అనసూయ… నటి, యాంకర్… మాట పడదు, పడితే ఊరుకోదు… కానీ మాట అనడానికి ఆల్వేస్ తయ్యార్… తనకు కంట్రవర్సీ కావాలి… ఏదో ఒకటి… లేకపోతే సోషల్ మీడియాలో గెలికి మరీ ఓ వివాదాన్ని క్రియేట్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంది… కంట్రవర్సీ లేకపోతే తనకు తోచదు… ఇది ఒక కోణం…
నాణేనికి మరో కోణం ఏమిటంటే… కొన్నిసార్లు సెలబ్రిటీలు బయటికి చెప్పలేనివీ బడబడా కక్కేస్తుంది… దాని పరిణామాలు ఏమైనా రానీ జానేదేవ్… తన అభిప్రాయాన్ని చెప్పస్తుంది… నిజానికి ఇండస్ట్రీలో అది మైనస్ పాయింట్, ఐతేనేం, అనసూయకు అదేమీ పట్టదు, ఒకరకంగా అది ఫెయిరే…
చాన్నాళ్లయింది కదా… ఆంటీ రచ్చ కూడా ఎప్పుడో అయిపోయింది… అవునులే, నేను ఆంటీని కానా ఏమిటీ, అలా పిలిస్తే తప్పేమిటీ అనుకుని కంప్రమైజ్ అయిపోయినట్టుంది… (ఎక్కడో ఏదో క్లారిటీ ఇచ్చినట్టు లీలగా యాదికుంది… మల్లు ఆంటీ తరహాలో వెకిలి పిలుపుగా ఉంటుందనీ, కానీ తన వయస్సు రీత్యా పిల్లలు ఆంటీ అని పిలిస్తే తనకు అంత కోపం రాకపోయేదనీ చెప్పుకుంది… రీజనబులే… కానీ అనసూయ సినిమాల్లో వేసే రంగమ్మత్త టైపు వేషాలు చూస్తే తన వయస్సు వాళ్లు కూడా ఆ ఆంటీ అన్నట్టుగా పిలవడం ఈ ట్రోలింగ్ యుగంలో సహజమే కదా…)
Ads
ఆమె అర్జున్‌రెడ్డి సినిమా మీద కామెంట్స్ చేసింది… నిజానికి ఆమె అభిప్రాయమే ఇండస్ట్రీలో చాలామంది అభిప్రాయం… కానీ సైలెంటుగా ఉండటమే బెటరనుకుని నోళ్లు మూసుకుంటారు… కానీ అనసూయ ఊరుకోలేదు… ఫలితంగా ఆమె మీద ట్రోలింగ్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గట్రా విరుచుకుపడ్డారు… సరే, చాలామంది సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం చేసింది, ఇక వదిలేసింది…
ఇప్పుడు మళ్లీ ఓ చిన్న కంట్రవర్సీ… వాస్తవానికి కంట్రవర్సీ కాదు, ఆమె అభిప్రాయం అది… దాన్ని వివాదంగా చిత్రీకరిస్తున్నారు కొందరు… ఓ మంచి చర్చ మీదే ఆమె అభిప్రాయం అది…
అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ తరువాత వంగా సందీప్‌రెడ్డి మీద చాలా విమర్శలు… తన అల్ఫా మేల్ కేరక్టర్ చిత్రీకరణ తీరు మీద దేశవ్యాప్తంగా చిరాకు వ్యక్తమైంది… అఫ్‌కోర్స్, సినిమా పాసైంది, వోకే… కానీ అదే అర్జున్‌రెడ్డిని మరింత బీభత్సంగా చూపిన చిత్రం యానిమల్… తను ఏదో ఇంటర్వ్యూలో హీరో ప్రవర్తనను సమర్థించుకున్నాడు,.. తను సృష్టించిన పాత్ర కదా, తప్పదు… ‘అసలు కొట్టుకోవడం, తిట్టుకోవడం వంటి ఎమోషన్స్ లేకపోతే ఆ రిలేషన్‌లో లైఫ్ ఏమున్నట్టు, అసలు దాన్ని ప్రేమ అని ఎలా అంటాం..?’ అన్నట్టు చెప్పుకొచ్చాడు ‘యానిమల్’ బిహేవియర్ సమర్థిస్తూ… సరే, అది తన ఒపీనియన్, తన సినిమాలే ఆ టైపు…
కానీ గౌతమ్ వాసుదేవన్ మీనన్ అనే దర్శకుడి అభిప్రాయం వేరు… ‘‘ఓ అమ్మాయి మీద ప్రేముంటే.. అసలు ప్రేమంటే. వాళ్లని బలవంతం పెట్టొద్దు.. చెడుగా మాట్లాడొద్దు.. ఓ రిలేషన్‌లో ఒడిదొడుకులుంటాయ్. కానీ కోపాన్ని మాత్రం వారి మీద ఇష్టమొచ్చినట్టుగా చూపించకూడదు.. ఎంతో డిగ్నిటీగా వ్యవహరించాలి.. ఆధిపత్యం చూపించకూడదు.. కోపంలో ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తాం.. తప్పులు చేస్తాం.. కానీ అలా చేయకూడదు..భాగస్వామిపై ఎప్పుడూ చేయి ఎత్తకూడదు.. ప్రేమగా చెప్పాలి.. మనం శూన్యం.. వాళ్లే సర్వస్వం.. అదే నిజం..’’ ఇదీ తన అభిప్రాయం…
అభిప్రాయాలు సంఘర్షించుకోవచ్చు, తప్పులేదు… సినిమాప్రేమమ్ అనే ఓ సోషల్ మీడియా గ్రూపులో ఎప్పుడో ఏడాది క్రితం ఎవరో ఈ చర్చ పెట్టారు, ఆ ఇద్దరి అభిప్రాయాల వీడియోలు జతచేసి… అనసూయ చాలా బిజీ కదా, లేటుగా చూసినట్టుంది, In a world of sandeep ranga I’m still a GVM girl అని రాసుకొచ్చింది… ఎస్, అది తన అభిప్రాయం… వంగా సందీప్ భావజాలం రాజ్యమేలే కాలంలో కూడా తను జీవీఎం వైపే అని చెప్పింది… తప్పులేదు… కానీ మీడియా అదీ ఓ వివాదమే అన్నట్టు రాసుకొస్తోంది…
ఎందుకంటే..? ఆమె అర్జున్‌రెడ్డి సినిమా దగ్గర్నుంచీ వంగా సందీప్ దర్శకత్వం, తీసుకునే లైన్ మీద వ్యతిరేకతతో ఉంది కాబట్టి, ఈ తాజా అభిప్రాయం కూడా వివాదమే అనేస్తున్నారు… ఆ డిబేట్‌లో బోలెడు మంది వ్యతిరేకంగా, పాజిటివ్‌గా అభిప్రాయాలు రాశారు, ఎవరికీ లేని ‘వివాదం ముద్ర’ అనసూయ మీదెందుకు..? ఇతర విషయాల్లో అనసూయ ధోరణి, ప్రత్యేకించి ఆమె వస్త్రధారణ, మరీ ప్రత్యేకించి రీసెంటు బికినీ షోలు ఆమె మీద కొంత నెగెటివిటీని పెంచాయి… కానీ ఈ వంగా వర్సెస్ జీవీఎం డిబేట్‌లో మాత్రం అనసూయను తప్పుపట్టేందుకు ఏమీలేదు…
Share this Article