వాటీజ్ దిస్ డీఎస్పీ సాబ్..? బన్నీ కూడా మెగా ఫ్యామిలీయే… మెగాస్టార్ దాని బాస్… కానీ నువ్వే పుష్పకు ఆల్‌టైమ్ హిట్ ట్యూన్స్ ఇచ్చావు… దుమ్ము రేగ్గొట్టావు… దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా, శ్రీవల్లీ, సామీ సామీ, ఊ అంటావా ఊఊ ఉంటావా… ఒక్కొక్కటీ ఇరగదీశాయి… అసలు పుష్ప హిట్ కావడానికి పాటల ట్యూన్లు కూడా ఓ కారణమే… ఒక్కో భాషలో ఒక్కొక్కరితో పాడించావు… వెరసి పుష్ప పాన్ ఇండియా సూపర్ హిట్…
మలయాళంలో వోకే, కానీ తమిళంలో, హిందీలో కూడా ఎవరీ బన్నీ అని ప్రేక్షకులు, ట్రేడ్ నిపుణులు ఆసక్తిగా చూశారు… మరీ సమంతను ఐటమ్ గరల్‌ను చేసిన ఊ అంటావా ఊఊ అంటావా మామూలు హిట్ కాదు… పుష్ప సీక్వెల్‌కూ అలాగే కష్టపడుతున్నావని అంటున్నారు… కానీ ఆ మెగా క్యాంపుకే బాస్ చిరంజీవికి మరీ ఇంత సాదాసీదా ట్యూన్లు చేస్తున్నావేమిటి బ్రదర్…?
ఆచార్య ఫట్, గాడ్ ఫాదర్ జస్ట్ వోకే… అందుకే ఇంకా ఫుల్లు మాస్‌కు వెళ్లిపోతున్నాడు బాసు… ఆ పాత ముఠామేస్త్రీ వేషం వేశాడు… అదే స్టెప్పును కాస్త శ్రమ తెలియకుండా, ఈ వయస్సులో ఇబ్బందిగాకుండా శేఖర్ మాస్టర్‌తో స్టెప్పులు కంపోజ్ చేయించుకున్నాడు… తీరా చూస్తే ఆ పాటకు ట్యూన్ అభిమానులను నిరాశపరుస్తోంది… అంటే, బాగాలేదని కాదు, మెగాస్టార్ రేంజుకు సరిపడా లేదు…
Ads
ఇప్పుడు చెప్పు… బాసు బామ్మరిది కొడుక్కేమో అదరగొట్టే పాటలు కంపోజ్ చేస్తావా..? అసలు బాస్ పాట అనేసరికి పంక్చర్ చేస్తావా..? పైగా నువ్వే రాసి, నువ్వే పాడి, నువ్వే కంపోజ్ చేసి… ఓహో సూపర్ అనుకోమంటావా..? అదొక కంటెంటా..? అదొక మాస్ బీటా..? మాస్ బీట్, అందులోనూ తెర మీద చిరంజీవి కనిపిస్తూ స్టెప్పులు వేస్తుంటే ఈలలతో థియేటర్ దద్దరిల్లిపోవాలి… కానీ నువ్వేం చేశావు..?
అదేదో తమిళంలో ‘వేర్ ఈజ్ ది పార్టీ’ అని శింబు సినిమాలో ఉన్న పాటను అలాగే దింపావట… మరీ కాపీలా లేదు, చాలా తేడా ఉంది గానీ… అసలు నీ ఒరిజినాలిటీ ఏమైపోతోంది..? చిరంజీవి నీమీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటే… నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడేసుకో, నువ్వు కర్చీఫ్ కట్టుకో, బాసొస్తుండు… అంటావ్… పోనీ, బాస్ వచ్చాడు అన్నాక కంటెంట్ దద్దరిల్లాలి కదా… వేర్ ఈజ్ ద పార్టీ అని ఆ ముఖ్య డాన్సర్ ఎవరో ఎగురుతుంటే… సింపుల్‌గా నా బోటు ఎక్కు, డీజే నొక్కు చాలు, బొంబాటుంటాది, పగులుద్ది పార్టీ అనిపిస్తావా..? పైగా ప్రతి చరణం తరువాత హెయ్ అని ఓ వింత పదం పదే పదే…
నువ్వు లైట్లేసుకో, హెయ్, నువ్వు కలర్ మార్చుకో, నువ్వు సౌండ్ పెంచుకో, బాసొస్తుండు, బాసొస్తుండు
పబ్బుల్లోన పార్టీ అంటే షరా షరా మామూలే, హౌజ్ పార్టీ అంటే కొత్తగా ఉండదు ఏ మూలే
బీచ్ పార్టీ అంటే రీచ్ పెద్దగా ఉండదులే, క్రాజ్ పార్టీ అంటే మాస్ పెద్దగా పండదులే
నువ్వు బాటిల్ అందుకో, నువ్వు గ్లాస్ అందుకో, నువ్వు సుక్కేసుకో, బాసొచ్చిండు…
హోటల్‌లో పార్టీ అంటే హీటే ఉండదు ఎందుకులే, గల్లీలోన పార్టీ అంటే సిల్లీసిల్లీ గుంటదిలే
టెర్రస్ మీద పార్టీ అంటే ప్రైవసీ అస్సలు ఉండదులే, పెంట్ హౌజు పార్టీ అంటే రెంటే చాలా ఐతదిలే
నువ్వు డప్పందుకో, నువ్వు డోలందుకో, నువ్వు బూరందుకో, బాసొచ్చిండు, రఫాడిస్తుండు
…… అన్యాయం డీఎస్పీ… ఇంకా మిగతా పాటలు ఏం చేశావో, ఏమిటో ఇక చూడాల్సిందే…!! ఉప్పెనలోని జలజలపాతం ట్యూన్‌ను వారియర్ సినిమాలో దడదడ పాటకు వాడేశావు, అంటే నీ పాటనే నువ్వు కాపీ చేసేయడం… థమన్ మెల్లిగా నంబర్ వన్ ప్లేసులోకి వెళ్తుంటే నీలో ఏదో ప్రస్ట్రేషన్ వస్తున్నట్టుంది… కొత్తగా ఓ జోష్ చూపించలేకపోతున్నావు… ఆమధ్య ఎక్కడో వెకేషన్‌కు వెళ్లి హరే రామా హరే కృష్ణా, ఓ పోరీ అని ఓ ప్రైవేటు సాంగ్ చేశావు… దాని మీదా వివాదం… నిజంగానే అదొక చెత్త టేస్టు… అవునూ, నీకు ఏమైంది..?
Share this Article