Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీలేఖ ఐపీఎస్… ఈమె గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే..?

December 14, 2025 by M S R

.

నిన్న నవ్య హరిదాసు గురించి చెప్పుకున్నాం… ప్రియాంక గాంధీ మీద వయనాడ్‌లో పోటీచేసిన ఆమె ఒక చిన్న కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పోటీచేసింది… అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీచేసీ, పార్టీ ఆదేశం మేరకు కార్పొరేటర్‌గా పోటీచేసిన రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ ఆమె…

మరొకరి గురించీ చెప్పాలి… ఆమె పేరు శ్రీలేఖ… 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆమె… కేరళ తొలి మహిళా ఐపీఎస్… డీజీపీ హోదాలో రిటైరైంది… మొదట్లో లెక్చరర్, తరువాత ఐపీఎస్… 33 సంవత్సరాలు సర్వీస్ చేశాక 2020లో రిటైరయ్యాక బీజేపీలో చేరింది… (బహుశా రాష్ట్ర పార్టీ వైస్ ప్రెసిడెంట్)

Ads

  • భర్త ఎస్.సేతనాథ్… త్రివేండ్రం మెడికల్ కాలేజీలో పిడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతిగా చేశాడు… ఆమె కాలమిస్ట్,పుస్తక రచయిత్రి… రిటైరయ్యాక సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది… ఐతే మొదటి నుంచీ జాతీయవాద దృక్పథం కాబట్టి ఎల్డీఎఫ్ గానీ, యూడీఎఫ్ గానీ ఆమెను ఎప్పుడూ లూప్ లైన్ పోస్టులకే పరిమితం చేశాయి… కొంతకాలం సీబీఐలో చేసినా, ఎక్కువగా జైళ్లు, ఫైర్, ట్రాన్స్‌పోర్టు ఇతర కార్పొరేషన్లకు ఎండీగా ఆమెను పోస్ట్ చేశారు… పైగా మగ వివక్ష సరేసరి…

ఆమె జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు తప్ప ఎప్పుడూ లా అండ్ ఆర్డర్‌లో ఉంచలేదు కాంగ్రెస్, కమ్యూనిస్టు ప్రభుత్వాలు… ఒక హత్య కేసులో జస్ట్ 90 రోజుల్లో చార్జిషీటు ఫైల్ చేసి, నిందితుడైన ఒక డీఎస్పీకి జీవితఖైదు శిక్ష పడేలా చేసింది…

sreelekha ips

ఇప్పుడు ఆమె గురించి ఎందుకు చెప్పుకోవాలీ అంటే… స్టేట్ లెవల్ పార్టీ పోస్టులో ఉన్నా సరే… తిరువనంతపురంలో కార్పొరేటర్‌గా పోటీచేయాల్సిందిగా పార్టీ ఆదేశించగానే సరేనంది… గెలిచింది… అంతేకాదు, మొదటిసారి లెఫ్ట్ కోటను బద్దలు కొట్టి ఎన్డీయే విజయకేతనం ఎగరేసింది… 101 సీట్లకు గాను బీజేపీ 50 సీట్లు గెలిచింది… ఇప్పుడు అక్కడ మేయర్ కుర్చీకి ఆమె ప్రధాన పోటీదారు.,.!!

kerala

ట్రివేండ్రమ్‌లో బీజేపీ ఉనికి గట్టిగానే ఉంది, గతంలో 30 కార్పొరేటర్ సీట్లు కూడా గెలిచింది, కానీ ఈసారి ఏకంగా మేయర్ పీఠం కొట్టేసింది… ఇదేకాదు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఉనికి చాటుకుంది… కొల్లం, కొజిక్కోడ్‌లలో పదేసి సీట్లు… చెప్పుకోవల్సింది ఇక్కడ ఎల్డీఎఫ్ పట్ల నగరవాసులు ఆదరణ బాగా తగ్గిపోవడం, యూడీఎఫ్ పుంజుకోవడం…

  • సో, కేరళ పొలిటికల్ సిట్యుయేషన్‌లో మార్పు అని చెప్పుకోవచ్చా..? చెప్పలేం… అర్బన్ వోటింగు కాబట్టి సహజంగానే కాస్త బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చినట్టుంది… పల్లెల్లో కూడా యూడీఎఫ్ పుంజుకుంటున్న సూచన మాత్రం పినరై విజయన్‌కు మాత్రమే కాదు, సీపీఎంకు బలమైన దెబ్బ కాబోతున్నట్టే… ఇదొక్క రాష్ట్రమే ప్రస్తుతం లెఫ్ట్ చేతుల్లో ఉంది…

udf

అన్నట్టు… ట్రివేండ్రం గురించి ఒకటీరెండు అదనపు విశేషాలున్నయ్… ప్రస్తుతం అక్కడ మేయర్ దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్ ఆర్యా రాజేంద్రన్… ఆమె భర్త కేఎం సచిన్‌దేవ్ అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే… అతనూ పిన్న వయస్కుడైన కేరళ ఎమ్మెల్యే…

  • చెప్పనేలేదు కదూ… అక్కడి ఎంపీ శశిథరూర్… కాంగ్రెస్ ఎంపీ, కానీ ఇప్పుడు కొన్నాళ్లుగా బీజేపీకి కన్నుకొడుతున్నాడు… ట్రివేండ్రం మేయర్ పోస్టుకు సరిపడా మెజారిటీ వచ్చినట్టేనా..? ఓ ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తే సరిపోతుందా..?

కాదు… అసలే కాదు… ఆ కార్పొరేషన్‌లో వోటర్లుగా రిజిష్టర్ చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా వోటు హక్కు ఉంటుంది… వాళ్లంతా నాన్- బీజేపీ సభ్యులే… సో, ట్రివేండ్రం మేయర్ పీఠం ఎన్నిక ఇప్పుడు మరింత ఆసక్తికరం…

ఎందుకంటే..? యూడీఎఫ్‌కు గానీ, ఎల్‌డీఎఫ్‌కు గానీ సొంతంగా మేయర్ పోస్టు కొట్టేన్ని సీట్లు లేవు.., కలిసి ఎవరికైనా మద్దతునిస్తే... ఆ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది... ఎందుకంటే..? అవెప్పుడూ కలవకూడని పక్షాలు కాబట్టి.... కేరళలో...!!

  • చివరగా…. కేవలం తిరువనంతపురంలో మాత్రమే ఓట్ చోరీ జరిగింది… అక్కడ మాత్రమే ఈవీఎంలు వాడారు… మిగతా మున్సిపాలిటీల్లో ఓట్ చోరీ జరగలేదు… ఈవీఎంలు వాడలేదు… అంతేనా యాంటీ బత్తాయీస్..!?

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాహుల్ గాంధీ, లియోనిల్ మెస్సీ… ఇద్దరినీ స్పానిష్ కనెక్ట్ చేసింది…
  • భవిత మండవ… ఓ కొత్త ఫ్యాషన్… ఆ విజయం వెనుక అసలు కథేమిటంటే…
  • నాటి తన వ్యాధి పీడిత కాళ్లు… నేడు కోట్ల మందికి ఆరాధ్యుడిని చేశాయి…
  • శ్రీలేఖ ఐపీఎస్… ఈమె గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే..?
  • టాప్-5 ఫైనలిస్టులు ఖరారు..! ఈ ఇద్దరు స్నేహితులు జాయింటుగా ఔట్..!
  • అదీ తేడా… అక్కడ మమత అట్టర్ ఫెయిల్… ఇక్కడ రేవంత్ సూపర్ గోల్…
  • నవ్య హరిదాస్..! ఇప్పుడు మరోసారి అందరి దృష్టీ ఈమెపై… దేనికంటే..?
  • కార్తీకదీపం..! వెలుతురు- చీకటి…! జస్టిస్ స్వామినాథన్‌కు మద్దతు..!!
  • ఆ బ్రాండ్ ఐస్‌క్రీమ్‌కూ కారు స్టార్ట్ గాకపోవడానికీ లింకేమిటి అసలు..?!
  • జస్టిస్ సూర్యకాంత్… న్యాయవ్యవస్థ మార్పులపై పెరుగుతున్న ఆశలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions