Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీబీఐ వలలో ఓ బిగ్ షాట్… కూసాలు కదిలిపోతున్నయ్ ఓ ముఠాకు…

February 7, 2024 by M S R

పార్థసారథి పోట్లూరి :: ఇది ప్రధాన మీడియాలో పతాక శీర్షిక కింద రావాల్సిన వార్త! కానీ కనీస కవరేజ్ లేదు! ఫిబ్రవరి 2 శుక్రవారం రోజున హర్ష మందర్ (Harsha Mander) మీద CBI కేసు రిజిష్టర్ చేసింది. ఆరోపణలు ఏమిటీ? విదేశీ నిధుల దుర్వినియోగం! FCRA (Foriegn Contribution Regulation Act)

ఎవరీ హర్షమందర్? హార్షమందర్ IAS ఆఫీసర్! జార్జ్ సొరోస్, సోనియాలకి హర్షమందర్ చాలా దగ్గరి సన్నిహితుడు. అంతే కాదు UPA1,UPA 2 అంటే 2004 నుండి 2014 వరకూ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చెలామణి అయ్యాడు. హర్షమందర్ IAS ఆఫీసర్!

2002 లో అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజపేయి గారు ప్రధానిగా ఉన్న సమయంలో తన పదవికి రాజీనామా చేశాడు. సేవ, ఉద్యమం, పేరుతో యాక్టివిస్ట్ అవతారం ఎత్తాడు!

Ads

*********
2004 లో UPA అధికారంలోకి రాగానే అసలు రంగు బయటడింది! 2004 లో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ (National Advisory Council- NAC) ఏర్పాటు చేశారు. ఆ NAC లో హర్షమందర్ ఒక సభ్యుడు. సోనియా NAC చైర్మన్! NAC ఎందుకు ఏర్పాటు చేశారు?

ప్రధాని మన్మోహన్ సింగ్ కి సలహాలు సూచనలు ఇవ్వడానికి! నిజానికి సోనియా చైర్మన్ గా ఉన్న NAC ఏది చెపితే అదే చేశారు మన్మోహన్ సింగ్!
పరోక్షంగా సోనియా అండ్ కో దేశాన్ని పరిపాలించింది 10 ఏళ్లపాటు NAC ద్వారా.

********
హర్ష మందర్ NAC లో సభ్యుడుగా ఉన్నప్పుడే మత ఘర్షణల (Communal Voilance Bill) బిల్లు ముసాయిదా తయారయ్యింది. ఈ బిల్లు ముసాయిదా లో ఏముంది? దేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరిగినా హిందువులు బాధ్యత వహించాలి! అంటే పోలీసులు కేసు హిందువుల మీద పెడతారు మరియు హిందువులే తాము నిర్దోషులు అని నిరూపించుకోవాలి కోర్టులో!

ఈ బిల్లు ముసాయిదాను రూపొందించడంలో హర్ష మందర్ తో అతని మిత్రుడు బ్రిటన్ జాతీయుడు అయిన జీన్ డ్రేజ్ ( Jean Dreze) కూడా ఉన్నాడు. 2011 లో ఈ బిల్లు ముసాయిదా సిద్ధం అవగా అంతకు ముందు హర్ష మందర్, జీన్ డ్రెజ్ లు NAC నుండి వైదొలిగారు!

*******
హర్షమందర్ రెండు NGO లని నిర్వహిస్తున్నాడు! ఐఏఎస్ అధికారి అయి ఉండి NGO లని ఎలా నడుపుతున్నాడు? ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ NGO లని ఎలా స్థాపించాడు? 1998-2002 వరకూ ఉద్యోగం చేస్తూ NGO లని స్థాపించాడు అవి:
1. అమన్ బిరదారీ ట్రస్ట్ (Aman Biradri Trust).
2. సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ (Centre for Equity Studies).
ఈ రెండు NGO లకి బ్రిటన్ పౌరుడు అయిన జీన్ డ్రెజ్ సహ వ్యవస్థాపకుడుగా ఉన్నాడు.

ఈ రెండు NGO లకి 1998- 2002 ల మధ్య అప్పటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుండి భారీగా విరాళాలు వచ్చాయి. Well! తాను ఐఏఎస్ అధికారిగా ఉంటూ నడిపిన NGO లలో బ్రిటీష్ జాతీయుడు అయిన జీన్ డ్రెజ్ వాటిని నడిపాడు. అందుకే వాజపేయు ప్రధానిగా ఉన్న 2002 లో తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు హర్షమందర్.

2004 లో UPA అధికారంలోకి రాగానే NAC లో సభ్యుడు అవడమే కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే స్ధాయికి ఎదిగాడు. ఎందుకంటే సోనియా, జార్జ్ సోరోస్ లకి అత్యంత సన్నిహితుడు కాబట్టి.

*********
NAC లోకి సోనియా హర్షమందర్ తో పాటు బ్రిటీష్ జాతీయుడు అయిన జీన్ డ్రేజ్ ను కూడా సభ్యుడిగా నియమించింది. ఎందుకు? సోనియా, రాహుల్ లకి బ్రిటన్ తో ఏమి సంబంధం? గత పదేళ్ల నుండి బ్రిటన్, పాకిస్థాన్ దేశాల ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిపోతూ వచ్చింది? ఎన్నడూ లేనివిధంగా బ్రిటన్, పాకిస్థాన్ లలో వరసగా ప్రధానులు ఎందుకు మారుతున్నారు? లోతుగా అధ్యయనం చేస్తే కానీ పై ప్రశ్నలకి సమాధానం దొరకదు!

