ముందుగా చార్మినార్, కాకతీయ కళాతోరణాలు చిహ్నాలు ఉండటం మన గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక, అందుకే కేసీయార్ అలా ఎంబ్లమ్ చేయించాడు, రేవంత్ దాన్ని భగ్నం చేస్తూ, తెలంగాణ అస్థిత్వ ఆనవాళ్లను చెరిపేస్తున్నాడంటూ బీఆర్ఎస్ శ్రేణులు గోల స్టార్ట్ చేశాయి… అవి గత వైభవ సామ్రాజ్యాల ఆనవాళ్లనీ కీర్తించాయి…
అయ్యా, బాబులూ… చార్మినార్, కాకతీయ కళాతోరణాలు మత చిహ్నాలు కావు, వాటి ఎంపికకూ ఈ గంగా జమునా తెహజీబ్ భావనకూ లింకేమీ లేదు అనే కౌంటర్లు రావడంతో ఇప్పుడిక గత చరిత్ర ఆనవాళ్లను చెరిపేస్తున్నాడంటూ తమ పాట పల్లవి మార్చాయి… గత సామ్రాజ్య వైభవాల్ని కీర్తించే అందెశ్రీ గీతంలోని వాక్యాల్ని కూడా మారుస్తారా అనీ ప్రశ్నలు వేశాయి…
సరే, కీరవాణి కంపోజింగ్ బాపతు రచ్చలోకి మళ్లీ అడుగుపెట్టడం లేదు గానీ… తెలంగాణ తల్లి ఓ మహారాణి, విలాసజీవనపు ప్రతీకగా ఉండొద్దనీ, అట్టహాసాలు, ఆడంబరాలకు బదులు సగటు తెలంగాణ పోరాట మహిళ రూపు తెలుగు తల్లి విగ్రహం కావాలనేది రేవంత్ ప్రభుత్వ భావన… అలాగే ఫైనల్ అవుతుంది కూడా…
Ads
ఇక అధికారిక చిహ్నం కూడా అలాగే పాత సామ్రాజ్యాలు, రాచరికపు ఆనవాళ్లు లేకుండానే ఉండబోతోంది… పలు సైట్లు తమ డిజిటల్ ఎడిషన్లలో ఏవేవో బొమ్మలు వేసి ఏమేమో రాసేస్తున్నాయి… ఆ లోగోలో బుద్దుడు ఉంటాడు, పూర్ణ కుంభం, తంగేడు ఆకులు… దిగువన చార్మినార్, పైన అశోకచక్రం గట్రా ఉంటాయనేది విశ్లేషిస్తున్నాయి… కానీ అవన్నీ రకరకాల ప్రతిపాదనలు…
ఈరోజు రేవంత్ చిత్రకారుడు రుద్రరాజేశంతోపాటు కోదండరాం, జేఏసీ రఘు, మంత్రి జూపల్లి, అద్దంకి దయాకర్, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్న ఓ సమావేశంలో లోగో ఎలా ఉండాలో డిస్కస్ చేశారు, తుది రూపు రావడానికి టైమ్ పడుతుంది… ఈలోపు బీఆర్ఎస్ రచ్చ కొనసాగుతూనే ఉంటుంది…
నా అంచనా నిజమైతే… తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన విషయంలో రేవంత్ ఆలోచనలు, తెలంగాణ పోరాటానికే తమ చిహ్నం ప్రయారిటీ ఇస్తుందనీ, రాచరికపు ఆనవాళ్లు ఉండవోవనీ రేవంత్ చెప్పిన మాటలను బట్టి చూస్తే… రాబోయే అధికారిక చిహ్నంలో పైభాగంలో ఖచ్చితంగా అశోకుడి నాలుగు సింహాలు, ధర్మచక్రాల కేంద్ర ప్రభుత్వం ఎంబ్లమ్ ఉంటుంది… తప్పకుండా గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం ఉంటుంది…
మలి దశ ఉద్యమం నేనే నడిపాను అని గొప్పలు చెప్పుకుంటాడు కదా కేసీయార్… మరి దానికి పునాది, మలిదశ ఉద్యమానికి చోదకశక్తి నాటి 1969 నాటి ఉద్యమమే కదా… సో, గన్ పార్కు స్థూపమే మన ఎంబ్లమ్ కాబోతోంది…
డౌటేముంది..? చార్మినార్ ఉండదు, కాకతీయ కళాతోరణం ఉండదు… అమరవీరుల స్మారకం అంటే కేసీయార్ కట్టించిన అద్దాల కట్టడం కాదు, 1969 పోరాట చిహ్నం, గన్‌పార్క్ అమరవీరుల స్థూపం బొమ్మ ఉంటుంది… అలాగే వ్యవసాయానికి పట్టం కట్టేలా ఉంటుంది… ఏవేవో బొమ్మలు ఇరికించేసి గజిబిజి చేయకుండా సూటిగా, సరళంగా ఉండేలా చూస్తారు…
ఎవరో వెటకారంగా అడిగారు కదా… అందెశ్రీ గీతం నుంచి నవాబులు, కాకతీయ రాజుల ప్రస్తావన ఉండే రామప్ప, చార్మినార్ పదాల్ని తొలగిస్తారా అని… నిజంగానే వాటిని తొలగించాలని రేవంత్ ఆదేశించాడు… “కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్..’’ ఉండబోవన్నమాట… అంతే, రాచరికపు ఆనవాళ్లు ఉండొద్దంటే ఉండొద్దు… అంతే…
ఐనా తినబోతూ రుచులెందుకు..? రేపోమాపో కొత్త ఎంబ్లమ్, కొత్త పాట వచ్చేస్తాయి కదా… ఇంకేమైనా కొత్త పడికట్టు పదాలు ప్రిపేర్ చేసుకోవాలి బీఆర్ఎస్ శ్రేణులు..!! చివరగా… తెలంగాణ చరిత్ర అంటే నవాబులు, రాజులు కాదు… సగటు శ్రమజీవి, పోరాటం, అమరులు…
Share this Article