Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జార్ఖండ్ రిజల్ట్…! ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా సరే ఈ దురవస్థ దేనికి..?

November 23, 2024 by M S R

,

బీజేపీకి జార్ఖండ్ ఎందుకు చేజారింది..? హేమంత్ సోరెన్ మీద అవినీతి ఆరోపణల్ని జనం ఎందుకు పట్టించుకోలేదు… మోడీషా అక్కడ ఎందుకు ఫెయిలయ్యారు..?

రకరకాల సమీకరణాలు… 1) హేమంత్ సోరెన్ మీద అవినీతి ఆరోపణలు చేసి, జైలుపాలు చేసి, కొందరిని తమ క్యాంపులోకి లాగేసి, ఏవేవో శుష్క ప్రయత్నాలు చేసింది బీజేపీ…

Ads

హేమంత్ సోరెన్ మీద ప్రజల్లో సానుభూతి… బీజేపీ అధికారం కోసం తనను వేధిస్తున్నదని..! అంతే… అంతకుమించి ప్రజలు ఆలోచించరు… ఎందుకంటే..? అవినీతి, అక్రమాలకు అతీతంగా ఉన్న నాయకుడంటూ దేశంలో లేదు గనుక… అక్రమాలకు మద్దతు పలకని పార్టీ అంటూ లేదు గనుక… బీజేపీ దానికి అతీతం కాదు గనుక…

అది అసలే ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతం… రెండేళ్లు, మూడేళ్ల ముందు ఈడీ, ఐటీ, సీబీఐ గట్రా కొరఢా ఝలిపిస్తే కథ వేరు… తీరా ఎన్నికలకు ముందు అలాంటివి ఏడిస్తే అవి బాధితుడికే మేలు…

ఆ సోయి బీజేపీకి లేదు.., అది హేమంత్ సోరెన్‌కు అడ్వాంటేజ్ అయిపోయింది… జార్ఖండ్ గెలుపు జేఎంఎం పార్టీది… అంతేతప్ప కాంగ్రెస్‌ది కాదు… వ్యూహాత్మకంగా జార్ఖండ్‌లో బీజేపీ అట్టర్ ఫ్లాప్… దాని స్ట్రాటజీలన్నీ ఫెయిల్…

ఒకప్పడు జార్ఖండ్‌ను ఇచ్చింది బీజేపీ… ఇప్పుడు దాన్ని దేకేవాళ్లే లేరు… తెలంగాణలోనూ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్… కానీ మొన్నమొన్నటిదాకా దాన్ని దేకినవాడు లేడు… మొన్నటి కాంగ్రెస్ గెలుపు కూడా ప్రజల్లో మండుతున్న కేసీయార్ వ్యతిరేకత తప్ప రేవంత్ అనుకూల వోటు కాదు, కాంగ్రెస్ పట్ట ఆదరణ కూడా కాదు…

సో, ఓవరాల్‌గా కాంగ్రెస్ ప్లస్ రాహుల్ నాయకత్వం మీద దేశ ప్రజానీకానికి భ్రమలేమీ లేవు… ఇందిర, నెహ్రూ, రాజీవ్ నామస్మరణతో జనంలో వచ్చే ఫాయిదా కూడా ఏమీ లేదు… ఇప్పుడు కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణలో రేవంత్ సర్కారు మీద అసంతృప్తి స్టార్టయింది… అది ఏ తీరాలకు చేరుస్తుందో కాలం చెబుతుంది…

బెంగాల్‌లో కాంగ్రెస్ లేదు, సీపీఎం లేదు… మమత పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ… ఒడిశాను ఆల్రెడీ కైవసం చేసుకుంది… ఏపీలో బీజేపీకి సొంతంగా ఏమీ లేకపోయినా అధికారం ఎన్డీయేది… ఈశాన్యం ఆల్రెడీ ఎన్డీయేదే…

బీజేపీ కమ్ముకుని వస్తున్న తీరు చూడాలి… మోహన్ భగవత్ అనే శుష్క, డొల్ల కేరక్టర్‌ను (అహం) వదిలేస్తే ( I dare to say )…. మోడీషా తాలూకు బీజేపీ స్థిరంగా కదులుతోంది… కేరళ, తమిళనాడు వదిలేస్తే… ఈ దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ఫస్ట్ ఆర్ సెకండ్…

రాహుల్ అర్థమవుతోందా..?! కాదు, కాదు, ఈ దేశ సమగ్రతను పణంగా పెట్టేయగల సమర్థ సెక్యులర్ పార్టీలకు అర్థమవుతోందా..? ఐనా జార్ఖండ్ గెలుపు నీది కాదు… అది హేమంత్ సోరెన్‌ది… చివరగా ఒక్క మాట… జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు, బీజేపీ ఇచ్చింది…

ఐతేనేం… దాని విముక్తి కోసం పోరాడిని జేఎంఎం చివరకు కాంగ్రెస్‌తో జతకలిసింది.,. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన బీజేపీ ఈ ఎన్నికల్లో మరోసారి చతికిలపడింది… వ్యూహారాహిత్యం… 1) బీజేపీ నాయకత్వ లోపం… 2) సీబీఐ, ఈడీలతో పిచ్చి ఆటలు… 3) ఎన్నికల సంవత్సరంలో అరెస్టులు, కేసులు, దాడులు… మరెన్నో…!!

అవునూ… జార్ఖండ్, ఏపీలోలాగే… కేటీయార్‌ను అరెస్టు చేస్తే, కేసీయార్‌ను ఫిక్స్ చేస్తే, హరీష్‌ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తే… వచ్చేసారి రేవంత్ మళ్లీ ఎన్నికవుతాడా..? చాలా చిక్కుప్రశ్న… అవేవో చేస్తే ఇప్పుడే చేయాలి… తీరా ఎన్నికల సంవత్సరంలో చేస్తే… ఇదే కేటీయార్ ముఖ్యమంత్రి అవుతాడు… రేవంత్ పార్టీలో ఇంత లోతైన చర్చ, మథనం ఉంటుందని అనుకోను..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions