రాబోయే సినిమా కోసం రిలీజైన ఓ ఫోటో ఆసక్తి రేపింది… అది విష్వక్సేన్ లేడీ గెటప్ అట… సినిమా పేరు లైలా… అచ్చం లేడీ లుక్కే… అదరగొట్టాడు… సరే, చాలామంది హీరోలు ఆడ పాత్రలు వేసి మెప్పించారు… కథానుసారం విష్వక్సేనుడూ లేడీ గెటప్ ట్రై చేస్తున్నాడు, దాన్నలా వదిలేస్తే…
అదే సినిమాలో తనతోపాటు కథానాయికగా కనిపించబోయే అమ్మాయికన్నా లేడీ విష్వక్సేన్ లుక్కే కాస్త అందంగా ఉన్నట్టుంది… ఆమె ఎవరబ్బా అని చూస్తే… మహేశ్ బాబుతోపాటు సంతూర్ యాడ్‌లో కనిపించిన ఆకాంక్ష శర్మ అని తేలింది… ఆ కమర్షియల్ యాడ్ కాన్సెప్టు, స్క్రిప్టు, టేకింగుల పరంగా చాలా పేరు తెచ్చుకుంది…
సబ్బులు ఎవరు కొంటారు..? గృహిణులు… సో, వాళ్లను టార్గెట్ చేసి, వాళ్లు అందమైన తల్లులుగా కనిపించాలనే కోరికను సొమ్ము చేసుకునేలా రూపొందిన కమర్షియల్ యాడ్ అది… యాడ్ ఫలించింది… సంతూర్ అమ్మకాలు ఆ కేటగిరీలో చాలా ఎక్కువ…
Ads
ఏదో క్రికెట్ మ్యాచ్, ఎవరో సిక్స్ కొడతారు… ఆ బాల్ పట్టుకుని ఒకామె సంతోషంతో గంతులేస్తుంటుంది… ఇది చూసిన ఒకమ్మాయి, ఇంకేం, మన సినిమాకు హీరోయిన్ దొరికినట్టే అంటుంది… ఆమె వైపే చూస్తున్న మహేశ్ బాబు చప్పట్లు కొడుతూ ఆమె దగ్గరకు వెళ్లి ‘మీరు మా సినిమాలో… ’ నటిస్తారా అని అడగబోతాడు… ఆ డైలాగ్ పూర్తిగాక ముందే ఓ చిన్న పిల్ల వచ్చి, ఆమెను హత్తుకుని మమ్మీ అంటుంది… అదీ యాడ్…
అందులో నటించిన మోడలే ఈ ఆకాంక్ష శర్మ… ఇదేకాదు, కేడబరీ వంటి చాలా కమర్షియల్స్ చేసింది… హర్యానాకు చెందిన ఈమె మల్టీ టాలెంటెడ్… తల్లి సాక్షి శర్మ ఏదో చాప్టర్ అకాడమీ నడిపిస్తుంది… ఆకాంక్ష మ్యూజిక్ వీడియోలు కూడా పాపులరే… త్రివిక్రమ అనే ఓ కన్నడ సినిమాలో చేసింది… అందులో స్టార్ కిడ్ విక్రమ్ హీరో… ఆకాంక్ష చేసిన కాసనోవా, జుగ్ను, ఐయామ్ డిస్కోడాన్సర్ వీడియోలు ఫేమస్… వాటిల్లో చేసిన టైగర్ ష్రాఫ్‌తో ఆమెకు సంబంధాలు అంటగట్టి బోలెడు గాసిప్స్ కూడా కనిపించాయి…
నిజానికి ఇవన్నీ కావు ఇంట్రస్టింగ్ అనిపించినవి… ఆమె ఎడ్యుకేషన్ వివరాల్లో ఐఐటీ ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేట్ అని రాసి ఉంది… వావ్, ఐఐటీలో చదివి ఈ ఫీల్డులోకి వచ్చిందా..? తీరా చెక్ చేస్తే బోలెడుమంది ఆకాంక్ష శర్మలు… చాలా ప్రొఫైళ్లు… సదరు ఐఐటీ ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేట్ వేరే ఇంకెవరో..!!
Share this Article