.
సోషల్ మీడియాలో కొన్నిసార్లు హఠాత్తుగా కొన్ని ప్రచారాలు స్టార్టవుతుంటాయి… అబద్ధాలే… తప్పు అంచనాలు, తప్పు జడ్జిమెంట్లు… తెలిసి రాస్తారో తెలియక రాస్తారో…
హైపర్ ఆది మీద నిన్నటి నుంచీ కనిపిస్తున్న ఓ వార్త అదే కోవలోకి వస్తుంది… ఈటీవీలో సంక్రాంతి సందర్భంగా ఓ స్పెషల్ షో చేశారు… సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, రాజకీయాల్లో యాస్పిరేషన్స్ ఉన్నా, పవన్-చిరు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నా సరే, తనకు తెర బతుకునిచ్చిన ఈటీవీని మాత్రం వదలడు…
Ads
జబర్దస్త్ వదిలేసినా సరే, ఢీ, ఇతరత్రా స్పెషల్ షోలు చేస్తుంటాడు, ఈటీవీ ఆస్థాన కమెడియన్ తను… తాజా వివాదం ఏమిటంటే..? (నిజానికి వివాదమే లేదు)… ఆ సంక్రాంతి స్పెషల్ షోలో ఆది పుష్ప-2 స్పూఫ్ చేశాడు… తనదైన పంచులు ఎలాగూ ఉంటాయి కదా…
జాతర వేషం కూడా వేశాడు, అల్లు అర్జున్‌ను బాగా అనుకరించాడు… ఆ స్కిట్ రక్తికట్టింది… సరే, తన స్కిట్లలోకి వ్యక్తిగత విషయాలు జొరబడుతూ చికాకుపెడుతుంటాయి కొన్ని… అదే ధోరణిలో దొరబాబు అనే కమెడియన్‌తో మాటామంతీ… ఎవరినో స్టేషన్ నుంచి విడిపించుకోవడానికి వెళ్తే, పోలీసు వేషంలో ఉన్న దొరబాబు రూల్స్ ఒప్పుకోవ్ అంటాడు…
అదేమిటి… నిన్ను స్టేషన్ నుంచి మేం విడిపించుకురాలేదా అని ఆది పంచ్ వేస్తాడు… ఇంకేముంది..? ఇది ఇన్‌డైరెక్టుగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లిన సంఘటన మీద విసిరిన పంచ్ అని కొందరు రాసిపారేశారు… ఒకరిని చూసి మరికొందరు… వాళ్లకు అసలు హైపర్ ఆది, దొరబాబు, పరదేశి బాపతు పాత ఇన్సిడెంట్ తెలియదు అని అర్థం… లేదా కావాలనే ఆదిని టార్గెట్ చేస్తున్నారని అర్థం…
అప్పట్లో ఏదో కేసులో కోస్తాంధ్ర పోలీసులు దొరబాబును, పరదేశిని బుక్ చేస్తే ఆది అండగా నిలబడ్డాడు… అప్పుడప్పుడూ పలు స్కిట్లలో అవి గుర్తుచేస్తూ ఉంటాడు… అనవసరం… కానీ ఈ స్కిట్‌లో కూడా ఆ కేసు గురించే తను మాట్లాడింది… తన సహజ ధోరణిలో… అంతేతప్ప అల్లు అర్జున్ మీద సెటైర్ ఏమీ కాదు… అనవసరంగా ఆ ఫ్యాన్స్‌ను గెలకడం తప్ప ఈ రాతల్లో పస లేదు, నిజం లేదు…
తను పవన్ కల్యాణ్ వీరాభిమాని, ఎస్, జనసేన యాక్టివిస్టు… గతంలో కూడా పవన్‌కు సపోర్టుగా, మెగా క్యాంపు మనిషిగా చాలామందిపై తన స్కిట్లలో కౌంటర్లు వేశాడు… కానీ అల్లు అర్జున్ మీద ఎప్పుడూ నోరుపారేసుకున్న దాఖలాలు మాత్రం లేవు… తను బన్నీ మీద పంచులు ఎందుకు వేస్తాడు..?
అలాగే స్పూఫ్ మొత్తం బాగాలేదనీ, రాజకీయ ప్రేరితమనీ ఎవరో రాశారు… స్పూఫ్ అంటేనే సినిమాల్లోని, నిజజీవిత వార్తల్లోని ఏదో పాపులర్ ఇన్సిడెంటును హాస్యస్పోరకంగా ఇమిటేట్ చేయడం… ఇమిటేషన్ లేకపోతే స్పూఫ్ ఏముంటుంది..? పీలింగ్స్ వత్తుండాయ్ అంటూ ఫైమా అతి చేసిందని మరో విమర్శ… ఆ పాటే అత్యంత భారీ అతి… ఇంకెలా చేస్తారు మరి..!!
ఫైమా కూడా బాగానే చేసింది… ఆది కూడా ఫైమా కాలితో గడ్డం గోక్కోవడం కూడా బాగానే వచ్చింది… ఒక టీవీ షోలో స్పూఫ్ ఇంతకు మించి ఏముంటుంది..? ఆదిని చాలా ఇష్యూలలో విభేదించవచ్చు, కానీ ఈ స్పూఫ్ విషయంలో తనను నిందించడానికి ఏమీ లేదు..! ఎటొచ్చీ మరీ, దాక్షాయణి పాత్రను లేడీ గెటప్ శాంతిస్వరూప్‌తో వేయించడం… ఫాఫం అనసూయ..!!
Share this Article