తెలుగు ఇండియన్ ఐడల్ షో అసలు నిర్మాతలు ఎవరో గానీ… బాలయ్యకు క్లోజ్… ఆహా ఓటీటీలోనే అన్‌స్టాపబుల్ అని ఓ చాట్ షో వచ్చింది… అది బాలయ్యలోని ఓ భిన్నమైన ఫన్ యాంగిల్‌ను ప్రొజెక్ట్ చేసింది… తెలుగు టీవీలు, ఓటీటీల్లో వందల చాట్ షోలు రావచ్చుగాక… బాలయ్య షో యూనిక్… ఫ్యాన్స్‌ను ఈడ్చి తన్నే బాలయ్య కాదు, మరో కొత్త సరదా బాలయ్య కనిపించాడు… తెలుగు ఇండియన్ ఐడల్ షో కూడా అంతే… ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే థమన్ కొత్త మొహాన్ని ప్రజెంట్ చేసింది… చాలా మార్పు, చాలా సరదాగా కనిపించాడు…
ఆమధ్య ఏదో పండుగవేళ బాలయ్య తెలుగు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్లందరికీ స్వీట్లు, గిఫ్టులు పంపించాడు… తాజాగా టాప్-6 షోకు వచ్చాడు… నిజానికి అదే ఎపిసోడ్‌లో విజేతకు ప్రకటించేయాలి… కానీ చిరంజీవి అడ్డుపడ్డాడు… ఈ టాప్ కంటెస్టెంట్లు ఆచార్య ఫంక్షన్‌లో వేదిక మీద పాటలు పాడారు… వాళ్లకు తెలుగు జనంలో బాగా అప్లాజ్ వస్తోంది… సో, బాలయ్య ఫినాలే కాదు, చిరంజీవి ఫినాలే కావాలని అన్నాడు… అల్లు అరవింద్‌కు చెప్పాడు… బాలయ్యకన్నా బావ ఎప్పుడూ గొప్పే కదా… అర్జెంటుగా వోకే అని తలూపాడు…
Ads
దాంతో వచ్చే శుక్రవారం బాలయ్య పాల్గొనే ఎపిసోడ్ సెమీ ఫైనల్ అయిపోయింది… డాన్స్ చేశాడు, గెస్టుగా హడావుడి చేశాడు… అన్‌స్టాపబుల్ బాలయ్యను మరోసారి చూడొచ్చు… అయితే చిరంజీవి పాల్గొనే ఫినాలేను షూట్ చేసి, 17న ప్రసారం చేయబోతున్నారు… అందులోనే విజేతకు ట్రోఫీ ప్రకటన ఉంటుంది… అంతేకాదు, ఎవరెవరికి ఏయే సినిమాల్లో పాటలు పాడే చాన్సులు ఇస్తున్నారో కూడా చెబుతారు… బిగ్‌బాస్ ఫినాలేలో చూశాం కదా, చిరు ఆర్టిఫిషియల్ ఓవరాక్షన్… సో, ఈ తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేలో కూడా చూడాల్సి ఉంది…
సరే, అదెలా ఉంటేనేం..? పది రోజుల ముందే ఓ ప్రెస్‌మీట్ కండక్ట్ చేశారు… ఓటీటీ షోకు కవరేజీ పట్ల పెద్దగా సినిమా జర్నలిస్టులు ఇంట్రస్టు చూపించరు… కవర్ ఎలా ఉన్నా సరే… టీవీలూ అంతే… లైట్ తీసుకుంటాయి… అందుకే యూట్యూబ్‌లో లైవ్ పెట్టేశారు… ఎటొచ్చీ దీని నిర్వహణే చెత్త… ఒకవైపు ఇతర టీవీ మ్యూజిక్ షోలతో పోలిస్తే ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షో బాగుందని అనే టాక్ రాగా, కీలకమైన ఈ ఫినాలే ప్రెస్‌మీట్‌ను దరిద్రంగా నిర్వహించారు…
ఇండియన్ ఐడల్ హిందీ షో ఎంత పాపులర్ షో అందరికీ తెలుసుగా… ఇంకా దాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రాంతీయ భాషలకు కూడా రైట్స్ ఇస్తున్నారు… మలయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ సహా తెలుగులో కూడా… వేలాది మంది ఆడిషన్స్‌కు వచ్చారు… 55… 12… చివరకు మిగిలింది ఆరుగురు… టాప్ 12లో ఒకరిద్దరు మినహా పది మందీ మంచి సింగర్సే… వారిలో వైష్ణవి, ఆదితిలకు ఆల్‌రెడీ సినిమాల్లో పాడిన అనుభవం కూడా ఉంది… పలువురు పాడతా తీయగా నుంచి పలు పోటీల్లో పాల్గొన్న అనుభవం కూడా ఉంది…
ఈ ప్రెస్‌మీట్ విషయానికొద్దాం… అసలు ఇది ఓ ప్రోగ్రాం కమ్ ప్రెస్‌మీట్… దానికి యాంకర్‌గా గీత భగత్ ఎంపిక ఓ పెద్ద రాంగ్ చాయిస్… అదీ శ్రీరామచంద్రకే అప్పగిస్తే సరిపోయేది… అక్కడ అయిదుగురు ఫైనలిస్టులే కనిపిస్తున్నారు… టాప్-6లోని లాలస (శ్రీరాంచంద్ర బంధువు) కనిపించలేదు… అంటే సెమీస్‌లో ఎలిమినేట్ చేసినట్టు లెక్క… ఆ సస్పెన్స్ చేజేతులా నాశనం చేశారు…
సో, ఫైనలిస్టులు ప్రణతి, వైష్ణవి, వాగ్దేవి, శ్రీనివాస్, జయంత్… ఎప్పుడైతే కార్తీక్ విజేత పేరు ‘వి’తో స్టార్టవుతుందని అన్నాడో అప్పుడే భీకరమైన హింట్స్ ఇచ్చేసినట్టు లెక్క… అంటే వైష్ణవి లేదా వాగ్దేవి… వైష్ణవి చెన్నైవాసి… సింగర్ కల్పన శిష్యురాలు… పదహారేళ్లే తన వయస్సు… థమన్ క్యాంపుతో రిలేషన్స్ ఉన్నయ్…
వాగ్దేవి ఓ తాజా సెన్సేషన్, నెల్లూరుకు చెందిన ఈ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ వాయిస్ కల్చర్, పాటతీరు బాగా అభినందనలు పొందుతున్నయ్… ఓ దశలో థమన్ ‘రాబోయే పదిహేనేళ్లు నువ్వు టాలీవుడ్ సింగింగ్‌ను రూల్ చేస్తావు, కమాన్ పలు పాటలు నీకోసం ఎదురుచూస్తున్నాయి, నేనే కాదు, వేరేవాళ్లు కూడా’ అన్నాడు… సో, ఎవరు ఫైనల్ విజేత అయినా ఒకటే… అయితే ఎటొచ్చీ కీలకమైన సెమీస్, ఫైనల్స్ మీద ఆసక్తిని చంపేశారు ఈ ప్రెస్‌మీట్‌తో… అదీ మనం చెప్పుకునేది..!! చివరగా… గెస్టుగా వచ్చింది కదాని ఉషా ఉతుప్‌తో కలిసి శ్రీరామచంద్ర, కార్తీక్ ఓ పాట పాడారు… మ్యాటనీ ఆట ఉంది, బాటనీ పాఠముంది, దేనికో వోటు చెప్పరా అంటూ… పరమ నాసిరకం ప్రజెంటేషన్… వుయ్ పిటీ ఉషా ఉతుప్..!!
Share this Article