ఒకాయన ఎవరో రాశాడు… మోడీ సైనిక దుస్తులు ధరించడం ఏమిటి… అని ఓ కేసు పడింది, కోర్టు ప్రధాని ఆఫీసుకు అక్షింతలు వేసింది, మొట్టికాయలు వేసింది అని… నిజానికి వార్తలో స్పష్టత ఏమిటంటే… కోర్టు పీఎంవోకు నోటీసులు జారీ చేసింది… ఏ కోర్టయినా సరే, ముందుగా నోటీసులు జారీ చేయడం సహజమే కదా… అయితే… మోడీ అంత దుర్మార్గానికి పాల్పడ్డాడా..? ఆ కేసు వార్తలో చెప్పినట్టు ఐపీసీ 140 ప్రకారం నేరమా..? ఓసారి ఈ వార్త చూడండి ఓసారి…
రాకేశ్ నాథ్ పాండే అనే లాయర్ ఈ కేసు ఫైల్ చేశాడు… గుడ్… జవాన్లు ధరించే యూనిఫాంను ఇతరులు ధరించడం శిక్షార్హం అన్నాడు, మోడీని శిక్షించాలన్నాడు… వోకే, అడగడంలో తప్పులేదు అనుకుందాం… కానీ కోర్టు వెంటనే దాన్ని అంగీకరించడం, ఏకంగా ప్రధాని ఆఫీసుకు నోటీసులు జారీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది… నిజానికి కోర్టు సింపుల్‌గా ఆ సెక్షన్ ఏమిటో ఓసారి పరిశీలిస్తే సరిపోయేది కదా… ఓసారి మనం చూద్దాం, ఆ సెక్షన్ ఏమిటో…
Ads
Whoever, not being a soldier, sailor or airman in the Military, Naval or Air service of the Government of India, wears any garb or carries any token resembling any garb or token used by such a soldier, sailor or airman with the intention that it may be believed that he is such a soldier, sailor or airman, shall be punished with imprisonment of either description for a term which may extend to three months, or with fine which may extend to five hundred rupees, or with both.
ఎవరైనా సరే… ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దుస్తుల్ని గానీ, మెడల్స్‌ను పోలిన సింబల్స్ గానీ ధరించి… మేం ఆ సాయుధ విభాగాల్లో మనుషులమే అనే భావనను కలిగిస్తే సెక్షన్ 140 ఆఫ్ ఐపీసీ ప్రకారం నేరం… శిక్షకు కూడా అర్హులే… కానీ ఇక్కడ క్లారిటీ ఉంది… దురుద్దేశంతో తాము ఆయా సాయుధ రక్షణ విభాగాలకు చెందినవారమే అని నమ్మించడానికి గనుక ఆ దుస్తులు, ఆ ఎంబ్లమ్స్ గట్రా ధరిస్తే అది శిక్షార్హమైన నేరం… కానీ ఇక్కడ..?
మోడీ ఈ దేశ ప్రధాని… తను సరిహద్దుల్లోకి వెళ్లినప్పుడు ఆర్మీ ఆఫీసర్లే ఆ దుస్తులు ఇచ్చారు, గౌరవించారు… దేశరక్షణకు ప్రాణాలర్పించడానికి కూడా సిద్ధపడే సిబ్బందిలో ‘‘మనమంతా ఒకటే, దేశం మీ వెంట ఉంది’’ అనే ఓ నైతిక మద్దతును ఇవ్వడానికి, వారి సేవల్ని గౌరవించడానికి మోడీ ఆ దుస్తుల్ని ధరించాడు… స్వీట్లు పంచాడు… మోరల్ సపోర్ట్… సింపుల్, ఇక్కడ తను ఆర్మీ విభాగాలకు చెందినవాడిని అని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎక్కడుంది..?
నిజానికి ఇక్కడ ఓ ప్రధాని సరిహద్దుల్లోకి వెళ్లి, జవాన్లలో ఆత్మస్థయిర్యాన్ని, గౌరవాన్ని పెంపొందించడానికి చేసిన ప్రయత్నం అది… ఆర్మీ దుస్తులు ధరిస్తే ఏమిటట..? సచిన్, ధోనీ వంటి క్రికెటర్లు ఈ దుస్తులు ధరించారనీ, అదీ గౌరవపూర్వకం, మర్యాదపూర్వకం అనే విషయాన్ని విస్మరిస్తే ఎలా..? దాన్ని తప్పుపడుతూ ఎవరో లాయర్ కేసు వేయడం ఏమిటి..? కోర్టు నోటీసులు జారీ చేయడం ఏమిటి..? సరే, జారీ చేశారు సరే, అందులో అక్షింతలు, మొట్టికాయలు అనే ఆంతర్యం ఏమున్నట్టు..? అసలు ఇలాంటి కేసుల్ని విచారణకు స్వీకరించడంలోనే ఓ సంయమనం అవసరం కదా… హేమిటో…!!
Share this Article