.
2014 IPS బ్యాచ్ అధికారి డా. జి.వి. సుందీప్ చక్రవర్తి… ప్రస్తుతం శ్రీనగర్ SSP… తనకు నౌగాం ప్రాంతంలో కొన్ని జైష్-ఎ-మొహమ్మద్ పోస్టర్లు కనిపించాయి… తను తేలికగా తీసుకోలేదు… అనుక్షణం తను పనిచేసే ప్రాంతంలోని ఉగ్రవాద నీడలపై సందేహాలే… అప్రమత్తతే అక్కడ పోలీసులకు, బలగాలకు రక్షణ, అఫ్ కోర్స్ దేశానికి కూడా..!
తను విచారణ ఆరంభించాడు… ఓ భారీ కుట్రను అది బయటపెట్టింది… 2900 కిలోల IEDలు, ఏకే-47 లు, అనేక స్లీపర్ సెల్స్… దేశాన్ని కుదిపేయాలనుకున్న భారీ టెరర్ నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసింది… సో, గోడపై జైషే మొహమ్మద్ పోస్టర్ కూడా ఓ భారీ కుట్రను బ్రేక్ చేసింది… ఇలాంటి ఆఫీసర్ల పుణ్యమాని… ఇంతకీ ఎవరితను..?
Ads

ఒక తెలుగు ఐపీఎస్, జమ్ముకాశ్మీర్ కేడర్… కర్నూలులో పుట్టాడు… ప్రాణరక్షణే తన లక్ష్యం… అందుకే కర్నూలు మెడికల్ కాలేజీలో డాక్టరీ చదివాడు… ప్రాణాలను రక్షించేవాడు… సివిల్స్ రాశాడు… ఐపీఎస్… ఇప్పుడూ ప్రాణాలే రక్షిస్తున్నాడు…
పూంచ్ ఏఎస్పీ నుంచి శ్రీనగర్ ఎస్ఎస్‌పి… హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్ సౌత్ జోన్, బారాముల్లా వంటి సున్నితమైన ప్రాంతాల్లో పనిచేశాడు…. అనేక కీలక ఆపరేషన్లు… మొన్నటి ఆపరేషన్ మహదేవతో సహా…
తన కెరీర్, తన జర్నీ మొత్తం ధైర్యం, స్పష్టత, సైలెంట్ ఆపరేషన్… ఆరు సార్లు రాష్ట్రపతి పోలీస్ గ్యాలంట్రీ మెడల్స్… అర్థమవుతోంది కదా, తన మెరిట్, తన జర్నీ…
#Srinagar #IPSChakravarthy #IndianPoliceService #Kashmir #HeroicOfficers #IPSofficers #Inspiring
Share this Article