Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ధర్మేంద్ర వందల కోట్ల ఆస్తులకు వాస్తవ హక్కుదారులు ఎవరు..?!

November 25, 2025 by M S R

.

ధర్మేంద్ర… హి మ్యాన్… 89 సంవత్సరాల వయస్సులో మరణించాడు… అందరమూ స్మరించుకున్నాం… వీడ్కోలు, నివాళి…!! కానీ ఒక చర్చ జరుగుతోంది… బహుభార్యత్వం నిషిద్దం కదా, హేమమాలిని ఎలా పెళ్లి చేసుకున్నాడు..? ఇప్పుడు తన ఆస్తికి నిజవారసులెవరు..? ఇంట్రస్టింగ్…

పుట్టింది పంజాబ్, అసలు పేరు ధర్మసింగ్ డియోల్… ఈ డియోల్ తన పిల్లలందరి పేర్లకూ ఉంటుంది… తన మొదటి భార్య ప్రకాష్ కౌర్… తరువాత హేమమాలినితో పెళ్లికి చట్టబద్ధత కోసం మతం మార్చుకున్నారనే ప్రచారం చాన్నాళ్లుగా ఉన్నదే…

Ads

తన పేరును దిలావర్‌ఖాన్ అనీ, హేమమాలిని పేరును ఆయేషాబీ అనీ 1979లో మార్చుకుని నిఖా చేసుకున్నారనేది ఆ వార్తల సారాంశం… తరువాత అయ్యంగార్ల పద్ధతిలోనూ వివాహతంతు నిర్వహించారనీ అంటారు… ఈ పెళ్లి చట్టబద్ధత మీద ఎప్పటికప్పుడు బోలెడు సందేహాలు వినవస్తూనే ఉంటాయి…

చివరకు ఆయన పార్లమెంటేరియన్ పెన్షన్ ఎవరికి వర్తిస్తుందనే చర్చ కూడా సాగింది… అది మొదటి భార్యకే వర్తిస్తుంది… (తను ఒక టరమ్ ఎంపీ, హేమమాలిని, సన్నీ డియోల్ కూడా ఎంపీలుగా చేశారు… బీజేపీ)… ఒకవేళ ధర్మేంద్ర గనుక వీలునామా రాసి ఉంటే… (తప్పకుండా రాసే ఉంటాడు…) దాని ప్రకారం తన ఆస్తుల పంపిణీ జరుగుతుంది… రియల్ ఎస్టేట్, ఇతర పెట్టుబడులతో ఆస్తుల విలువ పెరిగింది…

100 ఎకరాల లోనావాలా ఫామ్ హౌజు విలువే 100 కోట్లు అట… థీమ్ రెస్టారెంట్ల చెయిన్ ఎట్సెట్రా చాలా రాబడి మార్గాలుండేవి తనకు… మరి వీలునామా గనుక రాయని పక్షంలో ఆ ఆస్తులకు వారసులు ఎవరు..?

సిక్కు కుటుంబమే, హిందూ వారసత్వ చట్టమే వర్తిస్తుంది… ధర్మేంద్రకు క్లాస్-1 వారసులు ఎవరు అనేది ప్రశ్న… హేమమాలినితో పెళ్లికి చట్టబద్ధత ఉంటే… కోర్టు అంగీకరిస్తే… ఆయన ఇద్దరు భార్యలూ హక్కుదారులే అవుతారు.,. మొదటి భార్య పిల్లలు సన్నీ డియోల్ (కొడుకు), బాబీ డియోల్ (కొడుకు), అజేతా డియోల్ (కూతురు), విజేతా డియోల్ (కూతురు)తో పాటు హేమమాలిని పిల్లలు ఈషా డియోల్ (కూతురు), అహనా డియోల్ (కూతురు) కూడా సమాన హక్కుదారులు అవుతారు…

ఒకవేళ హేమమాలినితో పెళ్లికి చట్టబద్ధత గనుక లేకపోతే… మొదటి భార్య ప్లస్ ఆరుగురు పిల్లలు హక్కుదారులు… కొంతకాలంగా తరచూ అనారోగ్యం పాలవుతూ సఫర్ అవుతున్నాడు కాబట్టి, బహుశా వీలునామా రాసే ఉంటాడు కాబట్టి ఇక ఆ వందల కోట్ల ఆస్తులకు ఎవరు హక్కుదారులు అనే వివాదం తలెత్తకపోవచ్చు… పైగా పిల్లలందరూ మంచి సంపాదనపరులే కాబట్టి చిన్నాచితకా భాగాలపై పెద్దగా పంచాయితీలు కూడా ఏమీ రాకపోవచ్చు..!!



  • చట్టపరమైన వాస్తవం…: భారతదేశంలో, హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం, మొదటి వివాహం కొనసాగుతున్నప్పుడు, కేవలం రెండో వివాహం కోసమే మతం మారి వివాహం చేసుకుంటే, ఆ రెండో వివాహం చట్టబద్ధంగా చెల్లదు (Void) అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది (ముఖ్యంగా Sarala Mudgal vs. Union of India కేసు). ఇది చట్టంలోని లొసుగును ఉపయోగించుకునే ప్రయత్నంగా పరిగణించబడుతుంది…

    పర్యవసానం…: ఈ వివాహం హిందూ చట్టం ప్రకారం చెల్లదు కాబట్టి, హేమమాలినికి క్లాస్-I వారసురాలిగా ధర్మేంద్ర గారి ఆస్తిలో వాటా పొందే హక్కు చాలా బలహీనంగా ఉంటుంది లేదా అసలు ఉండకపోవచ్చు… ఇదీ ఎఐ ప్లాట్‌ఫారాలు చెబుతున్న విషయం…



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హిడ్మా..! తెలంగాణలో రోజుకూలీగా అనామకంగా బతికాడా..? దేనికి..?!
  • ధర్మేంద్ర వందల కోట్ల ఆస్తులకు వాస్తవ హక్కుదారులు ఎవరు..?!
  • దైవశక్తులు Vs మంత్రశక్తులు… అందరిదీ ఇదే బాట… ఇదే జానర్…!!
  • కుటుంబ బాధితుడిగా… బేలగా రెబల్ స్టార్… ఆ పాత్రే తనకు నప్పలేదు…
  • జస్టిస్ సూర్యకాంత్..! కొత్త సుప్రీంకోర్టు సీజేఐ కొన్ని కీలక తీర్పులు ఇవీ..!!
  • ఆ ట్రంప్ కొడుకే వచ్చాడు అతిథిగా… అంగరంగ వైభవం ఓ తెలుగు పెళ్లి…
  • ఊపిరి పీల్చుకోవడానికి మరో విజ్ఞప్తి… ముగ్గురు సీఎంలకు మరో అభ్యర్థన…
  • ‘పవర్’… ఎప్పుడు వాడాలో తెలియాలి… వదిలేయడమూ తెలియాలి…
  • పోటీ… పోటీ…! ఫుడ్, రవాణా, కిరాణం, ఇతర డెలివరీల్లో పోటాపోటీ..!!
  • బీఫ్..! ఇండియా నుంచి ఎగుమతులు – రాజకీయాలు – నిజాలు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions