2000 రూపాయల నోట్ల చెలామణీ ఆగిపోయింది… రిజర్వ్ బ్యాంకు అధికారికంగా ప్రకటించింది… సెప్టెంబరు నెలాఖరు వరకు ఆర్బీఐ ప్రాంతీయ కేంద్రాల్లో, బ్యాంకు శాఖల్లో మార్చి 23 నుంచి రోజుకు 10 నోట్లు మాత్రమే మార్చుకోవచ్చు… ఎంత భారీ మొత్తమైనా సరే డిపాజిట్ చేసుకోవచ్చు… ఇకపై బ్యాంకుల్లో ఈ నోట్లు ఇవ్వరు… సెప్టెంబరు తరువాత ఇక 2000 రూపాయల నోట్ల చెలామణీ ఉండదు… ఇదీ నిర్ణయం… ఇదీ వార్త…
నిజానికి అయిదేళ్లుగా ఈ నోట్ల ముద్రణ ఆపేశారు… చాన్నాళ్లుగా బ్యాంకుల్లో ఈ నోట్లను ఇవ్వడం లేదు… ఏటీఎంల్లో కూడా ఈ నోెట్లను పెట్టడం లేదు… చాలా ఏటీఎంల్లో కేవలం 500 రూపాయల నోట్లే దొరుకుతున్నాయి… కొత్త నోట్ల ముద్రణ లేదు, బ్యాంకుల్లో ఇవ్వడమూ లేదు… కాబట్టే ఒక దశలో మొత్తం కరెన్సీలో 37.3 శాతం (2018) ఉన్న 2000 రూపాయల కరెన్సీ నోట్ల శాతం ఇప్పుడు 10.8 శాతానికి పడిపోయింది… ఇప్పుడిక జీరో స్థాయికి తీసుకొస్తున్నారు…
టెక్నికల్ కారణాలు ఓసారి పరిశీలిస్తే… 2016లో ఒకేసారి 500, 1000 రూపాయల నోట్లను హఠాత్తుగా రద్దు చేశారు… దాంతో ఓ మధ్యంతర సర్దుబాటుగా మాత్రమే ఈ 2000 రూపాయల నోట్లను ప్రింట్ చేసి, మార్కెట్‌లోకి తీసుకొచ్చారు… అప్పట్లోనే ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది ఈ 2000 రూపాయల డినామినేషన్ కొన్నాళ్ల కోసమేనని..! సో, అందరికీ క్లారిటీ ఉంది, ఎప్పుడైతే బ్యాంకులు వీటిని ఇవ్వడం మానేశాయో, కొత్త నోట్ల ముద్రణ ఆగిపోయిందో… చాలామంది ఈ 2000 రూపాయల నోట్లను తమ దగ్గర ఉంచుకోవడమే ఆపేశారు…
Ads
బేసిక్‌గా పెద్ద విలువ కలిగిన నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించడం ప్రభుత్వ విధాన నిర్ణయం… డిజిటల్ లావాదేవీలను ఎంకరేజ్ చేయడం, కరెన్సీ నోట్లను డిస్కరేజ్ చేయడం ఆ నిర్ణయంలో ఒక భాగం… పన్ను ఎగవేతలు గట్రా ప్రభుత్వం ఏవో కారణాలను చెబుతుంది కానీ కరెన్సీ వాడకం ప్రధానంగా సాగే ఇండియన్ మార్కెట్‌లో ఇలాంటి నిర్ణయాలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయనే సోయి ప్రభుత్వానికి లోపించింది… అసలు 2016లో 500, 1000 రూపాయల నోట్ల రద్దు ఓ మూర్ఖ నిర్ణయమనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి…
ఉగ్రవాదులకు డబ్బులు చేరకుండా అడ్డుకట్ట… నకిలీ నోట్ల నిరోధం… నల్లధనం నియంత్రణ వంటి ఎన్నో కారణాలు చెప్పాడు మోడీ… ఫలితం కనిపించకపోతే ఉరి తీయమన్నాడు… నోట్ల రద్దు వల్ల ఫలానా ఫాయిదా ఒరిగిందీ అని ఈరోజుకూ ఎవరూ చెప్పలేని దురవస్థ… (పాకిస్థాన్ కరెన్సీని ప్రింట్ చేసే బ్రిటిష్ సంస్థే మన కరెన్సీని కూడా ప్రింట్ చేసేది… రెండు దేశాలకూ సెక్యూరిటీ థ్రెడ్ సప్లయ్ చేసేది… ఐఎస్ఐ ఈ వెసులుబాటుతో భారీ ఎత్తున మన కరెన్సీ ప్రింట్ చేసి, మన మార్కెట్‌లో వదిలిందనే వార్తలు వచ్చాయి అప్పట్లో… ఇండియాను అనేకరూపాల్లో దెబ్బతీయడమే ఐఎస్ఐ లక్ష్యం కాబట్టి అందరూ నమ్మారు… కానీ ఏమేరకు నల్లధనం, నకిలీ కరెన్సీ నియంత్రణ సాగిందనే అంశం ఓ బ్రహ్మపదార్థం… అదెవరికీ అంతుపట్టదు…
