయన Good to great అనే Book లో ఈ Stockdale Paradox గురించి రాశాడు… ఈ Stockdale Paradox Theory ని ఈ మధ్యనే Harvard university తమ Business School meeting లో కరోనా విషయంలో ఈ papers ని release చేసింది…… చివరిదాకా ఓపికతో ఉన్నవాడే యుద్ధాన్ని గెలవగలడు…. అదే దీని అంతస్సూత్రం… This is nothing but Survival Psychology in Crisis Management…..
Share this Article