.
రాహుల్ గాంధీ కావాలని నెట్టేశాడు, అందుకే 69 ఏళ్ల ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద కూలబడి గాయాలయ్యాయి, హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చిందని బీజేపీ ఆరోపణ… అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి, తరువాత ఆ సెక్షన్ తీసేసినట్టు ఓ వార్త…
నాగాలాండ్ తొలి మహిళా రాజ్యసభ సభ్యురాలు, వైస్ చైర్మన్ కోనియాక్ తన పట్ల రాహుల్ గాంధీ ప్రవర్తన సవ్యంగాి లేదు, సభ్యంగా లేదు అని ఆరోపించింది… మొత్తానికి ఈ వివాదాలు, కేసులు, విమర్శలతో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి మీద అభిశంసన, అంబేడ్కర్ మీద అమిత్ షా వ్యాఖ్యల దుమారం పక్కకు వెళ్లిపోయిందా..? దానికోసమే బీజేపీ ఇదంతా చేస్తోందా..? అది వేరే చర్చ… బీజేపీ ఎంపీలే తమను నెట్టేశారని రాహుల్, ఖర్గే ఆరోపణ…
Ads
కానీ ఒకసారి సదరు ప్రతాప్ చంద్ర సారంగి గురించి తెలుసుకోవాలి… ఇంట్రస్టింగు కేరక్టర్… ఉత్కళ బ్రాహ్మణుడు… ఒడిశా మోడీ అంటారు తనను… బాలాసోర్, నీలగిరి ఊళ్లో పుట్టాడు… చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మిక మార్గంపై అనురక్తి… రామకృష్ణ మిషన్ ద్వారా సన్యాసం స్వీకరించాలని అనుకున్నాడు… కానీ మఠం హెడ్ క్వార్టర్స్‌లో నీ వివరాలు చెప్పు అన్నారు…
తండ్రి మరణించాడు, తల్లి ఉంది అని చెప్పాడు… సన్యాసం వద్దు, తల్లిని చూసుకో ముందు అని పంపించేశారు… తరువాత ఆర్ఎస్ఎస్ సభ్యత్వం… మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ ఆ పిల్లల కోసం ఏకల్ స్కూళ్లు స్థాపించాడు… బాలాసోర్, మయూర్‌భంజ్ జిల్లాల్లోని గిరిజన గ్రామాలలో గణశిక్ష మందిర్ యోజన కింద సమర్ కార కేంద్రం అనే పేరుతో కూడా పేదల పాఠశాలలను ప్రారంభించాడు…
క్రైస్తవ ప్రచారకుడు గ్రాహం స్టెయిన్స్ సజీవ దహనం కేసు తెలుసు కదా… సంచలనం రేకెత్తించిన ఉదంతం అది… దారాసింగ్ అనేవాడు ఆ హంతకుల టీమ్ లీడర్… కానీ దహనం తరువాత జై భజరంగ్ దళ్ అని నినాదాలు చేశారట హంతకులు… ఆ సమయంలో ఈ ప్రతాప్ చంద్ర సారంగి భజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు… తననూ బుక్ చేశారు…
తరువాత మరోసారి ఏకంగా అసెంబ్లీ మీద దాడి కేసులో బుక్కయ్యాడు… తరువాత ప్రత్యక్ష రాజకీయాలు, ఎమ్మెల్యే, ఎంపీ,.. ఓసారి కేంద్ర మంత్రి… పెళ్లి చేసుకోలేదు… ఓ మట్టి ఇల్లు, సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు… సామాజిక సేవే తన పని… ఇంతకీ తన ఆస్తి ఎంతో తెలుసా… 2024 అఫిడవిట్ ప్రకారం…
చేతిలో నగదు 25 వేలు… ఐదు బ్యాంకు ఖాతాల్లో 1.34 లక్షలు… ప్లస్ SBI ₹7 లక్షల బాండ్లు, SBI మ్యూచువల్ ఫండ్‌లో ₹27 లక్షల పెట్టుబడి, ₹9 లక్షల SBI లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ… 1995 మోడల్ సైకిల్ విలువ 700 రూపాయలు, మట్టి ఇల్లు విలువు 3000, 4 లక్షల విలువైన వ్యవసాయ భూమి… అప్పుల్లేవు…
2019 అఫిడవిట్ ప్రకారం… తన ఆస్తి ఇందులో ఐదో వంతు కూడా లేదు… వచ్చింది వచ్చినట్టు పేదలకే ఏదో రూపంలో కర్చు పెట్టేస్తుంటాడు… ఇదీ సారంగి కథ…
Share this Article