.
వై నాట్ ఈటల..? ఓ మిత్రుడు సీరియస్‌గానే వేసిన ఈ ప్రశ్న నిజంగానే నన్ను ఓ ఆలోచనల్లో పడేసింది… అసలు వై నాట్ అనే పదాలే చర్చనీయాంశాలు కదా… ఇంతకీ మిత్రుడి ప్రశ్న, అభిలాష ఏమిటంటే..?
ఈటల రాజేందర్ ఉపరాష్ట్రపతి ఎందుకు కాకూడదు అని..! ఇంట్రస్టింగు… సరే, దన్‌ఖడ్‌ను ఎందుకు రాజీనామా చేయించారు, తదుపరి బీజేపీ వ్యూహం ఏమిటనే అంశంలో బోలెడు ఊహాగానాలు కనిపిస్తున్నాయి మీడియాలో… ఎస్, మీడియా అంటేనే ఊహాగానాలు కదా…
Ads
ఎస్, ఈటలకు అనర్హత లేదు… బీసీ… చట్టసభల ప్రొసీడింగ్స్ తెలిసినవాడు… అన్ని పార్టీల ఎంపీలతోనూ రిలేషన్స్ మెయింటెయిన్ చేయగలడు… (ఒక్క ఆ పార్టీ మినహా)… అది చాలదా అంటారా..? ఏమో, అది తరువాత ఆలోచిద్దాం గానీ… అసలు ధన్‌ఖడ్ రాజీనామా వెనుక అంతుపట్టని రాజకీయ వ్యూహాల్ని కాసేపు పక్కన పెడితే…
రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి… మరీ ప్రధానంగా తెలుగు సోషల్ మీడియా రెచ్చిపోయి… చంద్రబాబు, బండారు దత్తాత్రేయ ఎట్సెట్రా పేర్లతో పాటు మరీ చివరకు చిరంజీవి పేరు కూడా ప్రస్తావిస్తోంది… సరే, ముందుగా బీహార్ ముఖ్యమంత్రి నితిశ్‌ను ఆ ఉపరాష్ట్రపతి పదవిలోకి తీసుకుని, ఎవరైనా బీజేపీ నేతను సీఎం పదవికి ఎక్స్‌పోజ్ చేయాలనేది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు…
కానీ… ఉపరాష్ట్రపతి పదవి అంటేనే, అది ఎవరి రాజకీయ జీవితానికైనా ముగింపు… కానీ నితిశ్ దానికి అంగీకరించడు, అవసరమైతే ఏదో ఓ కేంద్ర పదవితో రాజీపడతాడేమో… మరి మిగతా వార్తల్లో ఉన్న పేర్లు..? నిజంగానే ఊహాగానాల్లో ఉన్న సౌత్ ప్రయారిటీ ఆచరణలోకి వస్తుందాా..?
1. శశిధరూర్… ఆల్రెడీ కాంగ్రెస్‌కు దూరం జరుగుతున్నాడు, తన తోవలోనే చాలామంది… తనకు గనుక ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే బెటరే… మరీ ఐరాస కేరక్టర్, భాష ప్రాబ్లమ లేదు, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలిసినవాడు… ఈమధ్య దేశమే ప్రధానం అని డైలాగులు కొడుతున్నాడు… బీజేపీ పాజిటివ్ కనుసన్నల్లో ఉన్నవాడు… తీసిపారేయదగిన కేరక్టర్ అయితే కాదు… ఆ పదవికి…
2. చంద్రబాబు… ఈ పేరు అర్జెంటుగా కొట్టేయాలి… ఐతే గియితే ఈ టరమ్ అయిపోయాక ఏకంగా రాష్ట్రపతి పదవే ఆశిస్తాడు… దేశంలోని అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు, ఆర్థిక (హార్ధిక) సంబంధాలు ఉన్నవాడు… ఐనా ఇప్పుడు లోకేష్‌ను ముఖ్యమంత్రి పీఠంపై ప్రతిష్టిస్తే, పవన్ కల్యాణ్‌తో చిక్కులు… అసలే బీజేపీ చేతిలో సనాతన అస్త్రం పవన్ కల్యాణ్… పోనీ, పవన్ కల్యాణ్‌నే సీఎంగా చేస్తే అంటారా..? అదే చేస్తే ఇక చంద్రబాబు రాజకీయ జీవితం క్లోజ్, లోకేష్ కెరీర్‌కు సమాధి…
