మల్లెమాల మీద నాగబాబు వీరాభిమాని ఆర్పీ కూతలు… కౌంటర్‌గా ఇతర కమెడియన్ల ఎదురుకూతలు… పరస్పరం వాతలు… కొద్దిరోజులుగా ఇదే తంతు కదా… ఈటీవీ, మల్లెమాల, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ ప్రోగ్రామ్ ఎట్సెట్రా ఉమ్మడిగా ఇజ్జత్ తీసుకుంటున్నాయి… అసలే ఈటీవీలో సినిమా ప్రమోషన్ల కక్కుర్తి కారణంగా మిగతా రియాలిటీ షోల రేటింగ్స్ పాతాళంలోకి వెళ్లిపోయాయి… ఇక ఈ కామెడీ షోలు కూడా ఢమాల్ అంటే, అసలే మూడో ప్లేసులో కొట్టుకుంటున్న ఈటీవీ జెమిని కిందకు, అంటే నాలుగో ప్లేసుకు పోవడం ఖాయం…
ఈ మల్లెమాల బాపతు తిట్లపర్వంలో ఏడుకొండలు (ఆర్గనైజర్ కమ్ మేనేజర్ కమ్ ఎవరీథింగ్) అనే ఓ పాత కేరక్టర్ ఎంటరైపోయి… సుధీర్‌తోసహా ఈటీవీ నుంచి వెళ్లిపోయిన కమెడియన్లందరినీ కట్టకట్టి తిట్టేశాడు… ఒక్కొక్కడి జాతకాలు తీస్తా, మళ్లీ వెనక్కి రావల్సిందే అని మస్తు బిల్డప్ ఇచ్చాడు… అసలు ఈటీవీ, మల్లెమాల ఆయన్ని ఎప్పుడో తరిమేశాయి… ఇన్నాళ్లూ సైలెంటుగా ఉన్న గెటప్ సీను తెరమీదకొచ్చాడు… ఏడుకొండలు మీద వెటకారం పోస్టులు పెట్టాడు… అసలు తనకు పేరు తెచ్చిన బిల్డప్ బాబాయ్ పాత్రకు ఈ ఏడుకొండలే స్పూర్తి అన్నాడు…
అంతన్నాడు… ఇంతన్నాడు… మళ్లీ ఏమనుకున్నాడో అవి డిలిట్ కొట్టేశాడు… అప్పటికే కొన్నిసైట్లు స్క్రీన్ షాట్లతోసహా వార్తలు రాశాయి… తనేమో తిరిగి వెనక్కి వచ్చేసి జబర్దస్త్ టీంలో చేరిపోయాడు… మళ్లీ అదే బిల్డప్ బాబాయ్ కేరక్టర్‌తో ఏదో రీఎంట్రీ అన్నంత సీన్ క్రియేట్ చేశాడు… నిజానికి తను జబర్దస్త్ నుంచి మానేసి చాన్నాళ్లయింది… శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయడు… మళ్లీ ఏమైందో ఏమో మల్లెమాల గూట్లోకి చేరిపోయాడు… ఆ ప్రోమో కూడా ఈటీవీ రిలీజ్ చేసింది…
Ads
అసలు గెటప్ సీను, ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్, సన్నీ ఓ టీం… దోస్త్ మేరా దోస్త్… భూకంపాలు రానీ, అగ్నిపర్వతాలు పేలనీ, సునామీలు ముంచెత్తనీ మన స్నేహం అమరం, నిత్యం, సత్యం, శాశ్వతం అన్నట్టు మస్తు బిల్డప్పులు ఇచ్చారు… ఆ అంశం మీదే స్కిట్లు కూడా చేశారు… సీన్ కట్ చేస్తే సుధీర్ ఔట్… అంతకుముందే గెటప్ సీను ఔట్… కానీ ఆటో రాంప్రసాద్ అక్కడే వేలాడుతున్నాడు… ఇప్పుడు గెటప్ సీను మళ్లీ వచ్చేశాడు… అంటే సుధీర్ ఒక్కడిని బకరాను చేశారా..? లేదా మల్లెమాలతో ఓ స్ట్రాటజిక్ గేమ్ ఆడుతోందా ఈ టీమ్…?
ఈ జబర్దస్త్ ఎపిసోడ్‌లో అంతిమంగా బకరా అవుతున్నది ఎవరు..? చివరకు సుధీర్ కూడా రీఎంట్రీయేనా..?! మరి ఇతర టీవీల్లో హోస్ట్ చేస్తున్న షోల మాటేమిటి..?! అవీ చేసుకుంటాం, ఇవీ చేసుకుంటాం అని ఇలా ఒత్తిడి ప్లాన్లు వేసి, మల్లెమాలను ఒప్పించే స్టేజీకి తీసుకుపోతున్నారా..?! ఏం స్ట్రాటజీరా నాయనా…!! (అబ్బ, గెటప్ సీనుకు మల్లెమాలతో ఇబ్బందేమీ లేదు, సినిమాల్లో బిజీ అయిపోయి కొన్నాళ్లు రాలేదు, అంతే… ఇలా వివరణలు చెప్పుకుంటారేమో ఇక… మరి మీ అపూర్వ దోస్తీకి ఏ వైరస్ సోకింది బాబులూ…?)
మరో నవ్వొచ్చే అంశమూ చెప్పుకోవాలి… అనసూయ జబర్దస్త్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయిందని అందరికీ తెలుసు… ఆమెకు వీడ్కోలు అన్నట్టుగా ఓ స్కిట్ చేశారు… ఎవరైనా లేడీ కేరక్టర్‌తో అనసూయ వేషం వేయించొచ్చుగా… మరీ తాగుబోతు రమేష్‌తో ఆ వేషం వేయించారు… ఫాఫం, అనసూయ కష్టమ్మీద డోకు అపుకున్నట్టుంది… (మరీ తాగుబోతు రమేష్‌తో ఆమె వేషం వేయించి, వీడ్కోలు చెప్పడం అనసూయను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనా..? ఈమాత్రం దానికి ఒకవైపు కన్నీళ్లు కారుస్తూ ఇంద్రజ ఓవరాక్షన్… చలాకీ చంటి సూపర్ ఓవరాక్షన్… పనిలోపనిగా రాకెట్ రాఘవ డప్పు…
అందరూ ఇలా జీవించేస్తుంటే… అసలు అనసూయ మాత్రం మూతిని రకరకాలుగా తిప్పుతూ, ఇక చాల్లేరా అన్నట్టు కనిపించి, ఇంద్రజకు నిర్వికారంగా ఓ హగ్గిచ్చేసి ‘దర్జా’గా నిష్క్రమించింది… ఫాఫం, ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే ప్రోమోను కుమ్మేద్దామనుకున్న మల్లెమాల టీమ్ ఎడ్డిమొహం వేసింది… అనసూయ మూతి వంకర్లు చూస్తారా..? ఇదుగో… (అసలు ఆమె మొహంలో ఫీలింగ్స్‌కు అర్థమేమిటో సరిగ్గా చెప్పగలిగితే చాలు, తెలుగు యూనివర్శిటీ వాళ్లు ఈజీగా ఓ డాక్టరేట్ పడేస్తారు…)
Share this Article