హమ్మయ్య… బిగ్‌బాస్ షో ముగింపుకొస్తోంది… కోర్టు ప్రత్యక్ష విచారణ దాకా పోకుండానే దానంతటదే గడువు ముగిసి, హౌజుకు తాళం పడబోతున్నది టెంపరరీగా… భ్రష్టుపట్టించబడిన ఈ సీజన్ ముగిసిపోతుందంటే చివరకు బిగ్‌బాస్ షో అభిమానులు కూడా ఆనందపడుతున్నారు… అంత చెత్త చెత్త చేశారు…
కారణాల జోలికి వెళ్లాలంటే మళ్లీ పేడకుప్ప తవ్వాలి… అదో కంపు… చివరి వారంలోకి ఆరుగురు కంటెస్టెంట్లు ప్రవేశించారు… కానీ ఫైనలిస్టులు అయిదుగురే కావాలి కదా… కాబట్టి బుధవారమో, గురువారమో మరొకర్ని తరిమేస్తారట హౌజు నుంచి… ఆ కంటెస్టెంటు ఎవరు..? నిజానికి వర్మ కేండిడేటు ఇనయను పంపించకుండా ఉండాల్సింది… ఆమె స్ట్రాంగ్ ప్లేయరే ఉన్నంతలో…
ఉన్నవారిలో శ్రీహాన్ తెలివైన కంటెస్టెంటు… ముందే అన్నీ నేర్చుకుని, వోటింగు ఏర్పాట్లు చూసుకుని, సిరి దగ్గర శిష్యరికం చేసి పక్కాగా ప్లాన్‌డ్‌గా వచ్చాడు… పైగా తెలివిగా ఆడుతున్నాడు… టాప్ ఫైవ్‌కు అర్హుడే… రేవంత్‌కు తిక్క ఎక్కువ… కానీ యాక్టివ్… ఫుల్ ఎనర్జీ… మంచి ఫాలోయింగ్ ఉంది జనంలో… ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ, వోట్లు పెంచుకుంటూ జాగ్రత్తగా నంబర్ వన్ స్థానం కాపాడుకుంటున్నాడు వోటింగులో… సో, తను కూడా టాప్ ఫైవ్‌కు అర్హుడే…
Ads
కీర్తి… మిగతావారితో పోలిస్తే డల్ కేండిడేట్… కాకపోతే మాటతీరు, ఆమె లైఫ్ ఓసారి పరిగణనలోకి తీసుకోవాలి… ఆమె విన్నర్ కాకపోయినా సరే, టాప్ ఫైవ్‌లో ఉండాలి… ఎందుకంటే… అంతులేని విషాదం చుట్టుముట్టినా సరే, ధైర్యంగా నిలబడి, ముందుకు నడిచే ఆత్మవిశ్వాసానికి ఆ స్థానం ఇవ్వాలి… ఇంతకంటే మంచి సందేశం మహిళలకు ఇవ్వడంకన్నా ఈ చెత్తా సీజన్ సాధించేది, వేరే సార్థకత ఇంకేముంది..?
శ్రీసత్య… ఈ డ్రై పిక్చర్‌లో కాస్త కలర్ ఆమె… కొంత తింగరితనం ఉన్నా సరే, ఉన్నంతసేపు కాస్త ప్లజెంట్‌గానే కనిపిస్తోంది… ఆమెను కూడా టాప్ ఫైవ్‌లో ఉంచడం తప్పులేదు… బిగ్‌బాస్ టీం ఎన్ని వేషాలు వేసినా సరే, ఏ కంటెస్టెంటునూ దగ్గరకు రానివ్వలేదు… దరిద్రపు లవ్ ట్రాకుల్లోకి జారిపోలేదు… ఇక మిగిలింది రోహిత్… పెళ్లాంతో కలిసి వచ్చినా, ఆమె మధ్యలోనే వెళ్లిపోయినా రోహిత్ తనదైన హుందాతనంతో ప్రేక్షకుల వోట్లు గెలుస్తున్నాడు…
పెద్ద పర్‌ఫార్మర్ కాకపోవచ్చుగాక… కానీ డిగ్నిఫైడ్ పర్సనాలిటీ… అందుకే అందరినీ ఆకట్టుకుంటున్నాడు… టాప్ ఫైవ్‌లోకి నిరభ్యంతరంగా ఎంట్రీ ఇవ్వొచ్చు… చివరగా ఆదిరెడ్డి… తను పర్‌ఫార్మర్ కాదు… పేరుకు కామనర్ అని షో… కానీ తను బిగ్‌బాస్ రివ్యూయర్‌గా యూట్యూబ్‌లో పాపులరే… చాలా విషయాల్లో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే డల్… కాకపోతే లా పాయింట్లు వెతికి, అవసరమైతే బిగ్‌బాస్‌ను, నాగార్జునను ప్రశ్నించిన తీరు బాగుంది…
వోట్లు పేరుకే… ఎవరిని పంపించాలి, ఎవరిని ఉంచాలి అనేది బిగ్‌బాస్ టీం ఇష్టం… నిజానికి గీతును పంపించకుండా ఉండాల్సింది… తను ఓ తిక్కమేళం… కానీ ఆమె వ్యూహాలకు మిగతా కంటెస్టెంట్లు హడలిపోయేవాళ్లు… ఆదిరెడ్డి బదులు ఆమె గనుక టాప్ ఫైవ్ దాకా వచ్చి ఉంటే కొంతైనా గేమ్‌లో మజా ఉండేది… ఐనా బిగ్‌బాస్ టీంకు ఈసారి థ్రిల్, మజా, ఆదరణ, రేటింగ్స్ అక్కర్లేదు కదా… సో, ఆదిరెడ్డిని పంపించేస్తే సరి… ఇక్కడిదాకా వచ్చాడు చాలు… ఐనాసరే, తన మీద బిగ్‌బాస్ టీంకు ఇంకా ప్రేమ మత్తడి దూకుతుంటే మాత్రం.., కీర్తి లేదా శ్రీసత్యలో ఒకరికి మధ్యలోనే మూడినట్టు…!!
చెప్పడం మరచిపోయా… ఈ సీజన్ లో అతి పెద్ద దరిద్రం ఏమిటంటే… contestants eliminate అయిపోయి బయటికి రాగానే ఎవరో నెత్తిమాసిన interviewer శివ అట, దిక్కుమాలిన ప్రశ్నలతో… అసలే బాధలో ఉన్న వాళ్ళను మరింత అవమానించేలా చిల్లరతనం ప్రదర్శిస్తున్నాడు… ఎవడ్రా ఈ character ను ఎంపిక చేసింది..!?
Share this Article