Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు ఎవరు ఈ నిమ్రత్ కౌర్..? అంతటి ఐశ్వర్యాన్ని మించి ఏం ఆకర్షణ..!!

October 22, 2024 by M S R

నిజానిజాలపై ఆ ఇద్దరిలో ఎవరూ నోరు మెదపరు… తను ఎందుకు అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని వదిలేసి వచ్చిందో ఐశ్వర్యా రాయ్ చెప్పదు… ఎందుకు తమ నడుమ దూరం పెరిగిందో అభిషేక్ బచ్చన్ కూడా చెప్పడు…

ఈలోపు వార్తలు మాత్రం వారిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు… ఇక పొసిగే పరిస్థితే లేదు అని రాసేస్తున్నారు… నో, నో, మళ్లీ ఒక్కటయ్యారు, ఆ విభేదాలు వదిలేశారు అని కొన్ని వార్తలు… ఇండస్ట్రీ అంటే గాసిప్స్, రూమర్స్ సహజం… బ్రేకప్పులు, వివాహేతర సంబంధాలు, డైవోర్స్ కూడా అసాధారణం ఏమీ కాదు…

మరి విభేదాలు దేనికి..? అవేమిటో కూడా మీడియాయే చెప్పేస్తుంది కదా… ‘అభిషేక్ బచ్చన్ ఐశ్యర్యారాయ్‌ను మోసం చేశాడు… దస్వి సినిమాలో తనతోపాటు నటించిన నటి నిమ్రత్ కౌర్‌తో సంబంధాలు పెట్టుకున్నాడు… అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా అభిషేక్‌కే సపోర్టుగా నిలబడింది… ఐశ్వర్యారాయ్‌కు అత్త జయా బాధురికీ నడుమ కొట్లాటలు అప్పటికే పెరిగిపోయి ఉన్నాయి’ అని మీడియా చెబుతున్న కారణాలు…

Ads

నిమ్రత్ కౌర్ పట్ల అభిషేక్ ఆకర్షితుడయ్యాడే అనుకుందాం… ఆమె కోసం ఐశ్వర్యతో బంధాన్ని పూర్తిగా తెగతెంపులు చేసుకునే స్థాయికి నిమ్రత్‌తో బంధం గాఢంగా పెనవేసుకుపోయిందా అనేది సందేహమే… ఈ మొత్తం వ్యవహారంపై బచ్చన్ కుటుంబంలో ఎవరూ ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడకుండా భలే సంయమనం పాటిస్తున్నారు…

ఇంతకీ ఎవరు ఈ నిమ్రత్ కౌర్..? అంతగా ఆమె అభిషేక్‌ను ఎలా ఆకర్షించగలిగింది..? అందమా..,? అభిషేక్ చుట్టూ బోలెడు మంది అందగత్తెలు ఇండస్ట్రీలో… పైగా ప్రపంచ సుందరి ఐశ్వర్యను మించిన అందమా..? మరేమిటి..? ఇలాంటి చర్చ కూడా మీడియాలో సాగుతోంది…

ఆమె రాజస్థాన్‌లోని పిలానీలో సిక్కు కుటుంబంలో 1982లో పుట్టింది… మొదట ప్రింట్ మీడియా మోడల్… తరువాత థియేటర్ ఆర్టిస్టు… తండ్రి మేజర్ భూపేందర్ సింగ్ ఆర్మీ మనిషి… కశ్మీర్‌లో జొరబడిన ఉగ్రవాదుల తూటాలకు ప్రాణాలొదిలిన అమరుడు… ఆయన మరణం తరువాత ఆ కుటుంబం నొయిడాలో ఉంటోంది… చదువయ్యాక ఆమె మాత్రం ముంబై చేరింది అవకాశాల కోసం…

nimrath

మోడల్ నుంచి మ్యూజిక్ వీడియోలు, టీవీ యాడ్స్ వైపు మళ్లింది… డెయిరీ మిల్క్ కమర్షియల్ యాడ్‌తో పాపులర్… మెల్లిగా సినిమాల్లో అవకాశాలూ రాసాగాయి… వరుసగా రెండు సినిమాలు కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి ఆమె నటనకూ మంచి మార్కులు పడ్డాయి… తరువాత ఏవో రెండుమూడు అమెరికన్ టీవీ సీరిస్‌లలో చేసింది… సమాంతరంగా హిందీ వెబ్ సీరీస్… 2022లో నెట్‌ఫ్లిక్స్ వాళ్ల దస్వి సినిమాలో ప్రధాన పాత్ర… స్టార్ హీరోయిన్ కాదు, మరీ పాపులర్ నటి కూడా కాదు…

nimrat kaur

2005 నుంచి ఆమె నటించినవి ఏడెనిమిది సినిమాలు మాత్రమే… ఎక్కువగా టీవీ సీరీస్, వెబ్ సీరీస్… దస్విలో అభిషేక్ బచ్చన్‌తో పరిచయం… ఆమెకు ఇప్పటికే 42 ఏళ్లు… అభిషేక్ వయస్సు 48 ఏళ్లు… ఐశ్వర్య వయస్సు 50 ఏళ్లు… నిమ్రత్, అభిషేక్‌ల స్నేహం దాస్వి తరువాత క్రమేపీ బలపడింది… ఈ రిలేషన్‌షిప్ బచ్చన్ కుటుంబానికి కూడా తెలుసట… అంతకుముందు సల్మాన్, వివేక్ ఒబెరాయ్ వంటి సంబంధాలున్న ఐశ్వర్య 2007లో అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది… 2011లో కూతురు ఆరాధ్య పుట్టింది… ఇప్పుడు ఆ సంసారంలో నిమ్రత్ కౌర్ కలకలం సృష్టిస్తోంది…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions