Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘వీడీ’లా ఉండటం కాదు… ‘వీడి’యే… ఎన్నాళ్లు దాచినా వాడే… జతగాడు…

February 28, 2024 by M S R

సెలబ్రిటీల పెళ్లిళ్లు, బ్రేకప్పులు, లవ్ ఎఫయిర్లు, ఎఫయిర్లు అన్నీ జనానికి ఆసక్తికరమే… పాపులారిటీ బాగా ఉన్న వ్యక్తుల లైఫ్ స్టయిల్, ఇష్టాయిష్టాలు, నిర్ణయాలను జనం ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు… సహజమే… ప్రత్యేకించి సినిమాల్లో బాగా క్రేజ్ ఉన్న వ్యక్తుల జీవనవిధానం ప్రభావం జనంపై ఎంతోకొంత పడుతూనే ఉంటుంది…

ఎఫయిర్లు ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు అబ్బే, ఏమీ లేదు, అంతా ఉత్తదే, మేం ఫ్రెండ్స్ మి మాత్రమే అని కొట్టిపారేస్తూ ఉంటారు… ఏదో ఒకరోజు మేం పెళ్లిచేసుకోబోతున్నామహో అనేస్తారు… అంతేకాదు, దూరంగా ఉంటుంటారు, వాళ్ల విడాకులు ఖాయం అని మీడియా రాస్తూ ఉంటుంది, నోనో మేం కలిసే ఉన్నాం అని సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతుంటారు… కొన్నాళ్లకు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లయ్ చేసినట్టు అసలు వార్త పేలుతుంది…

ప్రస్తుతం బాగా జోష్‌లో ఉంది రష్మిక మంధన… ఇప్పుడామె నేషనల్ స్టార్… తెలుగులో విజయ్ దేవరకొండ కూడా అంతే… సినిమాలెన్ని ఫెయిలైనా ఈ హీరో క్రేజ్ తగ్గలేదు… ఈ ఇద్దరి నడుమ ఎఫయిర్ ఎన్నాళ్లుగానో వార్తల్లో నలుగుతూ ఉంది… ఫిలిమ్ సర్కిళ్లలో చాలామందికి తెలిసిన బంధమే… ఐనా సరే, నోనో వుయార్ జస్ట్ ఫ్రెండ్స్ అంటారు… కలిసి మాల్దీవులు వంటివి టూర్ చేస్తారు, వార్తలు వస్తాయి, సో వాట్, విజయ్ నా ఫ్రెండ్, వెళ్తే తప్పేంటి అంటుంది రష్మిక నవ్వుతూ…

Ads

రీసెంటుగా ఓ అభిమాని రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ పేజీ (ట్విట్టర్‌)లో ఓ పోస్టు పెట్టాడు, కాస్త తెలివి ప్రదర్శించాడు…

What qualities should one have to become #RashmikaMandanna's husband?

She is National Crush of India
Her husband must be special.

Her husband should be like VD.
I mean Very Daring 💪 Who can protect her.
We call her a queen 👸 then her husband should also be like a king 👑 pic.twitter.com/UwC4lyHBr4

— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) February 26, 2024

‘రష్మిక మందన్న భర్తగా వచ్చే అబ్బాయికి ఉండాల్సిన లక్షణాలేమిటి’ అనే హెడ్డింగ్‌తో పోస్ట్‌ మొదలు పెట్టిన సదరు అభిమాని .. ‘ఆమె భర్త ‘వీడీ’లా ఉండాలి. ‘వీడీ’ అంటే వెరీ డేరింగ్‌ అని అర్థం. ఆమెను ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి. మేము రష్మికను క్వీన్‌ అని పిలుస్తాం కాబట్టి పెళ్లాడబోయేవాడు కింగ్‌లా ఉండాలి’ అంటూ రాసుకొచ్చాడు. ఆ అభిమాని ఉద్దేశం వీడీ అంటే విజయ్ దేవరకొండ…

ఇలాంటి పోస్టులు బొచ్చెడు కనిపిస్తాయి సోషల్ మీడియాలో… కానీ దీనికి ఆమే స్పందించి, పాజిటివ్ రిప్లయ్ ఇవ్వడంతో ఆ పోస్టు వార్తల్లోకి వచ్చేసింది… ఈ పోస్ట్‌పై రష్మిక స్పందిస్తూ ‘మీరు చెప్పినవన్నీ నిజమే’ అంటూ లాఫింగ్‌ అండ్‌ లవ్‌ ఎమోజీని జోడించింది… సో, క్లియర్, ఇద్దరి బంధమూ నిజమే అని మళ్లీ వార్తలు…

విజయ్ దేవరకొండ, రష్మిక బంధం కొత్తదేమీ కాదు, గీతగోవిందం సినిమా నుంచే మొదలైంది… రష్మిక ఆల్‌రెడీ పెళ్లికి సంబంధించి ఓ చేదు అనుభవాన్ని రుచిచూసింది… నిశ్చితార్థం అయ్యాక కూడా కేన్సిలైంది… తరువాత విజయ్‌తో అతుక్కుపోయింది, గాఢమైన ప్రేమే… విజయ్ ఆర్థికంగా డౌన్ అయినప్పుడల్లా రష్మికే సపోర్టుగా ఉంటోంది… తనను గుడ్డిగా నమ్మేస్తోంది… సో, లేట్ కావచ్చునేమో గానీ లేటెస్టుగా పెళ్లి బట్టల్లో వస్తారు… విజయ్ దేవరకొండ ఆమె నమ్మకాన్ని వమ్ముచేయనివాడైతేనే సుమా… అసలే ఇది సినిమాయాలోకం… (కవర్ ఫోటో కాస్త గ్రాఫిక్ వర్క్, వారి బంధాన్ని సూచించడం కోసం…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions