యువ నాయకుడు, నా లవుడా నాయకుడు… ఒరేయ్ దొంగనాకొడకా… కాసేపు ఉచ్చ ఆపుకో… ఇక్కడ మాట్లాడుతున్నా కదా, –గెయ్… సూక్తులుంటే రాయి, నేను ఉచ్చ పోసుకునేటప్పుడు చదువుతా… ఏమిటీ బూతులు, సైట్ అనుకున్నావా..? ఓటీటీ వెబ్ సీరీస్ అనుకున్నావా అంటారా..? పర్లేదు, అనాల్సిందే… అవి అలాగే రాసినందుకు క్షమించండి…
కానీ ఇట్లా బూతులు పలికితేనే హీరో పాత్ర కేరక్టరైజేషన్ ఇంటెన్స్‌గా ఉంటుందని రాబోయే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా హీరో విష్వక్సేనుడు, దర్శకుడు, డైలాగుల రచయిత గట్రా భావించినట్టున్నారు… నెగెటివ్ షేడ్స్ అంటే అందులో పదే పదే బూతుల్ని ఊతపదాలుగా వాడటం కూడా ఒకటి అనుకున్నట్టున్నారు… అంతే, అలాగే పెట్టేశారు… మరి అదే తీవ్రత ప్రతిబింబించాలంటే ఆ బూతుల్ని యథాతథంగా రాయాలి కదా… ఐనా సరే, ఓచోట డ్యాష్ చుక్కలు పెట్టకతప్పలేదు… ఏదో ఆపేసింది అది రాయకుండా…
ఈ సినిమా దర్శకుడిని అదేమీ ఆపలేదు… అసలు రెండు నిమిషాల ట్రెయిలర్‌లోనే ఈ రేంజ్ ఉంటే, ఇక రెండున్నర గంటల సినిమాలో ఇంకెన్ని బూతులో, ఇంకేం దరిద్రాలో… అదేమంటే పాత్ర డిమాండ్ చేసింది అంటారేమో… ఖర్మ… బాలయ్యే నయం, అదేదో సినిమాలో మాదచ్చోద్ అని తిట్టడానికి మాదాపూర్ అంటాడు… లమ్డీకొడకా అని తిట్టడానికి లక్డీకాపూల్ అంటాడు… ప్రేక్షకుడికి అర్థమవుతూనే ఉంటుంది… కానీ బూతులకు వేరే ముసుగు పదాల కవరింగు అన్నమాట…
Ads
అవునూ, ఒకవేళ హీరో ఇంకా పచ్చి బూతులు వాడేవాడు అనుకుందాం, ఆ పాత్ర అదే అనుకుందాం… అవీ పెట్టేస్తారా..? పెట్టేశారా సినిమాలో..? పెట్టేయాలా..? పెడితేనే ఆ నెగెటివ్ షేడ్స్ తీవ్రత ఆవిష్కృతం అవుతుందా..? చివరకు ట్రెయిలర్‌కు కూడా ఏ, ఏఏ, ట్రిపుల్ ఏ, లేదంటే ట్రిపుల్ ఎక్స్ అని సెన్సారోళ్లు కొత్తగా సర్టిఫికెట్లు జారీ చేయాలా..? ట్రెయిలర్లు కూడా ఫ్యామిలీతో కలిసి చూడాలో వద్దో ముందే వాళ్లనూ వీళ్లనూ అడిగి సాహసం చేయాలా..?
ప్చ్, టీవీ9 నాగవల్లి దేవి వెంటనే రియాక్టయి, విష్వక్సేన్ మీద రుధిరవర్షాన్ని కురిపిస్తుందీ అనుకుంటే, ఆ జాడలేమీ కనిపించలేదు… బహుశా ఇవన్నీ విని ఠారెత్తిపోయిందేమో… మామూలుగా విజయ్ దేవరకొండకు రౌడీ హీరో అనే పేరుంది… మరీ ఇంత పచ్చి బూతులేమీ వాడడు, వాడలేదు, వాడాల్సిన పనిలేదు, ఎటొచ్చీ విష్వక్సేనుడే ఏది చేసినా ఇదో టైపు…
ఏమాటకామాట… గతంలో పెద్ద ఇంప్రెసివ్ నటన చూపించిన ఛాయలేమీ లేవు గానీ… ఈ ట్రెయిలర్ చూస్తుంటే ఆ పాత్రలోకి ఎంచక్కా దూరిపోయి, ఆ నెగెటివ్ షేడ్స్‌ను మొహంలో భలే పలికించాడు… గుణం మంచిదే కానీ, అని ఏదో అన్నట్టు… మంచి నటుడే కానీ…? సరే, ఆ బూతుల్ని పక్కన పెట్టి మరికొన్ని ఇంటెన్స్ డైలాగులు చూద్దాం…
నాకు తెలిసిందొక్కటే… మన మీదికి ఎవడైనా వస్తే, వాడి మీద పడిపోవడమే… మనుషులు మూడు రకాలురా… ఆడాళ్లు, మగాళ్లు, రాజకీయనాయకులు… చికెన్ అయిపోయింది, బండితియ్… ఇవన్నీ ఆయా సందర్భాలకు తగినట్టు బాగా పేలే లక్ష్మి బాంబుల్లాగే ఉన్నాయి… మరి ఇలాంటి డైలాగులతో మరింత పవర్‌ఫుల్‌గా ఆ పాత్రను ఫోకస్ చేసే అవకాశం, సామర్థ్యం ఉన్నప్పుడు ఆ బూతుల్ని ఎందుకు ప్రయోగించినట్టు..? ఏమోలెండి, మళ్లీ కోపమొస్తే ఇదే ట్రెయిలర్‌లో హీరో అన్నట్టే… ‘‘ఇవి కాదురా, ఏదైనా బలంగా రాయి’’ అంటాడేమో…!!
Share this Article