.
పాకిస్థానీ నటి ఇమాన్… ప్రభాస్ నటించే ఫౌజీలో ఆమెను కూడా తీసుకున్నారు, ఆమె పేరు ఇమాన్వీ అని వీకీపీడియా చెబుతున్నా, ఆమె సోషల్ అకౌంట్లు మాత్రం ఆమె పేరు ఇమాన్ ఇస్మాయిల్ అనే చెబుతున్నాయి…
పహల్‌గాం ఉగ్ర పైశాచిక చర్య అనంతరం దేశవ్యాప్తంగా భావోద్వేగాల తీవ్రత పెరిగింది… ఇంతకుముందు బంగ్లాదేశ్, పాకిస్థాన్ నటీనటులకు పెద్దగా అభ్యంతరాలు ఉండేవి కావు… ముంబై, కోల్‌కత్తాల్లో అందరిలాగే వాళ్లూ కెరీర్ వెతుక్కునేవాళ్లు…
Ads
కానీ ఇప్పుడు వేరు… ఆమె బదులు వేరే నటిని తీసుకోవాలని, ఆ పాకిస్థానీ నటిని తీసివేయాలని డిమాండ్లు హోరెత్తుతున్నాయి… నిజానికి ఈమె కరాచీలోనే పుట్టినా అమెరికాలో ఉంటోంది… మైత్రీ మూవీ మేకర్స్ ఆమెను ఫౌజీ సినిమా కోసం పట్టుకొచ్చారు…
దేశవ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకతతో ఏం చేయాలో అర్థం గాక తలపట్టుకున్నారు నిర్మాతలు… అమ్మడు కూడా చాలా తెలివిగా నెటిజనం కళ్లకు గంతలు కట్టే పనిలో పడిపోయింది అర్జెంటుగా…
‘అబ్బే, నాది భారతీయ రక్తం, నేను పాకిస్థానీ కాదు, పాక్ మిలిటరీలో మావాళ్లెవరూ లేరు’ అని పలుకుతోంది… సదరు నిర్మాతలు యథాతథంగా ఆ స్టేట్‌మెంట్ మొత్తం మీడియాలో బాగానే రాయించినట్టున్నారు… ఎవరూ నిజాల జోలికి పోలేదు, జస్ట్, ఆ ప్రకటన రాసి, చేతులు దులుపుకున్నారు…
మిత్రుడు Sumanth Patel ఫేస్ బుక్ వాల్ మీద కొన్ని వివరాలు, ఫోటో ఇంట్రస్టింగ్…
ఆ ఫోటో ఏమంటున్నదంటే… ఆమె తల్లి ఇండియన్, తండ్రి పాకిస్థానీ అట… రెండు సంస్కృతుల కలయిక నేను అని చెప్పుకుంది ఆమె… ఇప్పుడు అర్జెంటుగా ఆమె పాకిస్తాన్ యాక్టర్స్ ని unfollow కొట్టింది… Instagram Bio లో పాకిస్తాన్ జెండా తీసేసింది…
తన జాతీయతను దాచుకోవడానికి ఆమె పడుతున్న తాపత్రయం వెనుక సదరు నిర్మాతల ప్లానింగ్ ఉండవచ్చు… కానీ ఆమెకు సంబంధించిన వివరాలు వికీ ఇప్పటికీ చెబుతూనే ఉంది కదా… నిన్న మనం చెప్పుకున్నాం ఆ వివరాలు… ఇలా…
వికీయే కదా, మార్చేస్తారని భావించాను… ఎవరూ ఎడిటలేదు ఇంకా… అందుకే ఈ స్క్రీన్ షాట్… నిజానికి ఆమె పాకిస్థానీ అనే కదా ఇన్నాళ్లూ అందరమూ వార్తల్లో రాసుకుంటున్నది… మరిప్పుడు తాజా పరిస్థితుల దృష్ట్యా ఆమె తన జాతీయతను దాచుకునే పనిలో పడింది… అబద్దాల్ని చెబుతోంది…
గతంలో ఆమె పాకిస్థానీ అని వచ్చిన ఏ వార్తనూ ఆమె ఖండించలేదు, నేను ఫలానా అని చెప్పలేదు… ఇప్పుడిక అర్జెంటుగా పహల్గాం పైశాచికాన్ని ఖండించింది… నాది ఇండియన్- అమెరికన్ కుటుంబం అంటోంది… భారతీయ రక్తం అంటోంది…
నిజానికి కళకు ఈ జాతి భేదాలు, ఈ దేశ భేదాలు ఉండకూడదు… కానీ పహల్‌గాం మత ఉగ్రవాద దాడి, పాకిస్థాన్ పైశాచికాల కథలు వేరు… అందుకే ఈ వ్యతిరేకత… ఆల్రెడీ పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబిర్ గులాల్ అనే సినిమా రిలీజ్ చేస్తే జాగ్రత్త అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన ప్రకటించింది…
ఐఅండ్‌బీ మినిస్ట్రీ కూడా ఆలోచనలో పడింది… మరి ఫౌజీ కూడా పాన్ ఇండియా సినిమాయే కదా… ఫవాద్ ఖానే వద్దంటున్న ఆ రాష్ట్రం, ఐఅండ్‌బీ ఇమాన్‌ను ఆమోదిస్తుందా..? అబ్బే, నాది భారతీయ రక్తమే అనే ప్రకటనలతో అంతా వోకే అయిపోతుందా..?
Share this Article