హఠాత్తుగా సోషల్ మీడియాలో ఓ డిమాండ్… ఓ పిలుపు… ఒకవేళ విశాల్ దడ్లానీ గనుక సోనీ టీవీ షోలలో జడ్జిగా ఇంకా అలాగే కనిపిస్తే సోనీ టీవీని బహిష్కరిద్దాం… ఇదీ ఆ పిలుపు… ఎందుకు..?
ఈమధ్య ఓ పంజాబీ సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ ఎయిర్ పోర్టులో సినిమా నటి కమ్ కొత్త ఎంపీ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టింది తెలుసు కదా… మంచి పని చేసింది అని కొందరు, చేసిందే బుద్ధిలేని పని కదా తనను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటూ ఇంకొందరు… ఆమెను సర్వీస్ నుంచి రిమూవ్ చేయడమే గాకుండా శిక్షించాలని కొందరు… ఆమెను ప్రస్తుతానికి సస్పెన్షన్‌లో ఉంచారు…
సరే, అందరికీ తెలిసిన ఆ వివాదంలోకి మళ్లీ ఎందుకులే గానీ… కంగనాను కొట్టడం వల్ల ఒకవేళ ఆ కానిస్టేబుల్ గనుక కొలువు కోల్పోతే, నేను ఆమెకు ఉపాధి కల్పిస్తానని విశాల్ దడ్లానీ బహిరంగ ప్రకటన చేశాడు… అదుగో అలా వార్తల్లోకి వచ్చాడు… ఇంతకీ ఎవరు ఈ విశాల్ దడ్లానీ…
Ads
ఓ బాలీవుడ్ గాయకుడు… సంగీత దర్శకుడు… ఇండియన్ ఐడల్ షో జడ్జిగా కనిపిస్తుంటాడు ఎక్కువగా… నున్నగా గొరిగిన గుండు, ఓ పిల్లిగడ్డం, ఓ డిఫరెంట్ లుక్కు… తన పేరు వినగానే ఉడ్తా పంజాబ్ అనే సాంగ్ గుర్తొస్తుంది… విశాల్- శేఖర్ జంట ప్రపంచవ్యాప్తంగా కనీసం 1000 షోలు ఇచ్చి ఉంటారు… విశాల్ సింధీ హిందూ కుటుంబం… ఆరా తీస్తే విశాల్‌కు ఇలాంటి వివాదాలు కొత్త కాదు… అంత సచ్చరిత్ర కూడా ఏమీ లేదు…
పనామా పేపర్ల లీక్ తరువాత ఓ విషయం తెలిసింది… బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో తన కంపెనీ సన్నీ బ్లెస్సింగ్స్ హోల్డింగ్ ద్వారా చేసిన పెట్టుబడులకు సంబంధించి విశాల్, కుటుంబసభ్యుల పేర్లు బయటపడ్డాయి… వీటిలో కొన్ని లావాదేవీలు ప్రస్తుతం ఈడీ విచారణలో ఉన్నాయి… సరే, అదొక కోణం…
తరుణ్ సాగర్ అనే జైన మత సన్యాసి మీద ఇలాగే ఓ ట్వీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు… తద్వారా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్నాడు… జైన మత మనోభావాలను దెబ్బ తీశాడని పలుచోట్ల ఎప్ఐఆర్లు కూడా నమోదయ్యాయి… విమర్శలకు గురైన సన్యాసి మాత్రం నవ్వుకుని, ఏమీ స్పందించకుండా వదిలేశాడు…తరువాత విశాల్ తను చేసింది తప్పేనని బహిరంగంగా క్షమాపణలు చెప్పుకున్నాడు… పంజాబ్- హర్యానా హైకోర్టు విశాల్‌ను మందలించి, జరిమానా విధించింది…
సో, విశాల్‌కు నోటి దురుసు ఎక్కువని తెలుస్తూనే ఉంది… కంగనా ఇష్యూలో తను చేసిన వ్యాఖ్య మీద కూడా ట్రోలింగ్ బాగానే సాగుతోంది… ఐతే తన పని నచ్చకపోతే… తను జడ్జిగా పాల్గొనే షోలు ప్రసారం చేసే సోనీ చూడటాన్ని ఎందుకు బహిష్కరించాలి..? గతంలో కూడా ఇలాంటి పిలుపులు వచ్చాయి, వస్తాయి… ఎవరూ సీరియస్‌గా తీసుకోరు… అంతే…
Share this Article