ముందుగా ఒక వార్త…ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన ట్విట్టర్ ఖాతాలో ఇండియా మ్యాప్‌ను తప్పుగా చూపించే ఓ కొత్త సంవత్సరపు గ్రాఫిక్ పోస్ట్ చేసింది… పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా ఆక్రమించుకున్న కశ్మీర్ భాగాలు లేని మ్యాప్ అది… ఇది గమనించిన వెంటనే కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సీరియసయ్యాడు… ‘‘డియర్ వాట్సప్, వెంటనే ఆ తప్పును సరిదిద్దండి, లేకపోతే బాగుండదు… ఈ దేశంలో వ్యాపారం చేయాలని అనుకునే ఏ సంస్థయినా భారతదేశ చట్టాల్ని గౌరవించాలి… సరైన మ్యాపుల్నే వాడాలి’’ అని ట్వీటాడు… ఈ ప్లాట్ ఫామ్ ఓనర్ మెటాను ట్యాగ్ చేశాడు…
గతంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలకు ప్రధానంగా వర్తించే ఐటీ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు కూడా ఈ ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్ వాటిని అమలు చేయడానికి మొరాయించాయి… భారతీయ చట్టాలకు తాము అతీతులమనీ, తాము ఏర్పాటు చేసుకున్న రూల్స్‌కు మాత్రమే మేం బద్ధులమనీ వాదించాయి… చివరకు ఇండియాలో వాటి ఒకరిద్దరు బాధ్యులపై కేసులు నమోదు చేస్తే గానీ తొవ్వకు రాలేదు… సేమ్, ఇండియా మ్యాపుల్ని గనుక తప్పుగా ప్రచురిస్తే, ప్రదర్శిస్తే దాన్ని నేరంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం… ఈ స్థితిలో ఐటీ మంత్రి సీరియస్ హెచ్చరికను ట్విట్టర్ ఏమేరకు సీరియస్‌గా తీసుకుంటుందో చూడాలనే ఆసక్తి క్రియేటైంది…
కానీ ట్విట్టర్ ఈసారి నిజంగానే సీరియస్‌గా తీసుకుంది… ‘‘అనుకోకుండా తప్పు దొర్లింది… వెంటనే మమ్మల్ని అలర్ట్ చేసినందుకు మంత్రి గారికి కృతజ్ఞతలు, ఆ గ్రాఫిక్ పోస్టును వెంటనే తీసేశాం… క్షమాపణ కూడా చెబుతున్నాం… ఇకపైనా ఇలాంటివి పరిగణనలోకి తీసుకుంటాం’’ అని ట్వీట్ చేసింది… తొవ్వకు వచ్చింది… అంతకుముందు, గత వారంలో వీడియో కాలింగ్ కంపెనీ జూమ్ సీఈవో కమ్ ఫౌండర్ ఎరిక్ యువాన్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాగే దారికి తీసుకొచ్చింది…
Ads
డిసెంబరు 28న తనకూ అదే ట్వీట్ నోటీస్… ఇక్కడ ఉండాలంటే మేం చెప్పినట్టు పాటించు అనేదే సారాంశం… యువాన్ వెంటనే తప్పు సరిదిద్దుకున్నాడు… అంతెందుకు 2021లో ట్విట్టర్ కూడా ఇలాగే తప్పుడు మ్యాపులు చూపించింది… అప్పుడు నెటిజనమే పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు… అక్కడా తప్పు సరిదిద్దబడింది… ఇక్కడ మ్యాపులు అనేది మాత్రమే ఇష్యూ కాదు… భారతీయ చట్టాల్ని గౌరవించకుండా తాము ఫ్రేమ్ చేసుకున్న రూల్స్‌కు మాత్రమే బద్దులమనే సోషల్ ప్లాట్‌ఫారాల పైత్యాన్ని సహించబోమనే సంకేతాల్ని ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం… గుడ్, ఆ టెంపర్‌మెంట్ అవసరమే…
Share this Article