ఉగ్రవాదులకు సాయం ఆగిపోయిందనేదీ అబద్ధమే… అప్పట్లో ఖలిస్థానీవాదం ఇంతగా లేదు, ఇప్పుడు పెచ్చరిల్లిపోయింది… ఇస్లామిక్ తీవ్రవాదం, నక్సలిజం ఏమీ తగ్గలేదు… ఈ 2000 రూపాయల నోట్లలో చిప్స్ ఉన్నాయి, నయా టెక్నాలజీ అని కాషాయ యూనివర్శిటీ తలతిక్క ప్రచారానికి పూనుకుంది… దాని గురించి చెప్పుకోవడం శుద్ధ దండుగ… అలాగే రాబోయే ఎన్నికల నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీల డబ్బు పంపిణీ వ్యూహాల్ని అడ్డుకోవడానికి ప్రస్తుతం ఈ 2000 రూపాయల నోట్ల చలామణీ రద్దును ప్రకటించారనేదీ తప్పుడు ప్రచారమే…
ఇదే నిజమైతే మొన్నటి కర్నాటక ఎన్నికల ముందే ఈ నిర్ణయం ప్రకటించేవాళ్లు కదా… కర్నాటక ఎన్నికలు కూడా బీజేపీకి ప్రతిష్ఠాత్మకమే కదా… పైగా ఏ రాజకీయ పార్టీ కూడా 2000 రూపాయల నోట్లను నిల్వ చేసి పెట్టుకోలేదు… అవెప్పుడు రద్దవుతాయో అనే సందేహం ప్రతి పార్టీలోనూ ఉన్నదే… పైగా సడెన్‌గా మార్కెట్ నుంచి తీసిపారేయడం లేదు ఇప్పుడు… నాలుగు నెలల గడువు ఇచ్చారు… ఈ జాగ్రత్త, ఈ ఆచరణ తీరు 2016లో లేకుండా పోయింది… (దానికీ బోలెడు కారణాలు చెబుతుంటారు…)
డిజిటల్ లావాాదేవీలను ఎంకరేజ్ చేయడానికి, నగదు లావాదేవీలను డిస్కరేజ్ చేయడానికి… బ్యాంకుల్లో నగదు డ్రా చేయడం, డిపాజిట్ చేయడం మీద అనేక ఆంక్షల్ని అమలు చేస్తున్నారు… చాలా చిల్లర, నష్టదాయక నిర్ణయాలున్నయ్ అందులో… పైగా డిజిటల్ ప్రాధాన్యం అనే తమ పాలసీకి విరుద్ధంగా 3 శాతం ఛార్జిని కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు… ప్రజల్ని మరింతగా డిజిటల్ వైపు పుష్ చేయడానికి, ప్రతి లావాదేవీ రికార్డ్ కావాలనే తమ నిర్ణయానికి వీలుగా ఈ 2000 రూపాయల నోటు రద్దయిపోయింది…
అప్పట్లో స్థిరాస్తుల నమోదు, బంగారానికి పరిమితులు వంటి చాలా వార్తలు వచ్చాయి… అవన్నీ నోట్ల రద్దులాగే అమలు గనుక చేస్తే…. మొన్న కర్నాటకలో ప్రజలు ఎలా ఛీత్కరించారో తెలుసు కదా, అది జాతీయ స్థాయిలో రిపీటయ్యే ప్రమాదం ఉంది… బహుపరాక్… (అబ్బే, నోట్లను రద్దు చేయలేదు, జస్ట్, మార్కెట్ నుంచి ఉపసంహరిస్తున్నారు అంటూ కొందరు వివరణ, స్పష్టీకరణ ఇస్తున్నారు… మార్కెట్ నుంచి పూర్తిగా ఉపసంహరించడం, గడువు తేదీ ప్రకటించడం అంటే రద్దు చేసినట్టే…)
Share this Article