********
హర్షమందర్ ఒక విదేశీ NGO అయిన యాక్షన్ ఎయిడ్ (Action Aid) కి భారత్ లో మేనేజర్! 2014 లో మోడీజీ దీనిని నిషేధించారు! విచిత్రంగా ఈ యాక్షన్ ఎయిడ్ NGO కి కూడా 1998 నుండి 2002 వరకూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుండి భారీగా విరాళాలు వచ్చాయి!

******
హర్షమందర్ ఢిల్లీ లో ఉన్న మరో NGO క్విల్ ఫౌండేషన్ (Quill Foundation) లో కీలకమయిన స్థానంలో పనిచేస్తున్నాడు. ఈ క్విల్ ఫౌండేషన్ దేనికోసం స్థాపించడబడింది? క్విల్ ఫౌండేషన్ అనేది భారత్ లో ముస్లింస్ మీద హిందువులు చేసే దాడులని రికార్డ్ చేసి దాన్ని ఒక డేటా బ్యాంక్ లో ఉంచుతారు. ఆ డేటా బ్యాంక్ పేరు డూటు (DOTO).
1.DOTO డేటా బ్యాంక్ ను 2018 లో ప్రారంభించారు.
2. దీని ప్రారంభోత్సవానికి ఎవరెవరు హాజరయ్యారో తెలుసా?
3. రామ్ పున్యాని, తీస్తా తేసెల్వాడ్, జఫర్ ఉల్ ఇస్లామ్ ఖాన్, జాన్ దయాల్, రవి నాయర్, సబా నక్వీ మరియు ఇతర యాంటీ బీజేపీ యాక్టివిస్టులు.
క్విల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో DOTO డేటా బ్యాంక్ ఎవరెవరు వాడుకుంటున్నారు?
4. అమెరికాలో ఉన్న NGO పేరు ‘ సేవ్ ఇండియా ‘ (Seve India) వాడుకుంటుంది.
5. అమెరికాలో ఉన్న సేవ్ ఇండియా NGO అనేది మరో అమెరికన్ NGO అయిన ICNA ( US ISLAMIC CIRCLE OF NORTHERN AMERICA) కి ముసుగు అన్నమాట!
6.ICNA ను స్థాపించింది పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న టెర్రర్ గ్రూపులు. నిధులు కూడా టెర్రర్ గ్రూపులు నుండి వస్తాయి ICNA కి.
7. ఈ NGO లు అన్నీ హర్షమందర్ DOTO డేటా బ్యాంక్ ను వాడుకొని భారత్ లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి, మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారు అంటూ మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
8. హర్షమందర్ NGO లోని ఒక సభ్యుడు మరియు భాగస్వామి అయిన అజిత్ సాహి అమెరికాలో ఉన్న మరో NGO అయిన ఇండియన్ అమెరికన్ ముస్లిమ్స్ (IAMC – Indian American Muslims) లో సలహాదారుడు మరియు డైరెక్టర్ కూడా.
9.IAMC ను స్థాపించింది షేక్ ఉబైద్ (Sheik Ubed) ఇతనికి జమాతే -ఇ – ఇస్లామీ తో దగ్గరి సంబంధం ఉంది.
9. హర్ష మందర్ జార్జ్ సోరోస్ కి చెందిన ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ (Open Source Foundation) కి చెందిన హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అడ్వైజరీ బోర్డ్ (Human Rights Initiative Board) కి చైర్మన్!
10. హర్ష మందర్ మరో అమెరికన్ NGO అయిన ‘ ద జస్టిస్ ఫౌండేషన్ ‘ (The Justice Foundation) లో ఒక డైరెక్టర్. జస్టిస్ ఫౌండేషన్ ను పెట్టింది అయ్యుబ్ ఠాకూర్ (Ayyub Thakur). ఈ ఆయ్యుబ్ ఠాకూర్ పాకిస్థాన్ ISI కి  అమెరికాలో ఏజెంట్.
11. హర్షమందర్ విజిటింగ్ ఫాకల్టీ గా JNU, జామియా మిలియ ఇస్లామీయ, IIM అహ్మదాబాద్, St. స్టీఫెన్సన్ మరి కొన్నింటికి లెక్చర్లు ఇస్తుంటాడు.
12. ఎంతమంది విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేసి ఉంటాడు ఇప్పటివరకూ?

*******
ఇది మరీ నీచం: జార్జ్ సోరోస్ కి చెందిన మరో NGO ప్రియో (PRIO) హర్షమందర్ తో పాటు ఆల్ట్ న్యూస్ జుబెర్ పేర్లని నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేషన్ చేసింది. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా మళ్లీ మళ్లీ నామినేషన్ చేస్తూనే ఉంటాడు జార్జ్ సోరోస్!

*********
ఈ రోజు పార్లమెంట్ లో మోడీ కాంగ్రేస్ మీద విరుచుకు పడ్డారు ఎందుకో తెలుసా? ఫిబ్రవరి 3న CBI హర్షమందర్ మీద కేసు రిజిష్టర్ చేసిన తరువాత దొరికిన సమాచారం ఆధారం చేసుకుని చాకిరేవు పెట్టారు. ఈ రోజు మోడీ మాట్లాడినట్లు గతంలో ఎప్పుడూ అంత ఆగ్రహంగా మాట్లాడలేదు. కారణం ఉంది కదా?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions