నో డౌట్… దురుసు వ్యాఖ్యలు, అనాలోచిత విమర్శలు, గందరగోళం ఆలోచనలతో అప్పుడప్పుడూ వార్తల తెర మీదకు వస్తుంటాడు గానీ… సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పార్టీ నిబద్ధత మీద గానీ, ప్రజాకోణం మీద గానీ నాకెలాంటి వ్యతిరేకత లేదు… లెఫ్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎదిగాడే తప్ప, తెలంగాణలోనే ఉంటాడు తప్ప, చాలామంది సంకుచిత ఆంధ్రా నాయకుల్లాగే తనకూ తెలంగాణ సంస్కృతి మీద అవగాహన లేదు, అభిమానమూ లేదు…
తాజాగా అర్థమవుతున్నది అదే… ఈ మాట అనడానికి సందేహమే అక్కర్లేదు… బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్‌కి ఆహ్వానిస్తే నిరసన పేరిట బహిష్కరిస్తున్నాననే తన తాజా నిర్ణయం అదే… అదే…
Ads
నో డౌట్… సాయిబాబా తన ఆలోచనల పట్ల ఎప్పుడూ రాజీపడలేదు… రాజ్యానికి వ్యతిరేకంగా, ఓ ప్రశ్నించే గొంతుగా… తన దైహిక నిస్సహాయతల్లోనూ పోరాటాన్ని వదిలిపెట్టలేదు… ఎన్నేళ్లు జైలులో పెట్టినా ఈ వ్యవస్థ తనను దోషిగా నిరూపించలేకపోయింది… విచారణ ఖైదీగానే జైలులో నరకాన్ని చూపించింది… తన ఆరోగ్యం క్షీణించడానికి, ఇప్పుడు హఠాత్తుగా మరణించడానికీ రాజ్యమే కారణం… సందేహమే లేదు…
ఎస్, ఇది రాజ్యం చేసిన హత్యే… ప్రజాకోణంలో ఆలోచించేవాళ్లు, పోరాడేవాళ్లు అందరూ ఏకీభవిస్తున్న మాట ఇది… అవును, రాజ్యానిది ఎప్పుడూ కృూర స్వభావమే… మానవ హక్కుల మీద దానికెప్పుడూ తేలికతనమే… రాజ్యం పోకడల మీద ప్రజలదెప్పుడూ పోరాటమే… నిరంతరం…
ఐతే… నిరసన ప్రకటించడానికి చాలా మార్గాలున్నాయి… ఒక లెఫ్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి దాకా పార్టీలో ఎదిగిన సీనియర్ నాయకుడికి ఇది తెలియదా..? బండారు దత్తాత్రేయ పిలుపును తోసిపుచ్చడానికి తను చెప్పిన కారణాలన్నింటితోనూ నేను ఏకీభవిస్తున్నాను… కానీ అలయ్ బలయ్ బహిష్కరణ నిర్ణయమే తప్పు…
Sir Bandaru Datreya GaruExcuse me that I will not be able to attend your “Aloy Baloy ” Program in which every year you invites me irrespective of my political affiliation. Thanks for the invitation.
But as you know that Prof . Saibaba a famous intellectual and Professor of a prestigious university of Delhi was arrested by the government of India despite he was 90% orthopaedically challenged. Even bail which is a right under trial was denied. Ultimately after 10 years honourable court found him not guilty. Me and my party may not agree to Prof. Saibaba politics but there is no doubt that human right violation has taken place and ultimately the State has taken away from this world.
You are a gentleman but ultimately you represent the same government which led to his death.
Thanks for your invitation but in protest I will not be attending the the program organised by you.
K. Narayana
Secretary
CPI NATIONAL COUNCIL
బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ హోదాలో… అధికారికంగా అలయ్ బలయ్ ఏర్పాటు చేస్తున్నాడా..? ఇప్పుడేమైనా కొత్తా తనకు..? ఏ పదవి లేని రోజుల్లోనూ… పార్టీలకు అతీతంగా హైదరాబాదులో ఉండే ప్రముఖులను ఆహ్వానిస్తాడు… అచ్చమైన తెలంగాణ సంస్కృతి, వాతావరణంలో అతిథులను స్వాగతిస్తాడు… ఆలింగనాలు చేసుకుంటాడు… ఇక్కడ ఆత్మీయత తప్ప అధికార ప్రాతినిధ్యం ఏముంది..? ఇదే తెలంగాణతనాన్ని అర్థం చేసుకోవడంలో నారాయణ వైఫల్యం…
రేవంత్ రెడ్డి పార్టీకీ, బీజేపీకి వంద ఆమడల దూరం… కానీ దత్తన్న పిలవగానే వెళ్లాడు… అదీ సంస్కారం… అదీ తెలంగాణతనం…. అలయ్ బలయ్ విశిష్టత అదే… అది అర్థం చేసుకోవడానికి నారాయణ తెలంగాణవాడు కాదు… తెలంగాణను మనసావాచా వ్యతిరేకించే టిపికల్ ఆంధ్రా సంకుచిత నాయకుడు… (బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు కూడా హాజరయ్యారు… గోరెటి, వందేమాతరం తదితర గాయకులూ వచ్చారు… ఎందుకంటే, ఇది రాజకీయాలకు సంబంధం లేని తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమం కాబట్టి… ఆ సోయి ఆంధ్రా నారాయణకు లేదు కాబట్టి… అదే ఆంధ్రా నారాయణ అడుగులకు తెలంగాణ సీపీఐ నేతలు దాసోహం అంటున్నారు కాబట్టి…)
రాజకీయ నాయకుల్నే కాదు… సినిమా ప్రముఖులు, కవులు, జర్నలిస్టులు, రచయితలు, మేధావులు, కళాకారులు, ప్రవచనకారులు సహా చాలామందిని పిలుస్తాడు… (ఒక చిరంజీవి, ఒక గరికపాటి కూడా వస్తారు)… అది బండారు దత్తాత్రేయ అనబడే తెలంగాణ ప్రేమికుడు నిర్వహించే అలయ్ బలయ్… అంటే గెట్ టు గెదర్… దాన్ని నిరసనకు వేదికగా ఎంచుకోవడాన్ని ఏమనాలో తెలియదు… (ఈసారి దత్తన్న బిడ్డ మొత్తం పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నట్టుంది…)
అనేక రకాలుగా సాయిబాబా మరణానికి, రాజ్యం హత్యే అని చెప్పడానికి నిరసనలు ప్రకటించవచ్చు… కానీ హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా నిఖార్సయిన తెలంగాణ వ్యక్తిత్వంతో, ప్రజల మనిషిగా, తెలంగాణ సంస్కృతిని, ప్రేమను చాటిచెప్పే దత్తన్న ఆహ్వానాన్ని తోసిపుచ్చడం నారాయణకు సరికాదు… ఇదే తెలంగాణ మర్యాదకు, నారాయణకు తెలిసిన మర్యాదకూ నడుమ తేడా… ఈయన పోకడల మీద చివరకు పార్టీకి కూడా అదుపు లేనట్టుంది… కామ్రేడ్… ఈరోజుకూ నువ్వు ఎదగలేదు..,!!
Share this Article