.
నిన్న ఒక వార్త కనిపించింది… గీతాకృష్ణ అనే మోస్ట్ అన్‌వాంటెడ్ కేరక్టర్ కీరవాణి మీద విమర్శలు… సరే, కీరవాణిని విమర్శించొద్దు అని కాదు… తన తిక్క చేష్టలు, వివాదాలపై విమర్శలు చేస్తే వోకే…
కానీ… తన మీద చిల్లర, నిరాధార, జుగుప్సాకర విమర్శలు చేశాడు… ‘కీరవాణి వ్యభిచారి, చాలామంది చెప్పారు, నాకెందుకులే అని వదిలేశాను, తనకు అమ్మాయిల్ని సప్లయ్ చేసేవాడితో చెప్పేవాడట, స్కూల్ గరల్స్ కావాలని, వీడి మీద పోక్సో కేసు పెట్టాలి’…
Ads
ఎవడబ్బా వీడు..? (వీడు అనే రాస్తున్నా… ఇంకా పెద్ద పదం ఉపయోగించాలని కూడా అనిపించలేదు) ఆరా తీస్తే ఏవో చిన్నాచితకా సినిమాలు తీశాడట అప్పుడెప్పుడో… బినామీ పేరు అయి ఉంటుంది… ఇంత నీచమైన కూతలు కూసినందుకు… కీరవాణి ఎందుకు ఊరుకున్నాడో తెలియదు…
నిజంగా క్రిమినల్ డిఫేమేషన్ కేసు గనుక వేస్తే సదరు చానెల్ ఓనర్, ఇంటర్వ్యూయర్, వీడు మరుసటి రోజు జైలులో ఉంటారు… (ఈ వీడియో ఆధారంగా సాక్షి మెయిన్ స్ట్రీమ్ వెబ్ సైట్ కూడా ఓ వార్త రాసి, తరువాత డిలిట్ చేసుకుంది, గుడ్ డెసిషన్…) ముగ్గురి మీద పోక్సో కేసు వేయాలట… ఒరేయ్ ఒరేయ్, యెవుర్రా మీరంతా, యాణ్నుంచి వస్తారుర మీరంతా… సునీత మీద కూడా పోక్సో కేసు పెట్టాలా..? వెధవాయిత్వం అంటారు తెలుగులో దీన్నే…
ఏదో వీడియోలో చెబుతున్నాడు… హిందీ ఇండియన్ ఐడల్ షోలో నేహా కక్కర్ అర్ధనగ్నంగా పాల్గొంటుందట… ఛిఛీ… (పైగా ఫ్రీగా ఇంటర్వ్యూలు ఇవ్వడట, డబ్బు ఇస్తే ఏదైనా మాట్లాడతాడట, తనే చెబుతున్నాడు ఓ వీడియోలో…)
రాజమౌళి అండ్ కంపెనీ ఇప్పుడు ఎంత పవర్‌ఫుల్లో ఈ వీడియో చానెళ్లకు తెలిసినట్టు లేదు… అసలే చంద్రబాబు అండ్ కంపెనీ రాజమౌళికి వీరాభిమాని… సాక్షి దొరికితే అస్సలు వదలడు… సరే, ఈ గీతా కృష్ణ ఇలాగే చాలామంది సినిమా ప్రముఖులపై పిచ్చికూతలు కూస్తున్నాడు… ఎవడెవడో ఇంటర్వ్యూలు అప్‌లోడ్ చేస్తూనే ఉన్నారు…
ఇక ఊరుకోను, ఒక్కొక్కడి తాటతీస్తా అంటుంటాడు కదా మంచు విష్ణు… ఇంకా నిద్రలేవలేదా సార్..? సేమ్, మరొకడు ఉండేవాడు,.. త్రిపురనేని చిట్టి అనుకుంటా… ఆ చెవుల్లో జుట్టుగాడు… (ఈ హార్ష్ పదాలకు అర్హులే వాళ్లు)… తనూ అలాగే కారుకూతలు కూస్తుంటే యూట్యూబ్ చానెళ్లు పండుగ చేసుకునేవి…
ఇప్పుడు ప్రవస్తి ఇష్యూ వచ్చేసరికి ఇక మొదలుపెట్టాడు చిల్లర కూతలు… ఇక కోటి గురించి చెప్పాలి… మధ్యలో దూరాడు, ఏదో వీడియో… చివరకు నువ్వు కూడా చెప్పేవాడివి అయిపోయావా కోటీ… జీసరిగమ స్టేజ్ మీద ఔత్సాహిక గాయకులతో పాద తీర్థ పూజ చేయించుకున్న నైచ్యం నీది…
పైగా వీడియోలో ఆ ముగ్గురూ (సునీత, కీరవాణి, చంద్రబోస్) కష్టపడి పైకి వచ్చారు, మాది ఒకే కుటుంబం, వాళ్లను వదిలేయండి అంటున్నాడు ఈ గీతాకృష్ణను ఉద్దేశించి… అంటే ఆ ముగ్గురూ తప్పుచేశారని చెబుతున్నాడా..? కష్టపడి పైకి వచ్చారు కదాని తప్పు కాయాలా..?
కష్టం వేరు, వివక్ష వేరు… సరే, ప్రవస్తి అపరిపక్వత, తొందరపాటుతనం నిజమే కావచ్చుగాక… కానీ తమరు ఇళయరాజా, బాలు, మోహన్‌బాబు మీద కూడా అప్పట్లో విరుచుకుపడ్డట్టు చెబుతుంటారు కదా, మరి అదేమిటి..? అప్పుడు బాలు మీ సంగీత కుటుంబం కాదా..?
సో, వ్యవహారం శృతిమించుతోంది… టీవీ, సినిమా ఇండస్ట్రీలకు సంబంధించి ఎవడూ కిక్కుమనడం లేదు… రేప్పొద్దున వీడు మిమ్మల్నీ బజారుకు లాగుతాడు… బహుపరాక్…
Share this Article