అయిపోయింది… రష్యా కథ ఖతం… నెల దాటింది ఉక్రెయిన్ అధ్యక్షుడు నెత్తి మీద వెంట్రుక ముక్కను కూడా రష్యా పీకలేకపోయింది… వేలాది మంది సైనికులు మరణించారు… ట్యాంకులు అప్పగించి భయంతో లొంగిపోతున్నారు… యుద్ధవిమానాలు కూలిపోతున్నాయి… రష్యా ఆయుధాగారం నిండుకుంది…… ఇలా బోలెడు వార్తల్ని పాశ్చాత్య మీడియా ప్రచారంలోకి తీసుకొస్తోంది… ఎవడిష్టం వాడిది… ఖండించేవాడు లేడుగా…
చివరకు పుతిన్ అజ్ఞాతంలోకి పారిపోతాడు అన్నంత స్థాయిలో కథలు వండబడుతున్నయ్… గుర్తుందా..? ఆమధ్య వాలి అనే ఓ స్నైపర్ గురించి ఇదే మీడియా నానా కోతలూ కోసింది… తోపు, తురుము అని ఆకాశానికెత్తింది… మానవాతీతుడు, యుద్ధరంగంలోకి దిగాడు, ఇక పుతిన్‌కు ఆత్మహత్యే దిక్కు అన్నంతగా పుంఖానుపుంఖాల కథనాలు వదిలింది… మన మీడియా కళ్లకద్దుకుని, మహాప్రసాదం అన్నట్టుగా అర్జెంటుగా మన భాషల్లోకి అనువదించి, అచ్చేసి పరవశించిపోయింది…
తీరా ఏమైంది..? ఇప్పటికి మళ్లీ ఆ వాలి గురించి ఒక్క స్టోరీ లేదు… రంగంలోకి దిగిన వెంటనే, వాడినెప్పుడో ఖతం చేసేశాం అని రష్యా అనుకూల సోషల్ మీడియా వార్తల్ని రాసుకున్నా సరే… అమెరికన్, నాటో మీడియా నుంచి ఉలుకూపలుకూ లేదు… ఉన్నాడో పోయాడో ఎవరికీ తెలియదు… ఇక ఆ వాలిని వదిలేయండి… మరో పేరును తెరమీదకు తీసుకొస్తున్నది అదే మీడియా… ఈసారి లేడీ కేరక్టర్… సేమ్, స్నైపర్… పేరు ఇరినా స్టారికోవా…
Ads
ఈమెను స్నైపర్ చార్‌కోల్ అంటారుట… ముఖంపై ఆకుపచ్చ, నలుపు రంగు స్కార్ఫులను కట్టుకుని, ఎలా ఉందో చూశారు కదా అని ఫోటోలు కూడా పబ్లిష్ చేసేస్తున్నారు… ఈమెనే స్నైపర్ బగీరా అని కూడా పిలుస్తారట… వయస్సు 41 ఏళ్లు… 2017లో ఉక్రెయిన్ ఆర్మీలో చేరిందట… దొనేత్సక్ మరియు లుహాన్స్క్‌లలో వేర్పాటువాదులకు వ్యతిరేకంగా పోరాడిందట…
అమెరికన్ మీడియా ఏదో రాయగానే మనవాళ్లు కళ్లుమూసుకుని గుడ్డిగా రాసేసుకుంటారుగా… సేమ్… అలాగే రాసుకుంటూ పోయారు… 2022లో ఆర్మీలో రిటైర్మెంట్ తీసుకుందట… లేడీ డెత్‌గా ప్రసిద్ధి పొందిన రష్యన్ ఫేమస్ స్నైపర్ Lyudmila Mikhailovna Pavlichenko తో పోల్చేస్తున్నారు… ఇంకేముంది, రష్యాకు మున్ముందు గడ్డురోజులే అన్నట్టుగా కథనాలు రాసేస్తున్నారు… మరి ఇంతటి తోపు నాలుగేళ్లకే ఆర్మీ నుంచి ఎందుకు రిటైర్ అయ్యిందో మాత్రం ఎవరూ రాయరు… ‘‘ఈ తిమింగిలాలను మనం ఓడించి తీరాలి, వీళ్లు మనుషులు కారు’’ అంటూ ఉక్రెయిన్ దళాలకు ఆమె అప్పుడే కొత్త ధైర్యాన్ని నింపుతోందట…
అన్నట్టు ఇప్పటివరకు ప్రపంచ అత్యుత్తమ లేడీ స్నైపర్‌గా పేరుపొందిన పావ్లిచెంకోను చూశారా..? రష్యాలో అత్యున్నత పురస్కారాల్ని. ది హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అవార్డును గెలుచుకున్న ఆమెను లేడీ డెత్ అని పిలిచేవాళ్లు… ఇదుగో ఆమె ఫోటో…
Share this Article