[[ Patri Vasudevan….. ]] “తెలివిగల కుందేలు ముతరాసి వలలో పడ్డట్టు”… ఈ సామెత అందరికీ తెలిసిందే.. కాకపోతే ఇప్పుడు ఈ సామెతను చంద్రబాబు పరిస్తితికి పోల్చి మాట్లాడుతున్నారు రాజకీయ, సోషల్ మీడియా విశ్లేషకులు. చంద్రబాబు జగన్ వలలో పడ్డారా? అని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ కోసం పనిచేసిన పీకే బృందంలోని ప్రధాన సభ్యుడు రాబిన్ శర్మ ప్రస్తుతం చంద్రబాబుకు వ్యూహకర్తగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. కాకపోతే అయన టీంలో జగన్ కోవర్టులు ఉన్నారా? పీకే వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారా? తనకే తెలియకుండా బాబు జగన్ వలలో చిక్కుకున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి.
జరుగుతున్న కొన్ని విషయాలను విశ్లేషించి చూస్తే నిజమే అన్న అనుమానాలు కలగక మానవు. గతంలో పీకే బృందంలో కాంపైనింగ్ హెడ్ గా పనిచేసిన శాంతను సింగ్ అనే వ్యక్తి ఈ మద్యనే రాబిన్ టీంతో జత కలిసాడని, అయన వచ్చిన తర్వాత ఒకేసారి రాబిన్ బృందంలో అలజడి మొదలైందని అంటున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న చాలామంది ఉద్యోగులు సంస్థను వీడిపోయే విధంగా చేస్తున్నాడని, వారి స్థానాల్లోకి ఐప్యాక్ టీం సభ్యులను తీసుకుంటున్నారు. ఇలా అయితే ఇక్కడి వ్యూహాలు చాలా తేలికగా వైరి పక్షానికి చేరే ప్రమాదం ఉందని అనుకుంటున్నారు.
అసలు శాంతను అందుకే వచ్చాడని కూడా అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇతను వచ్చిన తర్వాత ఐ-టీడీపీ వాళ్ళను పక్కన పెట్టాలని చూస్తున్నాడట. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ, కేసులు సైతం ఎదుర్కొంటున్న తమను తీసికట్టుగా చూడడం, పార్టీకి దూరం చేయాలనే పనుల పట్ల ఐ-టీడీపీ అద్యక్షుడు విజయ్ కూడా అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ పంచాయితీ లోకేష్ వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది. నమ్మి తెచ్చుకున్న వాడు నట్టేట ముంచుతాడేమో అన్న సందేహాలు ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కోవర్టు ఆపరేషన్ గురించి రాబిన్ శర్మకు తెలుసా? అసలేం జరుగుతోంది అని లోకేష్ కూడా అరా తీస్తున్నటు అనుకుంటున్నారు.
Ads
ఇదిలా ఉంచితే ఇటీవల జరుగుతున్న, జరిగిన పరిణామాలు ఒకసారి పరిశీలించి చూస్తే… జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. చంద్రబాబు అండ్ కో చేస్తున్న ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం కొత్తదేమి కాదు. గతంలో జగన్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసిన విషయం అందరికీ గుర్తుంది. చంద్రబాబు మాత్రం ఇదేదో సరికొత్త కార్యక్రమం అని అనుకోవడమే వింత. మొన్న కందుకూరులో జరిగిన తొక్కిసలాట.. 8 మంది మరణించడం బాబుకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అధికార పక్షం బాబు ప్రచార పిచ్చితో ఇరుకు రోడ్లలో సభలు పెట్టడం వల్లే ఇదంతా జరిగింది అని చేస్తున్న ఎదురుదాడికి సరైన జవాబు ఇవ్వలేకపోయింది.
అసలు విషయానికొస్తే అసలు ఈ ఇరుకు రోడ్ల కాన్సెప్టు గతంలో జగన్ కు పని చేసిన ఈ మహానుభావుడిదే కదా..! దీనికి కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు.. తెేలుకుట్టిన దొంగలా ఎందుకు వుండిపోవలసి వచ్చింది? దీనికి సమాధానం ఇవ్వగలడా? మొత్తం బాధ్యత బాబు మీద వేసుకోవలసి వచ్చింది వాస్తవం కాదా? దీనికి తోడు కొన్ని పత్రికల్లో , వెబ్ సైట్లలో వైసీపీ పనైపోయింది.. శాంతను సింగ్ టీడీపీ తో చేరిపోయాడు.. ఇక గెలవడమే తరువాయి అని కధనాలు రావడం దేనికి సంకేతం? అసలు ఇతను టీడీపీ తరపున పని చేయడం బాబుకు ఇష్టమేనా.. ఆయన సమ్మతితోనే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయా? ఇలాంటి ప్రశ్నలకు దేవుడే సమాధానం చెప్పాలి….
Share this Article