బేశరం పఠాన్ సినిమా… అంటే సిగ్గూశరం లేని సినిమాను తీసిన షారూక్‌ఖాన్‌ను వెనకేసుకుని రావడానికి కొందరికి ఇప్పుడు అస్సోం సీఎం దొరికాడు… ఒక్క బీజేపీవాడు దొరికితే చాలు, ఇక ఎవరిని సమర్థిస్తున్నామనే సోయి కూడా ఉండదు వాళ్లకు… ఎంతసేపూ బీజేపీ కోణంలోనే చూడాలా ప్రతి విషయాన్ని..?
పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా ఒక్క అస్సోంలోనే కాదు, దేశంలో పలుచోట్ల నిరసనలు జరుగుతున్నయ్… పోస్టర్లు చింపేస్తున్నారు… థియేటర్లను బెదిరిస్తున్నారు… సోషల్ మీడియాలో బ్యాన్ పఠాన్ హ్యాష్ ట్యాగ్ హోరు కనిపిస్తోంది… ఇదంతా కరెక్టా కాదా అనే చర్చలోకి వెళ్లడం లేదు ఇక్కడ… పర్టిక్యులర్‌గా హిమంత విశ్వ శర్మ ధోరణిపైనే ప్రస్తావన…
ఎవరో అడిగారు… పఠాన్ వివాదం మీద… ఎవరు షారూక్ ఖాన్ అనడిగాడు సీఎం… (ఆయనెవరు అని ఒక సీఎంతో అడిగించుకోవడమంత అవమానం మరొకటి ఉండదు షారూక్ వంటి బాలీవుడ్ అగ్ర సెలబ్రిటీకి… అది వేరే కథ… మేం తోపులం, మేం దైవాంశసంభూతులం అనే పొగరును బద్ధలు కొట్టేవి ఇలాంటివే…) ఆ ప్రశ్నలలో తప్పేముంది..? ‘‘నేను చాలా ఏళ్లుగా సినిమాలు చూడటం లేదు, ఆసక్తి లేదు… అప్పట్లో అమితాబ్, ధర్మేంద్ర, జితేంద్ర సినిమాలు చూశాను, గుర్తున్నారు… ఈయన ఎవరో తెలియదు’’ అని చెప్పుకొచ్చాడు…
Ads
నిజమే, తెలియాలని ఏముంది..? పఠాన్ అనగానే గొప్ప సినిమా, గొప్ప నటుడు అని మెచ్చేసుకుని చప్పట్లు కొట్టాలా..? అవసరమా..? పైగా బట్టల్లేకుండా దీపిక ఓ వ్యాంప్‌కన్నా హీనంగా నర్తించినందుకా..? వాళ్లు ఆ దరిద్రపు పోకడలు పోవాలి, ఈ సిస్టం వాటికి రక్షణ కల్పించాలి… వారెవ్వా… అలాంటి వేషాలు వేయడమేల..? అందరి కాళ్లూ పట్టుకుని బతిమిలాడనేల..?
‘నాకు కోట్ల మంది వోట్లేశారు… అందరితోనూ నాకు పరిచయం ఉందా..? గుర్తుపట్టగలనా..? షారూక్ కూడా అంతే…’ సీఎం చేసిన ఈ వ్యాఖ్య షారూక్ చుట్టూ ఆవరించి ఉన్న ఓ సూపర్ ఇగోయిస్టిక్ భ్రమాత్మక పొరల్ని బద్ధలు కొట్టేసింది… కానీ అవసరం తనది… సినిమావాళ్లు అవసరానికి ఎక్కడికి దిగజారుతారో తెలిసిందే కదా… సీఎంకు ఓ మెసేజ్ పెట్టాడు… ‘నేను షారూక్, మీతో మాట్లాడాలి’ అని… అక్కడా అహమే… ఒక సీఎంకు ‘సర్, నా పేరు షారూక్, ఒక్క నిమిషం మీతో మాట్లాడవచ్చా’ అని పెట్టి ఉంటే బాగుండేది… తను సీఎం కాబట్టి…
సో, ఆ అహాన్ని కూడా బ్రేక్ చేయాలనుకున్నాడు హిమంత… లైట్ తీసుకున్నాడు… కానీ విషయం మాత్రం స్పందించాల్సిందే… సో, మెల్లిగా ఓ తెల్లవారుజామునో మెసేజ్ పెట్టాడు… ‘ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ’ అని… అప్పటిదాకా రాచకార్యాల్లో పడి పట్టించుకోనట్టు బిల్డప్… కావాలనే… వెంటనే షారూక్ ఫోన్, పఠాన్ సినిమాకు అడ్డంకుల గురించి చెప్పాడు… అక్కడ సీఎంగా స్పందించాడు… ‘మీరు మరిచిపొండి, అస్సోంలో అలాంటి గొడవలేమీ జరగవు జరగనివ్వను’ అంతే… ఫోన్ పెట్టేశాడు…
‘‘ఒక సీఎంగా రాష్ట్రానికి చెడ్డపేరు రానివ్వను… అది నా విధి… షారూక్ ఫోన్ చేశాడు… ఇష్టమున్నవాళ్లు చూస్తారు, లేకపోతే సినిమా జోలికి వెళ్లరు, అంతేతప్ప ఈ ఆందోళనలు, అనుచిత చర్యలు వేస్ట్…’’ అని సింపుల్‌గా తేల్చిపడేశాడు… అంతేకదా… సరైన స్పందన… పొద్దున్నే షారూక్ తెలియదు అన్నాడు, సాయంత్రానికి షారూక్ ఫోన్ చేశాడంటూ చెబుతున్నాడు…
ఏమిటీ సీఎం చంచలత్వం అని విమర్శలు చేయడానికి ఏముంది ఇందులో… ఆ సినిమాలోని సిగ్గు లేని పాట గురించి గానీ, షారూక్ సినిమాల గురించి గానీ తనేమీ వ్యాఖ్యలు చేయలేదు… పైగా అనుచిత నిరసనల్ని అనుమతించబోను అన్నాడు… (చాలామంది మరిచిపోయింది ఏమిటంటే… ఈ హిమంతుడు హార్డ్ కోర్ బీజేపీ ఏమీ కాదు… ఏళ్లకేళ్లు కాంగ్రెస్‌లో మునిగీతేలిన కేరక్టరే…)
Share this Article