పద్మశ్రీ వచ్చింది… ఓ తెలంగాణ జానపదానికి గుర్తింపు… గుడ్… కిన్నెర వాయిద్యానికి పట్టాభిషేకం… వెరీ గుడ్… కానీ నిజమేనా..? తన వాయిద్యానికి, తన గొంతుకు, తన పాటకు పవన్ కల్యాణ్ మాత్రమే అవకాశం ఇచ్చాడా..? తను మాత్రమే మొదట గుర్తించి హత్తుకున్నాడా..? ఎంకరేజ్ చేశాడా..? తెలంగాణ కల్చర్ మీద అమితమైన ప్రేమాభిమానాలు చూపించాడా..? కాదు… కాదు… మొగిలయ్య చెప్పేది వేరు… నిజాలు వేరు… నిష్ఠురంగా ఉన్నా నిజాలు వేరు… చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నా సరే… చెప్పుకుందాం…
ఈ వాయిద్యాన్ని గుర్తించి, నెత్తిన పెట్టుకుని, ఎంకరేజ్ చేసింది పవన్ కల్యాణ్ కాదు… కాదు… మొదట మొగిలయ్య కిన్నెర వాయిద్యాన్ని, తనను, తన గొంతును పెద్ద తెరకు పరిచయం చేసింది నిర్మాత, దర్శకుడు ప్రభాకర్ జైనీ… నవీన్ పాపులర్ నవల అంపశయ్య ఆధారంగా తీసిన సినిమాలో ఒక పాట… దిగువన లింక్ కూడా ఉంది గమనించండి… పద్మశ్రీ వచ్చాక పవన్ కల్యాన్ జపం కాదు, తనను ఆపత్కాలంలో ఆదుకున్న చేతులనూ గుర్తుచేసుకోవాలి కదా… అది కనిపించడం లేదు… ప్రభాకర్ జైనీ ఏమీ డబ్బు ఇవ్వలేదా..? కడుపు నింపలేదా..? పోనీ, తెలంగాణ ప్రభుత్వం ఏమీ ఆదుకోలేదా..? తెలంగాణ సాంస్కృతిక శాఖ ఏమీ సాయం చేయలేదా..?
Ads
మొగిలయ్యా… ఎప్పటికైనా అండగా నిలిచేది తెలంగాణ ప్రభుత్వం లేదా తెలంగాణ సోయి ఉన్న దర్శక నిర్మాతలు, తెలంగాణ సమాజమే… అది విస్మరించి, పాత సాయాల్ని మరిచిపోయి…. పవన్, పవన్ సాయం మీద భజన చేస్తే… ఫాఫం… అసలే అది తెలంగాణ ఏర్పడ్డాక పదకొండు రోజులు నిద్రాహారాలు మాని అవస్థ పడిన గొప్ప కేరక్టర్… తెలంగాణ కల్చర్ మీద వాళ్లకేం సోయి ఉంటుందో ఓసారి లోతుగా అర్థం చేసుకోవాలి… కనుమరుగవుతున్న తెలంగాణ జానపద వాయిద్యాలకు, గొంతులకు ఇప్పుడు డిమాండ్ వస్తున్నదంటే… సినిమా వాళ్లు చాన్సులు ఇస్తున్నారంటే… అది ప్రజెంట్ ట్రెండ్… తెలంగాణతనం అద్దాల్సిన అవసరం… అంతే తప్ప ప్రేమ కాదు…
https://www.youtube.com/watch?v=NqI9DOmRTLQ
పలు తెలంగాణ పాటల్ని టాలీవుడ్ పట్టించుకున్నదీ అంటే కారణం అది ట్రెండ్ కాబట్టి… అంతే తప్ప మొగిలయ్య మీద ప్రేమ కాదు, తెలంగాణతనం మీద, తెలంగాణ పాట మీద, ఆట మీద, కల్చర్ మీద ప్రేమ కూడా కాదు… కిన్నెర మీద ప్రేమ అసలే కాదు… జస్ట్, ఒక కమర్షియల్ పోకడ… బోలెడు తెలంగాణ జానపద గొంతుల్ని, పాటల్ని వెండితెర మీద ఇప్పుడు చూస్తున్నామూ అంటే అది ఈ ట్రెండ్ కోసమే, వాళ్ల కమర్షియల్ అవసరం కోసమే… నీకేమో తెలియదు, అర్థం కాదు, అమాయకంగా నమ్మేస్తావు… కనీసం నీకు సాయం చేసిన పాత మిత్రుల్నీ మరిచిపోతే ఎలా..? ఇప్పుడు తెలుగు సినిమా మెల్లిగా చిత్తూరు స్లాంగ్ వైపు, ఆ పాటల వైపు వెళ్తోంది… థాంక్స్ టు పుష్ప… నాలుగు రోజులు పోతే మళ్లీ తెలంగాణ సమాజమే నిన్ను పట్టించుకోవాల్సింది… ఏమంటావ్ మొగిలయ్యా…
Share this Article