జయసుధ మొన్న తనే స్వయంగా చెప్పింది… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూలో భాగంగా… ‘‘నాకు రాజకీయాల్లో సరైన గైడెన్స్ లేదు… అప్పట్లో వైఎస్ పిలిస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లాను… ఎమ్మెల్యేగా గెలిచాను… ఆయన మరణం తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్ సీఎంలు… తరువాత కూడా టికెట్ వచ్చింది, ఓడిపోయాను… ఓటమి తరువాత చంద్రబాబును కలిశాను… ఆయనంటే నాకు పిచ్చి అభిమానం…
రాజకీయాల్లోనే ఓ కొత్త ఒరవడి తెచ్చిన నాయకుడు ఆయన… అభివృద్ధి, విజన్, అడ్మినిస్ట్రేషన్‌లో ఆయన మార్క్ ఎవరూ కాదనలేరు… నాడు మోడీకి కూడా ఓ రోల్‌మోడల్‌గా ఉన్నారు… ఆ గౌరవంతో వెళ్లి పార్టీలో జాయిన్ అయ్యాను కానీ తరువాత ఎవరూ నన్ను పట్టించుకోలేదు, తరువాత జగన్ పార్టీలో చేరాం… నాతోపాటు మొదటి నుంచీ ప్రయాణిస్తున్నవాళ్లకే ప్రాధాన్యం అని ఆయన చెప్పాడు… తరువాత పార్టీ వాళ్లతో నాకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు… అసలు నేను పార్టీలో ఉన్నట్టు వాళ్లకే తెలియదు…’’
….. ఇవే ఆమె మాటలు… నిజమే, ఆమెకు రాజకీయాల్లో సరైన గైడెన్స్ లేదు… తనకు తెలియదు… చంద్రబాబు తమ పార్టీలో చేరే సినిమా తారల పట్ల ఎలా వ్యవహరిస్తాడో, తెలుగుదేశం పార్టీలో తను ఇమడగలదో లేదో ఒక్కసారి తన సహనటి జయప్రదను అడిగినా తెలిసిపోయేది… జయప్రద, రోజా, కవిత… చాలామందికి చేదు అనుభవాలున్నయ్… పైగా ఈరోజుకూ చంద్రబాబు అంటే విపరీతమైన అడ్మిరేషన్ కనిపిస్తోంది ఆమె మాటల్లో… చివరకు మోడీకి కూడా చంద్రబాబే రోల్‌మోడల్ అని వ్యాఖ్యానిస్తోంది… ఆమెను బీజేపీ రారమ్మని ఆహ్వానిస్తోంది… ఐరనీ…
Ads
రోశయ్య గానీ, కిరణ్‌కుమార్ గానీ ఆమెకు అన్యాయం చేయలేదు… కాంగ్రెస్ కూడా ఆమెకు అన్యాయం చేయలేదు… టికెట్టు ఇచ్చింది… కానీ ఈమె ఓడిపోయింది… అసలు నియోజకవర్గాన్ని ఎప్పుడైనా పట్టించుకుంటే కదా… జస్ట్, మొహం చూసి, పేరు చూసి వోట్లేసే రోజులు పోయాయి… ఆ నిజం తెలుసుకోలేకపోయింది… పోనీ, అదే పార్టీని పట్టుకుని నిలబడిందా..? లేదు..! జగన్ పార్టీలోకి వెళ్లి, స్థిరంగా తనతో ఉందా..? లేదు…! టీడీపీలో చేరాక సహజంగానే జగన్ ఆమెను లైట్ తీసుకున్నాడు… కష్టకాలంలో తనతో లేకుండా, వెళ్లి చంద్రబాబు క్యాంపులో చేరిన ఆమె పట్ల జగన్‌కు అభిమానం ఉండాల్సిన అవసరమేముంది…? ఆమె చెబుతున్నది నిజమే… అసలు ఆమె ఆ పార్టీలో ఉన్నట్టు పార్టీకి తెలియదు… అసలు ఆమె రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నదెక్కడ…?
వోకే, మరి ఇప్పుడు బీజేపీకి కావాలట ఆమె… నిజానికి యాక్టివ్ పాలిటిక్స్ మీద ఆమెకు ఆసక్తి లేదు… జగన్ పార్టీలో చోటులేదు, ఉన్నా తెలంగాణలో చేసేదేమీ లేదు… టీడీపీలోకి మళ్లీ పోలేదు… పోయినా తెలంగాణలో ఉద్దరించేది ఏమీ లేదు… టీఆర్ఎస్‌లో ఇప్పటికే రద్దీ ఎక్కువైంది… బీజేపీకి కూడా ఆమెతో వచ్చే ఫాయిదా ఏమిటో వాళ్లకైనా క్లారిటీ ఉందా..? పైగా పార్టీలో చేరడానికి షరతులు… బహుశా ఏదైనా మంచి నామినేటెడ్ పోస్టు కావాలని అడిగి ఉండవచ్చు… ఎన్నికల్లో పోటీచేయను అని చెప్పి ఉండవచ్చు…
ఎన్నికల్లో పోటీచేయదు, యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండదు… మరి ఆమెతో బీజేపీకి వచ్చేదేమిటి..? ఈ ప్రశ్నకు నిజంగానే జవాబు లేదు… విజయశాంతి పార్టీలో ఉంది… ఎప్పుడో ఓసారి ఓ ట్వీట్ కొడుతుంది… అంతే, అదే ఆమె యాక్టివిటీ… పేరుకు వీళ్లు పార్టీలో ఉంటారు తప్ప జనంలోకి వెళ్లేది లేదు… పతాకాన్ని మోసేదీ లేదు… ఆమె బీజేపీలో చేరుతుందా లేదా కాలం తేలుస్తుంది… కానీ బీజేపీకి షరతులు పెట్టి పార్టీలో చేరడమనేదే ఆశ్చర్యంగా ఉంది… బీజేపీలో అవేమీ కుదరవు… నిజమే… సుజాత అలియాస్ జయసుధకు రాజకీయాలు తెలియవు…. గైడెన్స్ కూడా లేదు…!! అబ్బెబ్బే, నేను 21న పార్టీలో చేరడం లేదనే హడావుడి ఖండన కూడా ఆ గైడెన్స్ లేని లోపమే…!!
Share this Article