Jagannadh Goud………… చేగువేరా మనకెందుకు..? అక్కడక్కడా కొందరు పోరగాళ్ళు బైక్ లకి చేగువేరా స్టిక్కర్కు, T- షర్ట్స్ కి చేగువేరా బొమ్మలు తెలిసి వేసుకుంటరో, తెలియక వేసుకుంటరో తెలియదు. భగత్ సింగ్, రాజ్ గురూ, సుభాష్ చంద్ర బోస్ స్టిక్కర్స్ వేసుకోండ్రా అయ్యా, ఆ గెవెరా బొమ్మలెందుకు..? మనకు అవసరమా అన్నది భారత యువత ఆలోచించాలి. అసలు తన పేరు కూడా అది కాదు, ఊడబొడిచింది కూడా ఏమీ లేదు. అసలు చేగువేరా ఎవరు.? ఏమి చేశాడు..?
చేగువేరా అసలు పేరు “గెవేరా” (ఎర్నెస్టో గెవేరా డి లా సెర్నా). దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా దేశంలో పుట్టిన గెవేరా “అర్జెంటీనా” రాజధాని “బ్యూనస్ ఎయిర్స్” లో వైద్య విద్యలో ఉత్తీర్ణుడయ్యాడు. బ్యూనస్ ఎయిర్స్ లో చాలామంది పలకరించేటప్పుడు “చే” అంటారు ఎవర్ని అయినా; దాని అర్ధం Hello Buddy or Hey. అర్జెంటీనా భాషలో గెవేరా కూడా అంతే “చే” అని పలకరించేవాడు. వైద్య విద్య అయ్యాక “గౌటెమాల” దేశంలో సామ్యవాద అనుకూల ప్రభుత్వంలో పనిచేశాడు. అమెరికా సాయంతో జరిగిన కుట్రలో ప్రభుత్వం కూలిపోవటంతో గెవేరా ఆ దేశం నుంచి పారిపోయాడు.
“ఫిడెల్ కాస్ట్రో” అనే విప్లవ యోధుడు క్యూబా దేశంలో అప్పటి నియంత “బాటిస్టా”కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే గెవేరా దానిలో చేరాడు. అర్జెంటీనా భాషలో చే అని క్యూబాలో పలకరించటం వలన వాళ్ళు గెవేరాని వీడు ఎవడ్రా బాబూ మాటమాటకి “చే” అంటున్నాడు అని గెవేరాని “చే” గెవేరా” అని పిలిచేవారు.
Ads
“ఫిడెల్ కాస్ట్రో” నాయకత్వంలో పోరాటం విజయవంతం అయ్యి క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో అధికారం చేపట్టినప్పుడు పరిశ్రమ శాఖ మంత్రిగా చే గెవేరాని నియమిస్తాడు ఫిడెల్ కాస్ట్రో. కొన్ని సంవత్సరాల తర్వాత క్యూబా జాతీయ బ్యాంక్ ప్రెసిడెంట్ గా చే గెవేరాని నియమిస్తాడు ఫిడెల్ కాస్ట్రో. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి క్యూబా ప్రతినిధిగా చే గెవేరాని నియమిస్తాడు ఫిడెల్ కాస్ట్రో.
ఫీడెల్ కాస్ట్రోని కాదని చే గెవేరా ఆఫ్రికా దేశం అయిన కాంగోలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి కొద్దికాలంలోనే ఓడిపోయి దక్షిణ అమెరికా పారిపోతాడు. దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రభుత్వానికి చిక్కి మరణిస్తాడు . ఫిడెల్ కాస్ట్రో నిర్మించిన 83 మంది దళంలోని ఒక సభ్యుడు చే గెవేరా, అంతే…
గెవేరా ఎక్కడ ఉద్యమం చేశాడు..? ఎక్కడ నాయకత్వం వహించి విజయం సాధించాడు..? విప్లవానికి ఎక్కడ ఊపిరి పోశాడు…? ఎక్కడ అసమానతలను చీల్సి చెండాడాడు..? గెవేరా ఏమి చేశాడో ప్రపంచంలో ఆయన గురించి ఉన్న అన్ని పుస్తకాలని జల్లెడ పట్టినా నాకు అయితే అర్దం కాలేదు.
క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోని చంపటానికి అమెరికా ఎన్నిసార్లు (638) ప్రయత్నించిందో ప్రపంచంలో చాలా మందికి తెలుసు. ఫిడెల్ కాస్ట్రో గొప్పతనాన్ని తగ్గించటానికి అమెరికన్ రచయిత “జాన్ లీ యాండర్సన్” చే గెవేరా గొప్ప విప్లవకారుడు అని Che Guevara: A Revolutionary Life అనే చే గెవేరా బయోగ్రఫీ రాశాడు.
వేసుకోవాలంటే T- షర్ట్ లపై అబ్దుల్ కలాం, సతీష్ ధావన్, శ్రీనివాస రామానుజన్, సర్దార్ పాపన్న, అల్లూరి, రతన్ టాటా బొమ్మలు వేసుకోండి. లేదా, శివాజీ, రాణా ప్రతాప్ బొమ్మలు వేసుకోండి. ప్రపంచం అంతా అజ్ఞానంలో ఉన్నప్పుడు విజ్ఞానాన్ని అందించిన దేశం మనది. గివెరా స్టిక్కర్స్, బొమ్మలు మనకెందుకురా అయ్యా ! శతకోటి లింగాలలో బోడిలింగం తను… మనకు తన బొమ్మలు అవసరమా..?
ఓ సాధారణ నక్సలైట్ కంటే తక్కువ తను… మనకి అవసరమా అన్నది యువతే తేల్చుకోవాలి. అమెరికా సైన్యం అంతా తలక్రిందకి, కాళ్ళు పైకి లేపి ప్రయత్నించినా తమకి గిట్టని క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోని ఏమీ చేయలేక..ఫీడెల్ కాస్ట్రో గొప్పతనాన్ని తగ్గించటానికి ఎందుకూ పనికిరాని ఒక కేరక్టర్‌ను పైకి లేపారు తప్పితే అక్కడ ఏమీ లేదు….
Share this Article