.
నిజానికి చంద్రబాబునాయుడు పార్టీలో ఎవరినీ రెండో పవర్ సెంటర్‌గా ఎదగనివ్వడు… తన లెక్క తనది… అలా చూసుకున్నాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ తన చెప్పుచేతల్లో ఉంది ఇన్నాళ్లూ…
కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి… తన వయోభారం కావచ్చు, ఇంకేమైనా కారణాలు కావచ్చు… వారసుడు లోకేష్ పగ్గాలు పట్టుకున్నాడు… పార్టీ, ప్రభుత్వంలో తన మాటే చెల్లుబాటు ప్రస్తుతం… తను గతంలోని లోకేష్ కూడా కాదు…
Ads
అన్నీ నేర్చుకున్నాడు… పరిణతి కనిపిస్తోంది… ఐతే పార్టీలో లోకేష్ గాకుండా మరో పవర్ సెంటర్ ఉందా..? నిజంగా చంద్రబాబు అలా జరగనిస్తాడా అనే సందేహాలు వదిలేస్తే… ఇంతకీ ఎవరతను..? పేరు రాజేశ్ కిలారు… లోకేష్‌కు చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్…
అదుగో ఆయన ప్రభావం మీదే ది ప్రింట్ ఓ స్టోరీ రాసింది… ఆసక్తికరంగా ఉంది… ఇదీ లింకు…
తెలుగుదేశంలో ఏ పదవీ లేని ప్రభావశీలి: లోకేష్ మిత్రుడు రాజేశ్ కిలారు ఎవరు?
తెలుగుదేశం పార్టీ (టిడిపి)లో ఆయనకు ఎలాంటి కీలక పదవి లేదు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం లోనూ ఆయనకు ఎలాంటి అధికారిక బాధ్యత లేదు. అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు – రాజేశ్ కిలారు…
“పార్టీకి, తద్వారా ప్రభుత్వానికి ఆయన చేస్తున్న సేవలు చూస్తే, ఎలాంటి పదవీ సరిపోదు… అంటే, పదవులే దేనికి..? పైగా రాజేశ్ పదవుల కోసం పరుగులు తీసే వ్యక్తి కూడా కాదు,..” అని ఒక టిడిపి నేత వ్యాఖ్యానించాడు…
ఈయన ప్రాముఖ్యం మరింత పెరగబోతుందనేది టిడిపి వర్గాల్లో ఓ నమ్మకం – ముఖ్యంగా చంద్రబాబు నుండి లోకేష్ వైపు అధికార బాద్యతల బదిలీ జరుగుతున్న వేళ…
ఇప్పటికే పార్టీలోని అనేక కీలక విషయాలను లోకేష్‌కి అప్పగించినట్టుగా.., ఆయనకు సహకరిస్తూ పార్టీ నియంత్రణను బలోపేతం చేస్తున్న వ్యక్తిగా రాజేశ్ కిలారు పేరు చర్చల్లోకి వచ్చేస్తోంది…
యువగళం పాదయాత్రలో కీలక పాత్ర
2023లో నారా లోకేష్ నడిపిన 3,132 కిమీ యువగళం పాదయాత్ర విజయవంతం కావడానికి, ఆపై పార్టీ అధికారంలోకి పునఃప్రవేశం చేయడానికి రాజేశ్ కిలారు కీలక భూమిక పోషించారన్నది టిడిపి వర్గాల మాట… ఈ యాత్ర ద్వారా లోకేష్‌కి ప్రజల్లో మాస్ నేతగా ఓ కొత్త గుర్తింపు లభించింది… తను జనంలో యాక్సెప్టెన్సీ పెంచుకున్నాడు….
వైఎస్సార్‌సిపి సర్కారు CID విచారణలు
పాదయాత్ర సమయంలోనే, అప్పటి వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలోని ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఆయనను పలు కేసులపై విచారించింది… ముఖ్యంగా స్కిల్స్ ప్రాజెక్ట్ కుంభకోణం కేసులో – (ఇందులో చంద్రబాబు అరెస్టయి 53 రోజులు జైలులో ఉన్నారు)… అలాగే ఏపీ ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులలోనూ రాజేశ్ పేరును లాగారు…
వైఎస్సార్‌సిపి నేతలు ఆయనను “షాడో మంత్రి”గా అభివర్ణించగా, టిడిపి మాత్రం ఇది అంతా రాజకీయ పగ అని వాదించింది…
నారా లోకేష్‌కు స్నేహితుడిగా 35 ఏళ్ల నడక
రాజేశ్ కిలారు – నారా లోకేష్‌కి 35 ఏళ్ల స్నేహితుడు. ఇద్దరూ హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో క్లాస్‌మేట్లు. విజయవాడకు చెందిన ఒక చార్టెడ్ అకౌంటెంట్ కుమారుడైన రాజేశ్, హైదరాబాద్ ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత అమెరికాలోని రాబర్ట్ మోరీస్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు… ఇప్పుడు ఆయనే లోకేష్‌కు అత్యంత విశ్వసనీయుడిగా, నిత్యం పక్కన ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందారు.
రాజకీయ వ్యూహకర్తగా రాజేశ్
రాజేశ్ కిలారు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవిలో ఉన్నప్పటికీ, ఆయన పరిధి అంతకంటే విస్తృతం… ముఖ్యంగా వచ్చే వారం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో జరగబోయే పార్టీ మహానాడు సభలకు ఏర్పాట్లు ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు…
అలాగే, 2024 ముందు టిడిపిలో సభ్యత్వ డ్రైవ్‌ను టెక్నాలజీ ఆధారంగా విజయవంతంగా నడిపించాడు… ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వం కోటి మార్కును దాటి వెళ్లింది… పార్టీ కార్యకర్తలకు రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాల ద్వారా కేడర్ బలోపేతానికి పనిచేశాడు… అంతేగాక, అమెరికా వంటి దేశాల్లో ఉన్న ధనిక, బలమైన ప్రవాస తెలుగువారి మద్దతును పార్టీకి సమీకరించడంలోనూ రాజేశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు… ఇదీ ఆ స్టోరీ తెలుగు సారాంశం…
Share this Article