మాట్లాడటం తెలియకపోతే మౌనాన్ని ఆశ్రయించడం బెటర్… జగన్ అర్జెంటుగా తన మంత్రులకు చెప్పాల్సిన నీతి అదే… ప్రత్యేకించి కీలకమైన హోం శాఖకు మంత్రిగా ఉన్న తానేటి వనిత మాట్లాడకుండా ఉంటేనే ప్రభుత్వానికి, పార్టీకి మంచిది… వెనకేసుకురావడం కాదు, జరుగుతున్న నష్టాన్ని గమనించాలి…
రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఓ గర్భిణి మీద జరిగిన అత్యాచారం సమాజమే నివ్వెరపోయేలా ఉంది… నిజానికి ఆ దుర్మార్గంలో సొసైటీని కూడా నిందించాలి… రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అత్యంత నీచంగా వ్యవహరించగా… ఆ ప్లాట్‌ఫారమ్ మీద ఉన్న ఇతర పౌరులు, బయట రిక్షావాళ్లు అందరూ చూస్తుండిపోయారు తప్ప ఎవరూ ఆమెను కాపాడటానికి ముందుకు రాలేదు… ఎందుకు..?
భయం… ఎటుపోయి ఎటు చుట్టుకుంటుందోననే భయం… ఆ భయాన్ని తొలగించడంలో ప్రభుత్వం వైఫల్యం ఉంది… ఇక మంత్రి దగ్గరకు వద్దాం… ఏపీలో అక్కడక్కడా అత్యాచార ఘటనలు రికార్డవుతున్నయ్… ఈ స్థితిలో ఆచితూచి మాట్లాడాలి… మొన్న తల్లుల పెంపకం బాగుంటే అఘాయిత్యాలు జరగవు అన్నట్టుగా ఏదో మాట్లాడింది… అది అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్య… షాకింగ్… ఓ హోం మంత్రి, అందులోనూ మహిళ… ఆమె నోటి నుంచి వచ్చిన ఆ వ్యాఖ్య అందరినీ అవాక్కయ్యేలా చేసింది…
Ads
నో, నో, నా మాటలు వేరు, ఆ ఆంధ్రజ్యోతి వాళ్లు తప్పుగా రాశారు అని ఆమె ఖండించినట్టుంది… కానీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది… బాధితురాలి ఉనికి బహిర్గతం చేసేలా వ్యవహరించకూడదు అనే చట్టనిబంధన, ఐపీసీ సెక్షన్ కూడా ఆమెకు తెలియదు… చెప్పిన పోలీస్ అధికారి లేడు… అదేమంటే, మంత్రికి ఎదురు మాట్లాడొద్దు… పోనీ, మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు తెలియదా..? ఐనాసరే, బాధితురాలి కుటుంబసభ్యులతో ఫోటోలు, వార్తలు…
నిన్న సేమ్… ఏదో మతపరమైన కార్యక్రమానికి వెళ్లిన హోం మంత్రి చాలా కాజువల్ కామెంట్స్ చేసింది… అసలు వాళ్లు అత్యాచారానికి రాలేదు, డబ్బు లాక్కునే ప్రయత్నం చేశారు, భర్తను కాపాడటానికి వెళ్లినప్పుడు హఠాత్తుగా ఆమె మీద కన్నుపడి అత్యాచారం చేశారు… వాళ్లు తాగి ఉన్నారు… అంటూ ఏదేదో చెప్పింది… ఈనాడు కథనం ప్రకారం… అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయి అని వ్యాఖ్యానించిందట… బహుశా జగన్‌కు మంత్రుల వ్యాఖ్యలు, పేపర్ క్లిప్పింగులు ఎవరూ చూపిస్తున్నట్టు లేదు…
అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయి, తాగి ఉన్నారు కాబట్టి అత్యాచారం చేశారు, అత్యాచారం చేయాలని రాలేదు… ఏమిటీ వ్యాఖ్యలు..? ఏం చెప్పదలుచుకుంది ఆమె..? పోనీ, ఏ డీజీపీకో బాధ్యత అప్పగిస్తే తను మాట్లాడతాడు కదా… మంత్రి మౌనంగా ఉండొచ్చు కదా… మాట్లాడితే ఎక్కువ నష్టం ఉన్నప్పుడు మౌనంగా ఉండటం వల్ల వచ్చే నష్టం ఏపాటి..? రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల మీద మాట్లాడే సజ్జల ఎందుకో గానీ హోం వ్యవహారాల మీద కిమ్మనడం లేదు…
డయాఫ్రమ్ వాల్ మీద అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలే జనంలో బాగా నవ్వుల పాలయ్యాయి… జగన్‌ను ఆరాధించండి, ఇళ్లస్థలాలు వస్తాయి అంటూ మరో మంత్రి జర్నలిస్టులకు ఉచిత సలహా ఒకటి పారేసిన తీరు కూడా అంతే… ఇప్పుడు హోం మంత్రి… జగన్ సార్, అర్జెంటుగా మీ మంత్రులకు ఓ స్వల్పకాలిక శిక్షణ ఇప్పిస్తే బెటరేమో… ఆలోచించండి… అసలే మీ ప్రత్యర్థులు చాలా నొటోరియస్ బ్యాచ్… తమ్మినిబమ్మి చేసే బాపతు… గాలి నుంచి అకారణంగా వివాదాల్ని రాజేసి, మీద పడేసే రకం… ఈ స్థితిలో మంత్రుల నోటా వెలువడే ప్రతి మాటా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి… అవసరముంది…!! నువ్వెలాగూ మీడియా ముందుకు రావు, ఏమీ మాట్లాడవు, కనీసం మంత్రుల మాటల తీరునైనా కాస్త పట్టించుకో బాసూ…!!
Share this Article