3. బండారు దత్తాత్రేయ… తనకూ క్లారిటీ ఉంది, మొన్నటి గవర్నర్ పోస్టుతోనే ఇక తన పొలిటికల్ కెరీర్ ఖతం అని… ఇక జీవితమంతా సాంస్కృతిక బంధాలు, సేవతోనే గడిపేస్తానని చెప్పింది అందుకే…
4. మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ఢిల్లీలో దీపావళి ఉత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సందర్భంగా… ఈ ఉపరాష్ట్రపతి పదవి ప్రతిపాదన వచ్చింది కాబట్టి ఆయన పేరు కూడా ఈ కోవలో నుండి తీసేయడానికి వీలు లేదు అనేది ఇంకొందరి ఉహ… నో చాన్స్, తను రాజకీయాల నుంచి చాలా దూరం వచ్చేశాడు,
ఏవో నాలుగు సినిమాలు అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ తరహాలో చేసేసుకుంటూ కాలం గడుపుతాడు… పైగా బీజేపీ తన సొంత నాయకుల్ని ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెడుతుంది… అంటే రాజ్యసభ చైర్మన్ పోస్టు అది… ఆ పదవి నిభాయించడం అంటే అల్లాటప్పా వ్యవహారం కాదు, హిందీ- ఇంగ్లిషు ఫ్లూయెన్సీ కూడా ఓ అర్హతే… అంతేతప్ప అసలు పాలిటిక్సులోనే లేని ఓ తటస్థుడిని ఆ కుర్చీలో కూర్చోబెట్టరు…
5. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, లేదా కాశ్మీరీ నేత గులాం నబీ ఆజాద్… లేదా బిజెపి రవిశంకర్ ప్రసాద్… నాట్ ఏ బ్యాడ్ ఐడియా… ఈ ముగ్గురిలో ఎవరైనా సరే, బీజేపీకి మంచిదే… గులాం నబీ ఆజాద్ ఐతే బెటర్… దేశంలోని అన్ని పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలున్నాయి… పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ మీద మంచి అవగాహన ఉంది, కశ్మీరీ నేత…
6. బీహార్ సీఎం నితిశ్… తను ఉపరాష్ట్రపతిగా వెళ్లకపోవచ్చు… ఒకవేళ తన మీద యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ వోటు బలంగా ఉందీ అనుకుంటే తనను కేంద్రంలో మంత్రిగా తీసుకుని, బీజేపీ తమ నేతను ఎవరినైనా సీఎంగా ప్రొజెక్టు చేస్తుందేమో.,. అంతే…
7. పోనీ, నితిన్ గడ్కరీ లేదా రాజనాథ్ సింగ్..? ఆర్ఎస్ఎస్ కోపాన్ని తగ్గించడానికి నితిగ్ గడ్కరీ పేరు ఉపయోగపడుతుంది… తను సమర్థుడే… రాజనాథ్ సింగ్ కూడా… ఏమో, చివరాఖరుకు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కూడా ఎంపిక చేయవచ్చు.,. మోడీషా అంత తేలికగా బయటపడరు…
అవునూ, వీళ్లందరికన్నా బీజేపీ ఐడియాలజీలో ధన్‌ఖడ్ చాలా బెటర్ కదా… తనతో ఎందుకు రాజీనామా చేయించినట్టు..? ప్చ్, అనూహ్యం, అందుకే మోడీషా స్ట్రాటజీలు అంత త్వరగా అంతుబట్టవు..!! ఏదో ప్లాన్ లేకపోతే ధన్‌ఖడ్ కూడా అంత తేలికగా కన్విన్స్ అయ్యేరకం కాదు… ఏమిటబ్బా అది..? ఓ వెంకయ్యనాయుడి తరహా ఉపరాష్ట్రపతి కావాలి ఇప్పుడు..!!
Share this Article